Sunday 28 October 2018

ప్రాధాన్యాలు ముఖ్యం!

నా ప్రియమైన నేస్తం 'నగ్నచిత్రం' బ్లాగ్‌కు ఇంక శెలవ్!

నిజంగా.

ఆగస్టు, 2012 - సెప్టెంబర్, 2018.

సుమారు 6 సంవత్సరాల సహచర్యం తర్వాత, నాకెంతో ప్రియమైన నా బ్లాగ్ "నగ్నచిత్రం"కు ఈరోజు నిజంగా గుడ్‌బై చెప్తున్నాను.

దస్విదానియా. సయొనారా. గుడ్‌బై. సెలవు ..

కట్ చేస్తే -  

"మైండ్ చేంజెస్ లైక్ వెదర్" అన్నారు.

ఇంతకుముందు కూడా రెండు మూడుసార్లు ఇలా గుడ్‌బై చెప్పాలని చాలా గట్టిగా అనుకొన్నాను. కానీ, అంత ఈజీగా ఆ పని చేయలేకపోయాను.

కొన్ని అలవాట్లు అంత ఈజీగా వదలవు.

కానీ, ఇప్పుడు మాత్రం ఊరికే అనుకోవడం కాదు. ఈ విషయంలో నిర్ణయం ఇప్పుడు నిజంగా తీసేసుకున్నాను.

అంతా ఒక్క క్షణంలో జరిగింది.

ఇలా అనుకున్నాను .. వెంటనే ఈ బ్లాగులో, ఈ చివరి పోస్టు రాస్తున్నాను!

ప్రాధాన్యాలు చాలా ఉన్నాయి. వాటిలో కొన్నిటికి నా బ్లాగ్ కూడా ఉపయోగపడొచ్చు. కానీ, ఆ పని ట్విట్టర్, ఫేస్‌బుక్, ఇన్స్‌టాగ్రామ్‌ల ద్వారా కూడా నేను చేయగలను.

చెప్పాలంటే ట్విట్టర్ ఒక్కటి చాలు.

వివిధరంగాల్లో ఉన్న ఎంతోమంది స్టాల్‌వార్ట్స్ ఈ మినీ బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌ను ఎంతో అద్భుతంగా వాడుతున్నారు.

నేను ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నా కాబట్టి, నా టీమ్ "తప్పదు, ఫేస్‌బుక్‌ను ఈ సినిమా అయ్యేదాకా కంటిన్యూ చెయ్యాల్సిందే" అని పట్టుబట్టడంవల్ల ... నాకు అత్యంత బోరింగ్‌గా ఉన్నా, తప్పనిసరై ప్రస్తుతం ఫేస్‌బుక్‌ను కంటిన్యూ చేస్తున్నాను.

కొన్ని తప్పవు, మనకు ఇష్టం ఉన్నా లేకపోయినా.

కట్ టూ 'సెలెక్టివ్ మెమొరీ' - 

ఈ బ్లాగ్‌లోని కొన్ని ఎన్నికచేసిన బ్లాగ్ పోస్టులతో "నగ్నచిత్రం" పేరుతో తీరిగ్గా, ఒక ఏడాది తర్వాత ఒక పుస్తకం తప్పక పబ్లిష్ చేస్తాను.

అది నా జ్ఞాపకం కోసం.

దాని పీడీఎఫ్ ఫ్రీగా ఆన్‌లైన్‌లో పెడతాను. వేలాదిమంది నా ప్రియమైన బ్లాగ్ రీడర్స్ కావాలనుకొంటే దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని చదువుకోవచ్చు.

ఇప్పటికే, ఈ బ్లాగ్‌లో రాసిన కొన్ని పోస్టులు, మరికొన్ని ఆర్టికిల్స్ కలెక్షన్‌తో కలిపి కేసీఆర్ గారి మీద ఒక పుస్తకం అతి త్వరలో పబ్లిష్ చేస్తున్నాను. బహుశా, ఇప్పుడు రాబోతున్న ఎలక్షన్స్‌కు ముందే.

నా ఇప్పటి అత్యవసర ప్రాధాన్యాలన్నీ పూర్తిచేసుకున్న తర్వాత, మళ్ళీ నా ఆనందం కోసం, నేను తెలిసిన నా నిజమైన మిత్రులు, శ్రేయోభిలాషులకోసం, ఓ కొత్త బ్లాగ్ ప్రారంభించాలని ఒక ఆలోచన.

దాని గురించి ట్విట్టర్‌లో చెప్తాను. ఇంకా చాలా టైమ్ ఉంది.

ఇదే నెల 31 నాడు ఫేస్‌బుక్‌కి కూడా గుడ్ బై చెప్తున్నాను. నిజానికి ఎఫ్ బి కి కూడా గుడ్ బై ఈరోజునుంచే! కాకపోతే, ఈ నెలాఖరువరకు, నా ట్విట్టర్ లింక్‌ను అక్కడ నా ఎఫ్ బి టైమ్‌లైన్ మీద కొన్నాళ్ళపాటు ఉంచాలని నా ఉద్దేశ్యం.

సో, ఇకనుంచీ ఓన్లీ ట్విట్టర్.   

ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. :) 

No comments:

Post a Comment