Monday 19 November 2018

తెలంగాణ వస్తే ఏమొచ్చింది?

ఈ ప్రశ్న చాలాసార్లు వింటుంటాము.

అది మామూలుగా అడగటం కావొచ్చు. వ్యంగ్యం కావొచ్చు.

ఏం ఫరవాలేదు. మనదగ్గర వందల జవాబులున్నాయి.

 > వృధ్ధులకు పెన్షన్ ఒక్కసారిగా వెయ్యిరూపాయలకు పెరిగింది.
> ఒంటరి మహిళలకు పెన్షన్ కొత్తగా వచ్చింది.
> వికలాంగులకు 1500 పెన్షన్.
> "కళ్యాణలక్ష్మి"/"షాదీ ముబారక్" పథకం కింద పేద అమ్మాయిల పెళ్లిళ్లకు 1,00,116 సహాయం.
> తెలంగాణ పండుగ బతుకమ్మకు ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకురావడం.
> కేవలం ఒక ప్రాంతపు గుప్పిట్లోనే ఉన్న రవీంద్రభారతిలో కొత్తగా తెలంగాణ కళలు, సినిమాల అభివృధ్ధికి వివిధ కార్యక్రమాలు, ఏర్పాట్లు, సౌకర్యాలు కల్పించడం. 
> పనులులేక, రుణభారంతో మరణిస్తున్న చేనేతన్నకు ఎన్నోరకాల చేయూత.
> రాష్ట్రమంతా అర్హులైన ఆడబిడ్డలకు బతుకమ్మ చీరెలు.
> రాష్ట్రమంతా 24 గంటల కోతల్లేని విద్యుత్ సరఫరా.
> రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ సరఫరా.
> రైతుల రుణమాఫీ.
> రైతుకు ప్రతిపంటకు నగదు సహాయంతో "రైతుబంధు" పథకం.
> రైతుకు 5 లక్షల ఉచిత "రైతు భీమా" పథకం.
> బాలింతలకు "కేసీఆర్ కిట్."
> చదువుకొనే అమ్మాయిలకు "హైజీన్ కిట్."
> హాస్టల్లలో ఉండి చదువుకొనే పిల్లలకు భోజనంలో సన్న బియ్యం.
> అమ్మాయిలను, ఆడవాళ్లను వేధించే వాళ్ల పాలిట "షి టీమ్‌స్."
> దేశంలోనే అత్యుత్తమస్థాయికి చేరుకొనేలా సాంకేతికంగా, శిక్షణాపరంగా ఆధునికం చేసిన పటిష్టమైన పోలీస్ వ్యవస్థ.
> రాష్ట్రంలో పేకాట, గ్యాంబ్లింగ్ బంద్. ఆన్ లైన్ లో కూడా లేదు.
> ఆధునికంగా మారిన ప్రభుత్వ ఆసుపత్రులు, స్కూళ్లు.
> జిల్లాకొక ఉచిత డయాలసిస్ సెంటర్.
> రాష్ట్రంలో ఉచితంగా కంటి పరీక్షలు, ఉచితంగా కళ్ళద్దాలు ఇచ్చే కార్యక్రమం: "కంటివెలుగు." రికార్డుస్థాయిలో ఇప్పటికే సుమారు 85 లక్షలమందికి కంటిపరీక్షలు జరిపి, అవసరమైనవారికి కళ్లద్దాలివ్వటం జరిగింది.
> ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరగటం. ప్రజల్లో నమ్మకం పెంచడానికి, స్వయంగా ఆసుపత్రి డాక్టర్స్ కూడా అదే ప్రభుత్వ ఆసుపత్రిలో డిలివరీ కావడం.
> ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్లు గణనీయంగా పెరగటం.
> యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ వంటి ఎన్నో ప్రపంచస్థాయి కంపెనీలు హైదరాబాద్‌లో వారి కొత్త యూనిట్లు స్థాపించడం.
> సాఫ్ట్‌వేర్ రంగంలో ఎగుమతులు అత్యధికస్థాయిలో పెరగటం. 
> టి ఎస్ "ఐపాస్" కింద 15 రోజుల్లో అన్నిరకాల పరిమితులనిస్తూ ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామికవేత్తలను ఆకర్షించడం, ఇప్పటికే వందలాది యూనిట్ల ప్రారంభం.
> వరంగల్ లో టెక్స్‌టైల్ పార్క్.
> హైదరాబాద్ లో ఫార్మాసిటీ.
> ఇంటింటికీ నల్లా.
> ఒకప్పుడు ఎడారిలా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లాలో ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చదనం కంపించేలా నీటిపరవళ్లు.
> అత్యంత వేగంగా అన్ని పరిమితులనూ పొంది, పూర్తికావస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు.
> అనేక నీటిపారుదల పథకాల కోసం "మిషన్ భగీరథ."
> వందల ఏళ్ల తర్వాత చెరువుల పునరుధ్ధరణతో "మిషన్ కాకతీయ."
> పరిపాలనా సౌలభ్యంకోసం, ప్రజల సౌకర్యం కోసం 31 కొత్త జిల్లాల ఏర్పాటు.
> పరిపాలన సంబంధమైన, ఇతర అంశాల్లో సుమారు 24 విషయాల్లో దేశంలోనే అగ్రస్థానం సాధించడం.
> రైతుబంధు, రైతుభీమా పథకాలు ఐక్యరాజ్యసమితి గుర్తింపు సాధించడం.

... ఇట్లా కనీసం ఇంకో 400 అంశాలను చెప్పగలను.

నేనేకాదు, మాతృభూమి తెలంగాణను ప్రేమించే ప్రతి తెలంగాణ బిడ్డ చెప్పగలడు. ఇక్కడ తెలంగాణలో ఉన్నా .. ఎక్కడో కెనెడా, యూకే, యూరోపుల్లో ఉన్నా కూడా చెప్పగలడు.

మనసుంటే మార్గం ఉంటుంది.

ఇప్పటివరకూ, రాజకీయాలంటే దోచుకోవడం అన్నదొక్కటే తెలుసు.

కానీ, ప్రజలకు సేవ చేయటమే నిజమైన రాజకీయం అనీ, ప్రజలకోసం ఎంతైనా చేయొచ్చుననీ, దానికి ఆకాశమే హద్దనీ కొత్త పాఠాలు నేర్పారు తెలంగాణ సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు.

ఈ పాఠాల్లో చాలావాటిని పక్క రాష్ట్రాలు మాత్రమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా ఫాలో అవుతుంటం విశేషం.

తెలంగాణ వస్తే చాలా మార్పు వచ్చింది. ఆ మార్పు ఒక్క తెలంగాణలోనే కాదు, దేశమంతా వచ్చింది.

రాజకీయాల్లో ఒక గుణాత్మక మార్పుకు శ్రీకారం ఇక్కడ తెలంగాణలోనే జరిగింది.

ఇప్పుడు రాజకీయం అంటే అధికారం ఒక్కటే కాదు, ప్రజల పట్ల బాధ్యతకూడా.

దటీజ్ కేసీఆర్.

దటీజ్ తెలంగాణ. 

1 comment:

  1. చాలా బాగా చెప్పారు.. నిజానికి దార్శనికత ఉన్న నేత కీసీయార్ ... కాంగ్రెస్ కుతంత్రాలను తిప్పికొట్టి మరోసారి ప్రజలు టీ.ఆర్.ఎస్ కు పట్టం కడతారని ఆసిస్తూ

    ReplyDelete