Sunday 21 October 2018

పోలీసు అమరవీరులకు ఆత్మీయ శ్రధ్ధాంజలి!

సోషల్ మీడియాలో 'అత్యంత మాస్ సోషల్ మీడియా' అయిన ఫేస్‌బుక్ .. ఈమధ్య మరీ పరమ చెత్త అయిపోయింది.

అయిపోయింది అనేకంటే, దాన్నలా చేసుకొన్నాం అనుకోవడం బెటర్.

మన ఫ్రెండ్స్ లిస్టులో ఉన్నవాళ్ళను జాగ్రత్తగా ఎన్నికచేసుకోకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుంది.

ట్విట్టర్‌కు ఈమధ్య నేను ఎక్కువగా ఎడిక్టు కావడానికి కారణం కూడా ఇదే.

ఫేస్‌బుక్ స్థాయి 'ఫిష్ మార్కెట్ కల్చర్' ట్విట్టర్లో ఉండదు.

ట్విట్టర్‌ వేరే.

అదొక ఎలైట్ సోషల్ మీడియా.

పాయింటుకొస్తే -

ప్రియా వారియర్ కన్నుగీటిన పోస్టుకు ఫేస్‌బుక్‌లో మిలియన్ల లైకులు, కామెంట్లు!

కానీ, పోలీస్ అమరవీరుల సంస్మరణదినం రోజు, విధినిర్వహణలో మనకోసం అసువులుబాసిన ఎందరో వీర జవాన్లు, పోలీసుల త్యాగాన్ని స్మరించుకొనే పొస్టులు మాత్రం మనకు అసలు కనిపించవు.

కనిపించినా, వాటికి ఒక్క లైకు ఉండదు!

ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాల్సిందే. కానీ, దానితోపాటు దేశంపట్ల, మనల్ని కాపాడుతున్న మన భద్రతా వ్యవస్థపట్ల కూడా మనకు కనీస స్పృహ ఉండాలి.

ఆ స్పృహ బలవంతంగా చెప్తే వచ్చేదికాదు.

ఒక బాధ్యతగా మనం ఫీలవ్వాలి.

అదే మనం అమరులైన మన వీర జవాన్లు, పోలీసులకిచ్చే గౌరవం. గౌరవ వందనం.      

No comments:

Post a Comment