Saturday 11 March 2017

ది లేటెస్ట్ బిగ్ బిజినెస్!

సినిమా ఇప్పుడొక బిగ్ బిజినెస్.

ఇందులో ఎలాంటి డౌట్ లేదు.

సరైన మార్కెట్ స్టడీ,  అవగాహనతో ప్లాన్ చేసి సినిమా తీస్తే ఎలాంటి నష్టం ఉండదు. లాభాలు కోట్లలో ఉంటాయి.

అవగాహన లేకుండా వేసే స్టెప్పులు, తీసుకొనే నిర్ణయాలు మాత్రమే ఇక్కడ పనిచేయవు.

అది ఇక్కడనే కాదు. ఏ బిజినెస్‌లోనైనా అంతే.

చిన్న బడ్జెట్ సినిమా అయినా, పెద్ద బడ్జెట్ సినిమా అయినా .. 'మనీ ఫ్లోటింగ్', కాంటాక్ట్స్ విషయంలో ఈ ఫీల్డులో ఉండేంత ఫెసిలిటీ, ఫ్లెక్సిబిలిటీ మరే బిజినెస్‌లోనూ ఉండదు.

80 కి పైగా సినిమాలు తీసిన ఒక సెన్సేషనల్ ప్రొడ్యూసర్ మాటల్లో .. ఒక్క ముక్కలో చెప్పాలంటే .. "అసలు సినిమాల్లో ఉన్నంత డబ్బు మరెక్కడా లేదు."

ఇప్పుడు తెలుగు సినిమా మార్కెట్ రేంజ్ కూడా ఊహించనంత స్థాయిలో పెరిగింది.

కొన్ని లక్షలుమాత్రమే పెట్టి, కొత్తవాళ్లతో తీసే చిన్న సినిమా సుమారు 20 కోట్లు మార్కెట్ చేస్తుంటే, కోట్లు పెట్టి తీస్తున్న పెద్ద స్టార్స్ సినిమాలు 200 నుంచి 1000 కోట్ల మార్కెట్‌ను  ఎప్పుడో దాటేశాయి.

ఏ బాహుబలి లాంటి సినిమానో తప్ప .. ఇదంతా కొన్ని నెలల్లో జరిగే బిజినెస్!

ఇప్పటి సినిమా వ్యాపార వాస్తవం ఇలా ఉంటే -
 
'ఏ వ్యాపారంలో అయినా పెట్టుబడి పెట్టొచ్చు కానీ, సినిమాల్లో మాత్రం పెట్టొద్దు' అని మొన్నటివరకూ సొసైటీలో ఒక గుడ్డి వాదన ఉండేది. ఇదొక 'హెవీ గ్యాంబ్లింగ్' అని వాళ్ల ఉద్దేశ్యం.

కానీ అదంతా అర్థంలేని ఉట్టి బుల్‌షిట్ అన్న నిజాన్ని ఇప్పటి తరం అగ్రెసివ్ బిజినెస్‌మెన్ గుర్తించారు. కాబట్టే, "అబ్బో సినిమాల్లోనా!" అని ఇంతకుముందులా భయపడ్డంలేదెవ్వరూ.

అసలు సినిమాల్లో ఎంత డబ్బుందో కూడా గుర్తించారు.

అందుకే ఇప్పుడు ఎందరో ఎన్ ఆర్ ఐ లు, కార్పొరేట్‌లు, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్, వాళ్లూ వీళ్లూ అని లేకుండా, అందరూ .. ఇటు ఎంట్రీ ఇస్తున్నారు.

కట్ టూ డబ్బు ప్లస్ -

ఫేమ్, డబ్బుతోపాటు, ఇంకే రకంగా తీసుకున్నా .. ఈ ప్రపంచంలో పాలిటిక్స్, క్రికెట్‌తో పోటీపడేది ఏదన్నా ఉందంటే అది సినిమా ఒక్కటే.

పిచ్చి మనీ ఫ్లోటింగ్‌తోపాటు, సినిమా బిజినెస్‌లో ఉండే మరికొన్ని లాభాలు ఏ ఇతర బిజినెస్‌ల్లోనూ లేవు. ఉండవు.

ఇతర అన్ని వ్యాపారాల్లోనూ బాగా డబ్బు సంపాదించొచ్చు. కానీ ..

రాత్రికి రాత్రే ఫేమ్‌నూ, ఒక సెలబ్రిటీ హోదానూ, ప్రపంచవ్యాప్త గుర్తింపునూ తెచ్చుకోవడం మాత్రం ఒక్క సినిమాల్లోనే సాధ్యం.

కనీసం ఒక 40 టీవీ చానెళ్ళూ, అన్నీ కలిపి కనీసం మరో 100 వెబ్‌సైట్స్, ఫిల్మ్ మేగజైన్స్, న్యూస్ పేపర్లు, వెబ్ చానెళ్ళు, సోషల్ మీడియాల్లో మీ పరిచయం-కమ్-ప్రమోషన్ గ్రాఫ్ ఓవర్‌నైట్‌లో మిమ్మల్ని ఒక రేంజ్‌కు తీసుకెళ్తుంది.

ఈ అడ్వాంటేజ్ ప్రపంచంలోని మరే ఇతర బిజినెస్‌లో లేదు. ఉండదు.

దటీజ్ సినిమా. 

1 comment:

  1. అవునండీ. సినిమా అన్నది చాలా మంచివ్యాపారావకాశం. సరైన అవగాహనతో ముందుకు వెళ్ళి లక్షలతోనే కోట్లు సంపాదించటం కుదురుతుం దిక్కడ - అలాగే - ఇక్కడ కేవలం ఆశలూ అంచనాలతో బోలెడు కోట్లు పెట్టి కాసిని కోట్లతో సరిపెట్టుకొని దివాళా కొట్ట వచ్చును కూడా. పాతిక లక్షల పెట్టుబడితో పది కోట్లు లాభపడితే లాభం‌ పెట్టుబడిపై 40రెట్లు. కాని 200 కోట్లు పెట్టి తీసి 400 కోట్లు వసూలు చేస్తే అది రెట్టింపు మాత్రమే. కాని 200 కోట్లతో తీసిని సినిమాలు పెద్దసినిమాలుగా జబర్దస్తీ చేస్తున్నాయి చిన్నసినిమాలపైన - చివరకు ప్రదర్శనకు థియేటర్లు కూడా దొరక్కుండా అడ్దంపడుతూ. ఈ‌ స్థితి తొలగిపోతే బాగుంటుంది - చివరకు ప్రభుత్వజోక్యంతో ఐనా సరే! అప్పుడు సినీరంగంలో ఫాల్స్‌స్టార్స్ హంగామా తగ్గి మంచి సినిమాలకు నిజంగా మంచిరోజులు వస్తాయి.

    ReplyDelete