Monday 26 November 2018

Happy Birthday to Me!

ఇవాళ నా పుట్టినరోజు.

నేనేం సెలబ్రిటీ కాదు.

కానీ, ఫేస్‌బుక్ టైమ్‌లైన్ ఓపెన్ పెట్టాలి. ఫోన్‌కు అందుబాటులో ఉండాలి.

నా మిత్రులు, శ్రేయోభిలాషులైనవారందరి శుభాకాంక్షలను నేను తప్పక గౌరవిస్తాను. వారి అభిమానానికి సర్వదా కృతజ్ఞుణ్ణి.

కానీ, ఎక్కువభాగం, ఇదంతా ఒక అనవసరమైన ఆబ్లిగేషన్. హిపోక్రసీ.

అనవసరంగా కొనితెచ్చుకొనే ఒక మానసిక వత్తిడి.

కనీసం కొన్ని గంటలైనా ఈ హిపోక్రసీకి, ఈ వత్తిడికి దూరంగా ఉండాలనిపించింది.

అనుకోకుండా అలా ఉండే అవకాశాన్ని ఈసారి నా బర్త్‌డేనే నాకు గిఫ్ట్‌గా ఇచ్చినట్టుంది.

నిన్నరాత్రి 9 గంటలనుంచి ఫోన్‌లో ఏదో టెక్నికల్ ప్రాబ్లమ్ ..

ఇంక లాపీ కూడా ఓపెన్ చేయాలనిపించక దాన్ని కూడా దూరంగా పెట్టాను.

మొత్తం ఆఫ్‌లైన్! 

సుమారు 16 గంటలయ్యింది ..

చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ లేని ఈ జీవితమే బాగుంది.

నిజంగా ఆండ్రాయిడ్ ఫోన్ తీసేసి, ఒక చిన్న బ్లాక్ అండ్ వైట్ నోకియా మొబైల్‌తో, "ఫోన్‌ను ఫోన్‌లా మాత్రమే వాడే రోజు కోసం" నేను ఎదురుచూస్తున్నాను.

మిగిలిన అత్యవసరాలకు ఈమెయిల్, టెక్‌స్ట్ మెసేజ్‌లు చాలు నాకు.

ట్విట్టర్‌లు, ఫేస్‌బుక్‌లు ఎట్సెట్రా .. మనం కావాలనుకున్నప్పుడు, ఎప్పుడో కొంచెంసేపు, లాపీ ఓపెన్ చేసి మాత్రమే చూసుకోవాలన్నది నా ఉద్దేశ్యం.

ఇప్పుడీ బ్లాగ్ అలాగే రాస్తున్నాను.

కట్ చేస్తే - 

సుమారు ఆరేళ్లక్రితం, ఒక యాక్సిడెంట్‌లో 17 ముక్కలయిన నా ఎడమకాలును నట్స్ అండ్ బోల్ట్స్‌తో సరిచేశారు. దురదృష్టవశాత్తూ, నా అజాగ్రత్తవల్ల కొన్నిరోజుల క్రితం అదే కాలు మీద మళ్లీ గాయం అయ్యింది.

కర్ర, ప్లస్ ఒక మనిషి పక్కన లేకుండా నడవలేకపోతున్నాను. బయట తిరగలేకపోతున్నాను. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. అవసరాన్నిబట్టి, వీలైనంత తిరుగుతున్నాను. జర్నీలు కూడా చేస్తున్నాను.

అయితే, ఇంటా బయటా వత్తిడులకు ఈ నేపథ్యంతో ఏమాత్రం పని ఉండదు. ఏది ఎలా ఉన్నా, జరగాల్సిన టైమ్‌కు అన్నీ జరగాల్సిందే.

ఇప్పుడు కాలికి మళ్లీ ఆపరేషన్ తప్పదన్నారు. కొన్నిరోజుల్లో హాస్పిటల్‌లో అడ్మిట్ అవుతున్నాను. ఇప్పటికే ఈ విషయంలో చాలా ఆలస్యమైంది.

ఈలోగా కొన్ని పనులు చాలా వేగంగా పూర్తిచేయాల్సి ఉంది. 

ప్రస్తుతం ఆ బిజీలోనే ఉన్నాను.

నా జీవితంలో "నేను కోరుకున్న స్వేఛ్చ"ను అతి తొందరగా సాధించాలని ఈ బర్త్‌డే సందర్భంగా నన్ను నేనే విష్ చేసుకుంటున్నాను.

త్వరలో వచ్చే ఆ రోజు కోసమే బాగా పనిచేస్తున్నాను. ఎదురుచూస్తున్నాను.

నా జీవితంలోని ఈ దశలో, నేను పెట్టుకొన్న ఈ చిన్న గమ్యాన్ని అతి త్వరలోనే నేను చేరుకోగలననే నా నమ్మకం.

తప్పక చేరుకొంటాను కూడా. 

Happy Birthday to Me! 

4 comments:

  1. Wishing you a fast recovery and the best health possible. Get well soon.

    Happy Birthday !

    ReplyDelete
  2. Get well soon. take rest. Meeru aa central govt jobs lo undipovalsindemo, ee badhalu tensions thappevi. emantaaru

    ReplyDelete
    Replies
    1. May be you're right. But once decision taken, I have to face it. Malli venakki velle avakasham ledugaa?! :)
      Thanks a lot for your comment.

      Delete