Thursday 28 February 2019

ముందు అభినందన్‌ను వెనక్కి తెప్పించండి!

యుధ్ధంలో మొట్టమొదట గాయపడేది నిజం!

పుల్వామా టెర్రరిస్ట్ ఎటాక్ తర్వాత 12 రోజులపాటు రెండువైపుల నుంచి ఎలాంటి శబ్దంలేదు.

13వ రోజు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న భూభాగంలోని టెర్రరిస్ట్ క్యాంపులమీద సుమారు 20 నిమిషాలపాటు విజయవంతంగా సర్జికల్ స్ట్రైక్ చేసింది.

300 మంది టెర్రరిస్టులు, పాక్ ట్రెయినర్లను హతం చేశాం అని భారత్ చెప్పుకొంది. మనం కూడా "జయహో భారత్" అనుకొన్నాం. అయితే - పాక్ మీడియా కాని, విదేశీ మీడియా కాని సర్జికల్ స్ట్రైక్‌లో 300 మంది హతులైన విషయాన్ని ధృవీకరించలేదు.

ఏది నిజం?   

కట్ చేస్తే - 

మరొక 24 గంటల్లోనే పాక్ ఫైటర్ విమానాలతో మన భూభాగంపైన దాడి చేసింది .. దాన్ని తిప్పికొట్టడంలో మన వాళ్లు విజయం సాధించారు .. ఒక పాక్ ఫైటర్ విమానాన్ని కూల్చేశాం .. ఈ చర్యలో భాగంగా మన యుధ్ధవిమానం ఒకటి కూలిపోయింది .. మన పైలట్ ఒకరు మిస్సింగ్ .. పరిస్థితిని సమీక్షిస్తున్నాం ..

ఇలా చకచకా ఒకదానివెంట ఒకటి సంఘటనలు జరిగాయి. లేదా వివిధ సోర్సుల ద్వారా జరిగాయని విన్నాం, చదివాం, చూశాం.

నిజానికి భారత్ ఏమీ చెప్పక ముందే రష్యా టుడే, పాకిస్తాన్ న్యూస్ మన వింగ్ కమాండర్ అభినందన్‌ను పాక్ కస్టడీలోకి తీసుకొన్న వార్తను చెప్పేశాయి.

ప్రపంచమంతా అది నిజమా అబధ్ధమా అనుకుంటూ ఒక 4 గంటలు గడిపిన తర్వాత .. మన విదేశీ వ్యవహారాల ప్రతినిధి ప్రెస్‌ముందు ఆ విషయం ధృవీకరించాడు!

అసలు పాక్ భూభాగంలో మన పైలట్ అభినందన్ వారికి ఎలా దొరికాడు?

జెనీవా కన్వెన్షన్ రూల్స్‌కు వ్యతిరేకంగా పాక్ ఆర్మీ అభినందన్‌ను అంత ఓపెన్‌గా ఏ ధైర్యంతో అలా చిత్రవధ చేయగలిగింది? తర్వాత మళ్లీ అతన్ని మేం బాగా చూసుకుంటున్నాం అని ఒక వీడియో డ్రామా ఎందుకు ఆడింది? ఇప్పుడు అభినందన్‌ను గుప్పిట్లో పెట్టుకొని "మేం చర్చలకు సిధ్ధం" అని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అంత కూల్‌గా ఎలా అనగలుగుతున్నాడు?

అసలేం జరిగింది?

ఇప్పుడేం జరగబోతోంది?

జెనీవా కన్వెన్షన్ ప్రకారం పాక్ మన వింగ్ కమాండర్ అభినందన్‌ను 7 రోజుల లోపల సురక్షితంగా మనకు అప్పగించాలి. ఆ పని ఇప్పుడు పాక్ చేస్తుందా?

ఎన్నో అనుమానాలు .. మరెన్నో ప్రశ్నలు.

అందుకే అన్నారు - "The first casualty of war is - truth" అని.

పాక్ ఏమీ చెయ్యలేదు .. మనముందు ఉట్టిదే అనుకున్నాం.

అంత ఉట్టుట్టిదేం కాదు అని తేలిపోయిందిప్పుడు.

రెండు దేశాల మధ్య యుధ్ధమంటూ జరిగితే ఇదివరకటిలా నెలలూ, సంవత్సరాలు జరగదు. రెండు దేశాల్లోని ముఖ్యమైన ప్రధాన నగరాలు కేవలం కొన్ని గంటల్లోనే బూడిదైపోతాయి.

మనకున్న భారీ యుధ్ధ సామగ్రి, బలగం, శక్తి రీత్యా చివరికి మనమే గెలుస్తాం. కానీ అప్పటికే చాలా మూల్యం చెల్లించుకొంటాం.

పాక్ విషయంలో కూడా అంతే. దాదాపు నామరూపాల్లేకుండా పోతుంది.

ఇక యుధ్ధం అంటూ మొదలైతే అది ప్రపంచస్థాయిలో కూడా ఏ క్షణం ఎలాంటి మలుపుకయినా దారితీసే ప్రమాదముంటుంది.

కట్ బ్యాక్ టూ మన అభినందన్ -    

ఇప్పుడు పాక్ గుప్పిట్లో మన వింగ్ కమాండర్ ఉన్నాడు.

వాళ్లు చిత్రవధలు పెట్టినా "నన్ను బాగా చూసుకొంటున్నారు" అని కాఫీ తాగుతూ కూల్‌గా వీడియోలో చెప్పాడు. కానీ, అందులో నిజమెంతో అభినందన్‌ను పట్టుకున్న అంతకు ముందటి వీడియోనే చెప్తుంది.

ఇమ్రాన్ ఖాన్ చెప్పాల్సింది చెప్పాడు, "చర్చలకు మేం రెడీ" అని.

బాల్ ఇప్పుడు మన కోర్టులో ఉంది.

భారత్ ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోబోతోంది?

పాక్ కస్టడీలో ఉన్న మన వింగ్ కమాండర్  అభినందన్‌ను సురక్షితంగా వెనక్కి రప్పించగలదా?
 
ఈ ప్రశ్నకు జవాబు ఒక్క మోదీ మాత్రమే చెప్పగలడు.   

3 comments:

 1. మూడు రోజుల క్రితం ఏవో ఫలానా చోట చావుదెబ్బ కొట్టాం; అక్కడ ఎవరూ లేరుట. బోల్డు మంది పోయారు చూసుకోండి మా ప్రతాపం అని చెప్పుకుంటాం. ఇది చేస్తాం అది చేస్తాం, పొడి చేస్తాం. అవసరం అయినప్పుడు ఇవన్నీ మర్చిపోయి "పొడిపించుకుంటాం!" ఇప్పుడు వాళ్ల కాళ్ళు పట్టుకుని దయచేసి మావాణ్ణి విడిపించండి అని దేబిరిస్తాం. మన పనికిరాని తనానికి భగవద్గీతలూ, వేదాలు బయటకి తీసి మేము శాంతి కాముకలం అని చెప్పుకుంటాం. అయ్యో కాదు మరీ, ఓ పవిత్రమైన గ్రంధం చూపించకపోతే ఎలా?

  ఏరీ ఈ మూడు రోజులు ట్విట్టర్ ని హోరెత్తించిన ప్రముఖులందరూను? ఎవరికీ నోరు పెగలదే?

  అద్భుతం మన ఆరంభ శూరత్వం ! మేరా భారత్ మహాన్!!!

  ReplyDelete

 2. మోడీ కి ముందు ఇమ్రాన్ ఖాన్ చెప్పేసేడు
  మీటపా కొంత లే టు గా వేసి వుండాలె :)  జిలేబి

  ReplyDelete
 3. తెచ్చారు 48 గంటలలో, ఇది ఇమ్రాన్‌ఖాన్ గారి ఘనత చెప్పేయండి.

  ReplyDelete