Tuesday 22 November 2016

భజన వెర్సస్ అభిమానం!

"కె సి ఆర్ కు, టి ఆర్ ఎస్ కు నువ్వు భజన చేయకు!" అని మొన్నొక మిత్రుడు నాతో చెపాడు, కార్లో వెళ్తుండగా.

నేను సూటిగా చెప్పాను:

"క్రియేటివిటీ వేరు. రాజకీయాలు వేరు .. నా మనసుకు నచ్చింది నేను చేస్తాను. నేను చేయాలనుకున్నది చేస్తాను. నా ఫేస్‌బుక్, నా వాల్, నా బ్లాగ్, నా ట్విట్టర్, నా ఫీలింగ్స్, నా రాతలు, నా ఇష్టం."

"నీకో, ఇంకొకరికో నచ్చడంకోసం నేను రాయడంలేదు. పోస్ట్ చేయడంలేదు. ఆ సమయంలో నాకు తోచింది నేను రాస్తున్నాను. నీకు నచ్చితే లైక్ కొట్టు. నచ్చకపోతే సింపుల్‌గా ఒకే ఒక్క క్లిక్‌తో నన్ను అన్‌ఫ్రెండ్ చెయ్యి!" అని కూడా చెప్పాను.

"అంతేనంటావా?" అన్నాడు నా మిత్రుడు.

"అంతే. అంతకంటే ఈ టాపిక్ మీద డిస్కషన్ పెంచి నీ విలువైన టైమ్‌నీ, నా విలువైన టైమ్‌నీ నేను వృధా చేయలేను!" అన్నాను.

నా మిత్రుని దగ్గర సమాధానం లేదు.

ఎలా ఉంటుంది?

మిగిలినవారెవరి విషయమో నాకు తెలియదు. కానీ, నా విషయంలో మటుకు .. భజన వేరు. అభిమానం వేరు.

భజన ఒక భ్రమ. అభిమానం ఒక రియాలిటీ.

భజన వెనుక ఆశలు, కోరికలు, అవసరాలుంటాయి. అభిమానం వెనుక కేవలం ఫీలింగ్స్ ఉంటాయి.

ఈ రెండింటి మధ్య తేడాని గుర్తించలేనివాళ్లే నానా కామెంట్స్, నానా సౌండ్స్ చేస్తుంటారు.  అదే అసలైన భజన అని నా ఉద్దేశ్యం.

1 comment:

  1. కె సి ఆర్ కు భజన చేయొద్దు ...
    టి ఆర్ ఎస్ కు భజన చేయొద్దు... కానీ ఒకటి నిజం
    పదహారు సంవత్సరాల క్రితం ... కారణమేదైనా ... ఆశయం ఏదైనా.. కోరిక ఏదైనా... తెలంగాణ వస్తుందని ... రావాలని ... నమ్మిన ... కోరుకున్న.. ఏకైక వ్యక్తి కె సి ఆర్ ... ప్రపంచమంతా నవ్వుతున్నా... గేలి చేస్తున్నా... తాను నమ్మిన దాన్ని సాధించటానికి అహర్నిశలు శ్రమపడి, తపనపడి, సాధించిన శక్తి కే సి ఆర్
    తాను కోరుకున్నది సాధించాలని కోరుకునే ప్రతీ వ్యక్తికీ స్ఫూర్తి కావలి కే సి ఆర్...
    వాళ్ళు తెలంగాణ అయినా ... ఆంధ్రా అయినా ... మరే రాష్ట్రమైనా...
    యువతకు గోల్ సెట్టింగ్ ... టార్గెట్ అఛీవింగ్... లాంటి ఎన్నో విషయాలకు ... వాడు .. వీడు ... ఎవరో స్ఫూర్తి అక్కర్లేదు ... మన ముందు ... ప్రతీ రోజు కనపడే .. కే సి ఆర్ చాలు... ఇది భజన అనుకుంటే ... నేను భజనగాడినే / భజనగత్తెనే ... కే సి ఆర్ భజన చేసినందుకు ... ఆనందపడాలి

    ReplyDelete