Sunday 29 May 2016

మైక్రో బడ్జెట్ ఫిలిం ఫండింగ్!

మీరు "నో" చెప్పలేని ఈ రిస్క్-ఫ్రీ బిజినెస్ ఆఫర్ కేవలం మీలోని సినీ ప్రేమికులకు మాత్రమే! అదీ కొద్దిరోజులు మాత్రమే!!

> సినిమా అంటే మీకు ప్యాషనా?
> ఆర్టిస్టుగానో, టెక్నీషియన్‌గానో ఫీల్డులోకి వెంటనే ప్రవేశించాలనుకుంటున్నారా?
> అసలు సినిమా ప్రొడక్షన్ / సినిమా బిజినెస్ ఏంటో తెల్సుకోవాలనుకుంటున్నారా?

పై మూడింటిలో ఏ ఒక్కదానికి మీరు "ఓకే" చెప్పినా, కేవలం ఓ 10 నిమిషాలపాటు క్రింది మ్యాటర్ చదవండి.

చెప్పలేం. ఈ 10 నిమిషాలే మీ జీవితాన్ని ఓ కొత్త మలుపు తిప్పొచ్చు. మీరు కలగంటున్న రంగుల సామ్రాజ్యంలో మీ ప్రవేశానికి రెడ్ కార్పెట్ వేయొచ్చు!

మీకు తెలుసా ?

కేవలం మన హైదరాబాద్‌లోనే బాగా పేరున్న కొన్ని ఫిలిం ఇన్స్‌టిట్యూట్‌లలో శిక్షణకోసం తీసుకొంటున్న ఫీజు 4 నుంచి 10 లక్షలవరకు ఉంది. అది యాక్టింగ్/డైరెక్షన్/స్క్రిప్ట్ రైటింగ్/మేకింగ్ .. ఏదయినా కావొచ్చు. అంత ఫీజు చెల్లించి, ఒక రియలిస్టిక్ పాయింటాఫ్ వ్యూలో మీరు పొందే ఫలితం .. జస్ట్ ఒక సర్టిఫికేట్!

ఆ సర్టిఫికేట్ చూసి ఎవరయినా ఎక్కడయినా మీకు ఛాన్స్ ఇస్తారా?

అసలు ఫిలిం ఇండస్ట్రీలో ఎంట్రీ అనేది అంత ఈజీ కానేకాదు.

శిక్షణ వేరు. ఇండస్ట్రీ వేరు.

ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్‌ను నిర్మూలించే ఉద్దేశ్యంతో పుట్టిన ఆలోచనే .. నా ఈ మైక్రో బడ్జెట్ సినిమాలు.

కొత్త/అప్‌కమింగ్ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్‌కు మాత్రమే ఛాన్స్ ఇస్తూ - ఫిలిం మేకింగ్‌లో లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ అందిస్తున్న సౌలభ్యాలను ఉపయోగించుకుంటూ - తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ సినిమాలను తీయాలన్నదే ఈ ఆలోచన వెనుక నా ప్రధానోద్దేశ్యం.

ఈ ఉద్దేశ్యంతో క్రియేట్ చేస్తున్నదే నా సహచర టెక్నీషియన్‌తో కలిసి నేను క్రియేట్ చేస్తున్న మా సరికొత్త ఫిలిం ప్రొడక్షన్ హౌజ్.

మా ఫిలిం ఫాక్టరీ!

ఈరోజుల్లో, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ, 3జి లవ్, ప్రేమకథాచిత్రమ్, మొన్నటి కుమారి 21 F వంటి అతి తక్కువ బడ్జెట్‌లో తీసిన కొన్ని సినిమాలు కోట్లు కొల్లగొట్టిన విషయం మీకు తెలిసిందే!

సబ్జెక్ట్/జోనర్/ప్రజెంటేషన్ పరంగా వేరు కావొచ్చుగానీ - మా ఫాక్టరీ నుంచి నేను తీయబోయే సినిమాలు కూడా పక్కా ట్రెండీ కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలు మాత్రమే!    

ఈ ఫాక్టరీ కోసం, కేవలం ఒక చిన్న మొత్తాన్ని నేను, నా పార్ట్‌నర్-కమ్-ప్రొడ్యూసర్ ఒక బేసిక్ ఫండ్‌గా సేకరించడానికి నిర్ణయించాము. అది కూడా కేవలం ఒకే ఒక్క ఇన్వెస్టర్ నుంచి కాదు.

కొంతమంది లైక్‌మైండెడ్, సినీప్రేమికులయిన కొత్త/ఔత్సాహిక "అసోసియేట్ ప్రొడ్యూసర్స్" నుంచి. అది కూడా ఎవరికీ పెద్దగా భారం అనిపించని ఒక అతి చిన్న మొత్తం రూపంలో.

మా ప్రొడక్షన్ హౌజ్‌లో మీరు పెట్టుబడిగా పెట్టాల్సింది కేవలం ఒక లక్ష రూపాయలు మాత్రమే.

యస్ .. కేవలం ఒక లక్ష రూపాయలు!

ఈ లక్ష రూపాయల పెట్టుబడికి 12 నెలల లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది. ఈ 12 నెలల పీరియడ్‌లో మేము ఎన్ని సినిమాలు తీస్తే అన్ని సినిమాల్లో మీ పెట్టుబడికి ప్రపోర్షనేట్ షేర్ వస్తుంది, 12నెలల తర్వాత.

ఒకవేళ నష్టం వచ్చినా మీకు సంబంధం లేదు. మీ బేసిక్ లక్షరూపాయల ఇన్వెస్ట్‌మెంట్, 12 నెలల లాక్-ఇన్ పీరియడ్ తర్వాత, సేఫ్‌గా మీకు తిరిగి ఇవ్వటం జరుగుతుంది.

మీకు ప్రొడ్యూసర్స్ లేరా?

నాకు రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ఓకే అయి ఉన్నా, మరోవైపు  ఆ పనులు కొనసాగుతూనే ఉన్నా, మళ్ళీ ఎందుకీ అన్వేషణ అంటే .. దానికో కారణముంది. వివిధ సాంకేతిక కారణాలవల్ల మా రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ ప్రాజెక్టుల కదలికలో కొంత ఆలస్యం అనివార్యమవుతోంది. పెద్ద పెద్ద నాగార్జున, చిరంజీవి లాంటి స్టార్స్‌కే తప్పలేదు కొన్ని ఆలస్యాలు. ఇండస్ట్రీలో ఇదొక మామూలు విషయం.

తప్పదు. కోట్లతో వ్యవహారం.

అదలా ఉంటే - సినిమాలు వెంటవెంట తీయడానికి, కంప్లీట్ క్రియేటివ్ ఫ్రీడమ్‌తో తీయడానికీ స్వయంగా మేమే మా సొంత బ్యానర్‌లో కూడా కొన్ని మైక్రో బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేస్తున్నాము. ముఖ్యంగా వాటికోసమే ఈ కొత్త కోప్రొడ్యూసర్స్/ఇన్వెస్టర్స్ అన్వేషణ.

ఆసక్తి ఉండీ .. అవకాశం, సరైన రూటు దొరకని కొత్త ప్రొడ్యూసర్స్/కోప్రొడ్యూసర్స్ ఎందరో ఉంటారు. అలాంటివారికి కూడా ఈ ఆఫర్ ఎంతో ఉపయోగం.

అసలు హూ యామ్ ఐ ? 

నా చదువు, ఉద్యోగాలు, నేనిప్పటివరకు తీసిన సినిమాల వివరాలు, వాటి పోస్టర్‌లు, వర్కింగ్ స్టిల్స్, నా అవార్డులు, గోల్డ్ మెడల్స్, సన్మానాలు వగైరా అన్నీ .. నా ఫేస్‌బుక్ పేజ్ లో ఉన్నాయి. అవి చూడండి. అలాగే నా బ్లాగ్ కూడా చూడండి.

మీ మనసు "యస్" చెబితేనే, ఒక నిర్ణయం తీసుకొని పాజిటివ్ థింకింగ్‌తో ముందుకు రండి.

ఈ ప్రపోజల్ మీకు ఏ మాత్రం నచ్చకపోయినా, ఏ కొంచెం రిస్క్ అనిపించినా, దయచేసి దీన్ని ఇక్కడితో మర్చిఫోండి. నో వర్రీ. నో ప్రాబ్లమ్.

మరి మాకేంటి ?

> మా రిజిస్టర్డ్ బ్యానర్ పేరుతో బాండ్ పేపర్ మీద మీ లక్షరూపాయల ఇన్‌వెస్ట్‌మెంట్‌కు 12 నెలల లాక్-ఇన్ పీరియడ్‌తో అఫీషియల్ రిసీట్.

> ఈ 12 నెలల కాలంలో మేము తీసే మైక్రో బడ్జెట్ మెయిన్‌స్ట్రీమ్ కమర్షియల్ సినిమాలన్నింటిలోనూ వచ్చిన లాభంలో ప్రపోర్షనేట్ షేర్.

> "అసోసియేట్ ప్రొడ్యూసర్"గా వెండితెరపై టైటిల్ కార్డ్స్‌లో మీ పేరు.

> ఒక క్లోజ్‌డ్ ఫేస్‌బుక్ గ్రూప్ ద్వారా, అసోసియేట్ ప్రొడ్యూసర్లందరికీ ఎప్పటికప్పుడు మేము చేస్తున్న ప్రాజెక్టుల అప్‌డేట్స్, ఇతర కమ్యూనికేషన్.

> కేవలం ఒకే ఒక్క లక్ష రిస్క్ లేని పెట్టుబడితో - సినీ ఫీల్డునీ, సినిమా ప్రొడక్షన్నీ, బిజినెస్‌నీ ప్రత్యక్షంగా అధ్యయనం చేసే అద్భుత అవకాశం.

> షూటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా, ఒక ప్లాన్‌డ్ షెడ్యూల్ ప్రకారం, ముందే నిర్ణయించిన కొంత సమయం పాటు అసోసియేట్ ప్రొడ్యూసర్స్ అంతా షూటింగ్ లొకేషన్‌కు వచ్చి ప్రత్యక్షంగా షూటింగ్‌ని చూడొచ్చు.

> బ్లాగ్, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి నా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌స్ అన్నిట్లోనూ ప్రతి ఒక్క అసోసియేట్ ప్రొడ్యూసర్ గురించీ పరిచయం.

> పెట్టుబడి పెడుతున్న అసోసియేట్ ప్రొడ్యూసర్స్ లో నిజంగా టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకు మా ఫాక్టరీ సినిమాలన్నిటి ఆడిషన్స్‌లో ప్రత్యేక ప్రాధాన్యం. సెలక్టు కానివారికి అవసరమయిన సలహాలు/సహాయం/సపోర్ట్‌ని ప్రాక్టికల్ పాయింటాఫ్ వ్యూలో స్వయంగా నేనే అందిస్తాను.  లక్షలు పోసి ఇన్స్‌టిట్యూట్‌లలో మీరు తీసుకొనే సర్టిఫికేట్ కంటే ఇది వంద రెట్లు విలువైంది.

> కొత్తగా ప్రొడ్యూసర్‌గా ఫీల్డులోకి దిగాలనుకొనేవారికి ఇది చాలా మంచి అవకాశం. కేవలం ఒకే ఒక్క లక్ష రిస్క్-ఫ్రీ పెట్టుబడితో సినిమా బిజినెస్‌ను ప్రత్యక్షంగా తెల్సుకోవచ్చు.

> క్రియేటివిటీ, బిజినెస్, అడ్మినిష్ట్రేషన్ మొదలయిన ప్రతివిషయంలోనూ అన్ని అధికారాలూ మాకే ఉంటాయి. ఏది ఎలా ఉన్నా -  మీ బేసిక్ ఇన్వెస్ట్‌మెంట్ మీకు తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మాదే కాబట్టి, మీకు బాగా లాభాలు వచ్చేలా చూడాల్సింది కూడా మేమే కాబట్టి .. ఈ ఫ్రీడమ్ మాకు అవసరం.

14 రోజుల ఆఫర్ -

ఈ ప్రత్యేకమైన ఆఫర్ రేపు 30 మే 2016 నుంచి, 12 జూన్ 2016 వరకు .. కేవలం 14 రోజులు మాత్రమే! అంతేకాదు. మేము అనుకున్న ఓ చిన్న టార్గెట్ రీచ్ అయితే చాలు. ఆఫర్‌ను వెంటనే ఏ క్షణమైనా ఆపేస్తాము.

సో, జాగ్రత్తగా అంతా మరొక్కసారి చదవండి. మీరు పూర్తిగా సంతృప్తి చెంది, పాజిటివ్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే దయచేసి క్రింద ఇచ్చిన నంబర్‌కు కాల్ చేయండి. ఈ ఫీల్డువైపు ఆసక్తి ఉన్న సినీ ప్రేమికులయిన మీ మిత్రులకు, తెలిసినవారికి కూడా ఈ లింక్‌ను షేర్ చేయండి.

వెంటనే మీ అగ్రిమెంట్/ఇన్వెస్ట్‌మెంట్ కోసం ఒక రోజు డేట్ చెప్తూ, పాజిటివ్‌గా మీరు చేసే కాల్ కోసం ఎదురుచూస్తుంటాము.

అంతేగానీ .. మీ అమూల్యమైన సమయాన్నీ, మా సమయాన్నీ వృధా చేసే కాల్స్ మాత్రం చేయొద్దని సవినయ మనవి.

కలిసి పని చేద్దాం. కలిసి ఎదుగుదాం.

బెస్ట్ విషెస్ టూ యూ ..