Saturday 23 February 2019

వొక చరిత్రకు అయిదేళ్లు!

తెలంగాణ వస్తే అదైపోద్ది, ఇదైపోద్ది అని ఓ నానారకాల కథలు చెప్పారు.

ఇప్పుడేమైంది?

కరెంటు లేక, తెలంగాణ మొత్తం అంధకారమైపోతుందన్నాడొకాయన.

నియాన్ లైట్ల వెలుగులో అసలు కంటికి కనిపించకుండాపోయిన అతనెక్కడ?

నిండు అసెంబ్లీలో "మీ తెలంగాణకు ఒక్క పైసా ఇయ్యనుపోండి" అని .. అదే చిత్తకార్తె మనిషి మొరిగాడు.

ఇప్పుడు అదే అసెంబ్లీలో మా తెలంగాణకు 2 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టుకున్నాం.

ఎక్కడా పెద్దమనిషి?

రాయాలంటే ఇదో పెద్ద లిస్ట్ అవుతుంది.

కట్ చేస్తే - 

400 కి పైగా పథకాలు.
40 వేల కోట్లకు పైగా నిధులు.

నిరంతరం కరెంటు.
నిండిన చెరువులు.
పారుతున్న నీళ్లు.
గ్లోబల్ బిజినెస్‌ల ప్రవాహం.
పెరుగుతున్న ఆదాయం.
ప్రపంచవ్యాప్తంగా పేరు.
అనుసరిస్తున్న ఇతర రాష్ట్రాలు, కేంద్రం.

గత 70 ఏళ్లలో దేశంలో ఎక్కడా జరగని పనులు ఇక్కడ ఒకే ఒక్క టర్మ్‌లో పూర్తిచేసి మరీ చూపించడం.

గత 70 ఏళ్లలో ఏ ఇతర రాష్ట్రంలో కాని, కేంద్రంలో కాని ఎవ్వరూ కలలో కూడా చూడని పథకాలను విజయవంతంగా ప్రవేశపెట్టి పరుగెత్తించడం.   

అనుక్షణం తెలంగాణ కోసం తపన.
అహరహం ఆలోచనలు.
అమితవేగంతో ఆచరణ.

విజయవంతమైన మొదటి ఐదేళ్లలో ఇవీ మనం చూసిన నిజాలు.

రెండోసారి ఎలెక్షన్లలో కూడా తిరుగులేని విజయ దుందుభి.

దటీజ్ కేసీఆర్.

కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర రావు, సి ఎం మాత్రమే కాదు. కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమానికి పర్యాయపదం. తెలంగాణకు పర్యాయపదం. మూర్తీభవించిన మానవత్వానికి పర్యాయపదం.

కేసీఆర్ అంటే .. ఒక చరిత్ర. 

4 comments:

 1. చరిత్ర తవ్వుకోవడం ఎందుకుగానీ మీ నుండి మరో హిట్ సినిమా రావడానికి అడ్డుపడుతున్న ఆంధ్రావాళ్ళు ఎవరు ?

  ReplyDelete
  Replies
  1. ఇంకెవరు, మీరే!

   మంచి స్క్రిప్ట్ రాసి, ఇంకో మంచి ప్రొడ్యూసర్ని కనెక్ట్ చేయండి.

   Jokes apart, ఈ బ్లాగ్ పోస్ట్‌కూ, నా హిట్ సినిమాకు సంబంధం లేదు. సినిమాలు నా ప్రధాన వ్యాపకం కాదు. ఈ బ్లాగ్ లాగే అదొక హాబీ. ప్రొడ్యూసర్లు, హీరోల చుట్టూ తిరక్కుండా, కొందరం లైక్ మైండెడ్ తలా కొన్ని డబ్బులేసుకొని ఏదో లోయెస్ట్ బడ్జెట్‌లో అన్నీ కుదిరినప్పుడొక సినిమా తీస్తుంటాను. ఇంకొకటో రెండో తీశాక ఆపేయొచ్చు కూడా. దానివల్ల ఎవ్వరికీ నష్టం లేదు. ఎవ్వరూ నన్ను ఆపడం లేదు. ఏమైనా, నానుంచి హిట్ ఆశిస్తున్న మీ సహృదయానికి నమస్సులు. మీరే పూనుకోవాలి.

   ఎందుకంటే, ఇదివరలా కాదు. ఇప్పుడు ఒక్క హిట్టిస్తే చాలు, పదేళ్లకు సరిపడా రాయల్‌గా బ్రతికేంత రెమ్యూనరేషన్ వస్తుంది! మంచి స్క్రిఫ్త్ ఇస్తే .. మీక్కూడా అంతే.

   Thanks for your comment and time. :)

   Delete
 2. Manohar Garu. I appreciate KCR for the good schemes in his tenure. Especially the yadadri project. I am a huge fan of KTR too. Still I feel KCR tends to lose balance in his speech occasionally. Don't you think the vitriolic campaign and language used by channels like t news is objectionable? The way you referred to a former CM in your article is in poor taste. Don't you find running government without ministers for 69 days questionable. A CM never vists secretariat. How do you explain that. Telangana which was a surplus state in 2014 now has a huge debt of Rs. 2.3 lakh crores. Please think over the points raised by me. I expect a creative person like you to be balanced in expression. Very disappointed with your one sided political articles.

  ReplyDelete
  Replies
  1. "The way you referred to a former CM in your article is in poor taste."
   ^^^
   I agree with you sir ji. That tells my feelings on that particular gentleman. One CM banned using "Telangana" word in the house. Another CM shouted in the full house as above. KCR just proved how utterly wrong every one against Telangana in every aspect. Still I agree with you, I shouldn't have used those words.

   Coming to the other points you have raised can't be answered here in brief. But I CAN justify them in a bit elaborate blog posts in future.

   Thanks for your comment and time. :)   Delete