Wednesday 15 November 2017

న్యూ-ఏజ్ ఫ్రీడమ్ లైఫ్‌స్టయిల్!

మార్కెట్‌లో ఉన్న అనేక ఆర్థిక ఒడిదొడుకులతో ఎలాటి సంబంధంలేకుండా .. తన పనినీ, తన లైఫ్‌నీ సంపూర్ణ స్వేఛ్ఛతో లీడ్ చేయగలుగుతున్నవాడే సిసలైన మగాడు.

ఇలాంటోన్ని అనొచ్చు ..
"ఆడు మాగాడ్రా బుజ్జీ" అని!

అలాగని చెప్పి, వాడు బాగా బ్లాక్‌మనీ ఉన్నవాడనికాదు నా ఉద్దేశ్యం.

ఫైనాన్షియల్ ఇంటలిజెన్స్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ మస్త్‌గా ఉన్నోడని!

ఫైనాన్షియల్‌గా ఇలాంటి స్థితప్రజ్ఞ దశకు చేరుకోవడం అంత సులభమైన విషయం కాదు. నూటికి 90% మందికి ఇది అస్సలు చేతకాదు. అందులో నేనూ ఒకన్ని అని చెప్పుకోడానికి నేనేం సిగ్గుపడటంలేదు.

కాకపోతే నా విషయంలో ఇది తాత్కాలికం.

మన జీవితంలో చెప్పాపెట్టకుండా సడెన్‌గా వచ్చే చిన్న చిన్న సునామీలకు ఏమాత్రం ఎఫెక్టు కాకుండా, ఈ స్థాయిలో బాగుపడటమే నా దృష్టిలో సిసలైన ఫైనాన్షియల్ ఫ్రీడమా్!

ఆ ఫ్రీడమ్ ఉంటే చాలు. ఏదైనా సాధ్యమే. ఎవరికైనా సాధ్యమే.

ఉన్న ఒక్క జీవితాన్ని హాయిగా, హాప్పీగా గడిపేయవచ్చు.

మరొకరిని ఇబ్బంది పెట్టకుండా, బాధపెట్టకుండా .. 

2 comments:

  1. "మార్కెట్‌లో ఉన్న అనేక ఆర్థిక ఒడిదొడుకులతో ఎలాటి సంబంధంలేకుండా .. తన పనినీ, తన లైఫ్‌నీ సంపూర్ణ స్వేఛ్ఛతో లీడ్ చేయగలుగుతున్నవాడే సిసలైన మగాడు."

    ఈ లైన్ చాలా బాగుంది, కాని మగాడు అనే బదులు మనిషి అంటే ఇంకా బాగుండేది. అయితే మీరు ఉన్న ఫీల్డ్‌లో ఆ స్థాయికి చేరుకోవడం సులభం కాదు.

    ReplyDelete
    Replies
    1. 2 విషయాల్లోనూ మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. మొదటిది ఎడిట్ చేస్తాను. రెండోది అంత ఈజీ కాదు, నిజమే.

      Delete