Sunday 24 February 2019

వొక నీహారిక కోసం

క్రియేటివిటీ వేరు, రాజకీయాలు వేరు.

ఈ ఒక్క వాక్యం నేను నా బ్లాగ్‌లో కనీసం ఒక డజన్ సార్లు రాసుంటాను.

అంతే కాదు.

రాజకీయాలు వేరు. వ్యక్తిగత సంబంధాలు కూడా వేరు.

తెలంగాణ ఏర్పాటుకు ముందు ఒక రేంజ్‌లో ఉతికి ఆరేసుకున్న చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లు .. కేసీఆర్, కేటీఆర్‌లు తర్వాత ఎలా సమావేశాలు, పార్టీల్లో కలుస్తున్నారో అందరికీ తెలిసిందే. ఇక్కడ ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.

తప్పేం లేదు.

ఆంధ్రాలో రెండు బధ్ధవిరోధ పార్టీలకు చెందిన లీడర్లు కొందరు సాయంత్రమైతే క్లబ్బుల్లో కలసి సరదాగా పెగ్గేసి మాట్లాడుకోవడం నాకు తెలిసిన మరొక చిన్న ఉదాహరణ.

ఇది కూడా తప్పేం కాదు.

నా వ్యక్తిగత/వృత్తిగత పనులమీద తరచూ నేను వైజాగ్, గుంటూరు, విజయవాడ వెళ్తుంటాను. ఆ నేపథ్యంలోనే నేను స్వయంగా తెలుసుకొన్న విషయం ఇది.

నాకు తెలంగాణలో ఉన్న స్నేహితులు బంధువులకంటే, ఏపీలోనే ఎక్కువమంది ఉన్నారు. నా టీమ్‌లో పనిచేసేవారిలో కూడా అందరూ ఉన్నారు. అదసలు పాయింట్ కానే కాదు.   

క్రియేటివిటీకి సంబంధించిన వృత్తుల్లో ఉన్నవారికి రాజకీయాల్లో సొంత అభిప్రాయాలు, సొంత భావనలు, దృక్కోణాలూ ఉండకూడదని ఎక్కడా లేదు. క్రీస్తు పూర్వం నుంచి కూడా ఇది చరిత్రలో ఉంది.

నా మాట మీద నమ్మకం లేనివాళ్లు ఒక్క సారి గూగుల్లో కొడితే సరిపోతుంది.

కావల్సినంత చరిత్ర దొరుకుతుంది.

అయితే, తవ్వకాల్లో దొరికే చరిత్ర, ఫిలాసఫీల్లో కూడా రకరకాల వ్యూ పాయింట్స్ ఉంటాయి.

ప్లేటో ఒకటి చెప్తాడు. అరిస్టాటిల్ ఇంకోటి చెప్తాడు.

అది వేరే విషయం.

కట్ టూ నీహారిక - 

నీహారిక పేరు బావుంటుంది.

నాకు గుర్తున్న వొక నీహారిక ('నీహారిక నాయుడు' అనుకుంటాను) అప్పట్లో ఫేస్‌బుక్‌లో మషీన్ గన్ పేల్చిన రేంజ్‌లో పోస్టులు పెడుతుండేవారు. సడెన్‌గా ఆ పేలుళ్ళు ఆగిపోయాయి. లేదా నేను ఫేస్‌బుక్‌ను పట్టించుకోవడం మానేశాను కాబట్టి ఆ నీహారికను మిస్ అవుతున్నానో తెలియదు.

ఎనీవేస్, ఆ నీహారిక వొకరు.

ఇంకో నీహారిక నా బ్లాగ్ పోస్టులను వొకటి రెండుసార్లు చడా మడా ఏకిపారేసిన నీహారిక.

బ్లాగ్ రాసే క్రియేటివ్ ఫ్రీడం నాకెంత ఉందో, నా బ్లాగ్ పోస్టులను విమర్శించే ఫ్రీడం రీడర్స్‌కు కూడా తప్పక ఉంటుంది. ఈ విషయాన్ని నేనంత పర్సనల్‌గా తీసుకోను.

నేనొక రాజకీయ నాయకుణ్ణి ఇష్ట పడతాను. ఆయన పార్టీని ఇష్టపడతాను.

ఇంకొకరు ఇంకో నాయకుణ్ణి/నాయకురాలిని ఇష్టపడొచ్చు. వారి పార్టీని ఇష్టపడొచ్చు.

ఈ కోణంలో చూసినప్పుడు - ఎవరి వ్యూ పాయింట్ వారికుంటుందనేది చాలా స్పష్టం. సమర్థించుకోడానికి కూడా ఎవరి వాదనలు వారికుంటాయి.

ఇది సర్వ సహజం.

దట్ సింపుల్.

నిజంగా ఇలాంటి నీహారికలు లేకపోతే, బ్లాగింగ్ కూడా బోరింగ్ అవుతుంది.

సో, థాంక్స్ టూ మై బ్లాగ్ రీడర్ నీహారిక.

అంతకు ముందు తన కామెంట్‌తో నా బ్లాగ్‌లో ఒక పోస్ట్ గురించి ఈ నీహారిక ఏకేసినప్పుడు, తన ఆ కామెంట్ ఇన్స్‌పిరేషన్‌తో ముత్యాలముగ్గు సినిమాలోని ఒక మంచిపాట గుర్తుకొచ్చింది నాకు.

వెంటనేదాని మీద ఒక బ్లాగ్ పోస్ట్ రాశాను.

సో, అంతా మన మంచికే అన్నమాట! 

ఈ నీహారిక, నేను ముందు చెప్పిన నీహారిక బహుశా ఒక్కరే అయ్యుంటారేమోనని నాకెందుకో ఎక్కడో కొడుతోంది.

కావొచ్చు, కాకపోవచ్చు కూడా.

ఏదేమైనా, నా తర్వాతి సినిమా హిట్ కోసం ఆశిస్తున్న ఈ నీహారిక త్వరలోనే ఒక మంచి స్క్రిప్టు నాకు ఇస్తారనీ, ఒక మంచి సౌండ్ ప్రొడ్యూసర్‌ను కూడా కనెక్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.

థాంక్స్ ఇన్ అడ్వాన్స్! :)  

7 comments:

 1. ఆ నీహారిక ఈ నీహారిక ఒక్కరే !
  కాలం కలిసి రావాలే గానీ ఒక్క విలన్ తప్ప కధ, స్క్రీన్ ప్లే,మ్యూజిక్,సింగర్, హీరో, హీరోయిన్ అందరూ దొరికారు. విలన్ దొరికితే మీరే దర్శకుడు ( మీ అంతట మీరే మాట ఇచ్చేసారు కాబట్టి మీరు కాదనకూడదు) ప్రొడ్యూస్ చేసేది నేనే అనుకోండి. నేచురల్లీ రాజకీయ రొమాంటిక్ మూవీ అవుతుంది.
  "నేనే రాణీ నేనే కంత్రీ" టైటిల్ !
  పోలా ? అదిరిపోలా ?
  ఇక అసలు విషయానికి వస్తాను. ఎన్నాళ్ళని నెహ్రూ మీదకి నెపం నెట్టేసి కాలం గడుపుతారు. స్వచ్చ భారత్ కార్మికుల కాళ్ళు కడిగేబదులు కశ్మీరీల కాళ్ళు కడిగి నెత్తినపోసుకుంటే సరిపోతుంది కదా ?

  ReplyDelete
  Replies
  1. "ఇక అసలు విషయానికి వస్తాను. ఎన్నాళ్ళని నెహ్రూ మీదకి నెపం నెట్టేసి కాలం గడుపుతారు. స్వచ్చ భారత్ కార్మికుల కాళ్ళు కడిగేబదులు కశ్మీరీల కాళ్ళు కడిగి నెత్తినపోసుకుంటే సరిపోతుంది కదా ?"
   ^^^
   దీనిమీద ఆల్రెడీ ఒక ట్వీట్ పెట్టాన్నేను మోదీజీకి. దాన్ని బట్టి మీరు అర్థం చేస్కోవచ్చు: https://twitter.com/MChimmani/status/1099650147858800640
   (Does @narendramodi ji really need performing all this? He has great opportunity before him. One shot 2 birds. Attack Pak and win elections!)
   ^^^

   వీలు చేసుకొని, మీ ఫోన్ నంబర్‌తో నాకు తప్పక మెయిల్ పెట్టండి నీహారిక గారూ! నా తర్వాతి సినిమా రచయిత, ప్రొడ్యూసర్ గారితో కొంచెం డిస్కస్ చేయాలి. :)
   (అంతకుముందు కూడా మనం స్క్రిప్ట్ గురించి మాట్లాడుకున్నట్టు గుర్తు.)
   Thanks in advance for your mail. My email: mchimmani@gmail.com

   Delete
  2. మీకు దొరకని విలన్ గురించి:
   ఆల్రెడీ విలన్ నా దృష్టిలో ఉన్నాడు. ఆ విషయం నాకొదిలిపెట్టండి. :) మెయిల్ పెట్టడం మాత్రం మర్చిపోకండి. Will be waiting ...

   Delete
 2. నీహారిక గారూ ,
  ఒక పాట రాసేందుకు నాకు రికమెండ్ చెయ్యండి ప్లీజ్ .

  ReplyDelete
  Replies
  1. మీ వివరాలు నాకు మెయిల్ చెయ్యండి రావుగారూ.

   Delete


  2. నీహారిక లక్కాకుల వారు విన్నకోట వారు అందరు చెప్పేది సరదా కని తెలియక బోల్తా పడుతున్నారా చిమ్మని గారు అని కొంత సందేహము కలుగు చున్నది :)


   జిలేబి

   Delete
  3. నిజం ఏంటో నాకు తెలుసండీ! :)

   Delete