Sunday 17 July 2016

"ఒక్క ఛాన్స్" అంత ఈజీ కాదు!

నా ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లో ఒక 5000 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్లల్లో నాకు పర్సనల్‌గా తెలిసినవాళ్లు ఒక 300 మంది ఉంటే ఎక్కువ. అది వేరే విషయం.

అలాగే, నా ఫేస్‌బుక్ పేజ్‌లో ఒక 20,000 మంది ఫ్యాన్స్ ఉన్నారు.

నా ట్విట్టర్‌లో నాకు సుమారు ఒక 4,500 మంది ఫాలోయర్స్ ఉన్నారు.

నా బ్లాగ్‌లో నేను రాసే ప్రతి పోస్ట్‌ను కనీసం కొన్ని వేలమంది చదువుతారు.

ఇంక ఈ ఆన్‌లైన్/సోషల్ మీడియాతో సంబంధం లేకుండా, నాకు బయట కనీసం ఓ 200 మంది బంధువులు, మిత్రులు, బాగా తెలిసినవాళ్ళు ఉన్నారు.

అసలీ లెక్కంతా ఎందుకు అని మీకు అనిపించొచ్చు. ఉన్నదంతా అక్కడే ఉంది. కాబట్టే ఈ లెక్కలు.

కట్ చేస్తే - 

సోషల్ మీడియాలో ప్లస్ బయటా, నాకు కనెక్ట్ అయి ఉన్న అంత మందిలో .. నన్ను రోజూ కనీసం ఒక 30 మంది అయినా "మీ సినిమాలో నాకొక రోల్ ఇవ్వండి" అని అడుగుతుంటారు. అడగడంలో తప్పేం లేదు. కానీ .. నన్నూ, ఎప్పుడూ ఓ 101 టెన్షన్స్ వెంటాడే నా పరిస్థితిని కూడా అర్థం చేసుకోవడం చాలా అవసరం:

> ఏ ఒకరిద్దరికో తప్ప, రోజూ ఈ 30 మందికి నేను ఆన్సర్ చెప్పలేను.
> అందరికీ కలిపి తరచూ ఒక మాట ఏదైనా పోస్ట్ రూపంలో చెప్తుంటాను. "ఈసారి ఆడిషన్స్ అయినప్పుడు రండీ" అని.
> ఒక వేళ వీళ్లంతా ఆడిషన్స్‌కు వచ్చినా .. అందులో బాగా టాలెంట్ ఉండి, మా స్క్రిప్టులోని ఏదైనా ఓ రోల్‌కు పనికొస్తారు అనుకొనే ఏ ఒకరిద్దరికోతప్ప అందరికీ ఛాన్స్ ఇవ్వలేం కదా?!

ఈ నిజాన్ని నా మిత్రులు, శ్రేయోభిలాషులు, ఫ్యాన్స్, ఫాలోయర్స్ అందరూ అర్థం చేసుకోవాలి.

మరో విషయం ఏంటంటే, ఛాన్స్ దొరికినవాళ్లే పుడింగులు అని కూడా ఎప్పుడూ అనుకోవద్దు. ప్రతి ఒక్కరిలోనూ టాలెంట్ ఉంటుంది. ప్రయత్నిస్తూ ఉండాలి. మీకు మాత్రమే సూటయ్యే రోల్ ఎక్కడో, ఏ సినిమా ఆఫీసులోనో మీకోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు. ఎవరికి తెలుసు?

సో, ఆ ఒక్క ఛాన్స్ కావాలి అనుకొనేవాళ్లు మాత్రం ఎప్పుడూ రేసులో ఉండాలి. గెలుస్తామన్న నమ్మకంతో ఉండాలి.

బెస్ట్ విషెస్ .. 

3 comments:

  1. బ్లాగు పేరు మార్చరాదా.... భయమేస్తుంది....
    పదవిలో ఉంటే ఇలాంటివి తప్పవు కదా... ఇంజనీరింగ్ కాలేజి లెక్చరర్ కాలేజీలో సీటు ఇంప్పించలేడన్న నిజం అప్పుడే ఎమ్సెట్ రాయించిన తండ్రికి తెలియదు కదా....ఏదో అడిగేస్తారు... అయ్యా కేవలం చెప్పుకోడానికే లెక్చెరర్లము.... సీట్లు ఇప్పించడానికి మేనేజ్ మెంటు కాము... అంటూ క్లారిఫికేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది బ్రదర్ సానుభూతి అందుకోండి

    ReplyDelete
    Replies
    1. థాంక్యూ ఫర్ ది కామెంట్! నా పరిస్థితి బాగా అర్థం చేసుకున్నారు. ఇక, బ్లాగ్ పేరు మార్చడం గురించి: ఇన్నేళ్లలో ఇది కేవలం 3వ కంప్లైంట్ దీని గురించి. బహుశా చాలామంది చెప్పలేకపోతుండవచ్చు కూడా. నా భవిష్యత్ విశాల ప్రయోజనాల దృష్ట్యా బ్లాగ్ పేరు మార్చాలనే ఉంది. కానీ, ఈ పేరుతోనే నా బ్లాగ్ ఇప్పటికే చాలామందికి సుపరిచితం. దీనిమీద మరొక్కసారి బాగా ఆలోచించి, ఫైనల్ డెసిషన్ తీసుకుంటాను, త్వరలోనే. థాంక్యూ.

      Delete
  2. Hi sir hru all the best for ur blog
    Nenu kuda meku oka Chinna fan so am also daily visiting..this blog

    ReplyDelete