సినిమాల్లోకి నేను డైరెక్టుగా ఎంటర్ అవకముందు, కొన్నాళ్లు రైటర్‌గా/ఘోస్ట్ రైటర్‌గా పనిచేశాను.
అప్పుడు నేను ఆలిండియా రేడియోలో పనిచేస్తుండేవాణ్ణి.
రైటర్‌గా, ఘోస్ట్ రైటర్‌గా కొంతమంది దర్శకులకు, రచయితలకు స్క్రిప్టులు రాసిచ్చిన ఆ అనుభవంతో - తెలుగు ఇండస్ట్రీ నేపథ్యంగా, అప్పట్లో స్క్రిప్ట్ రైటింగ్ పైన నేనొక పుస్తకం రాశాను. అదే ఈ సినిమా స్క్రిప్టు రచనాశిల్పం.
"బెస్ట్ బుక్ ఆన్ ఫిలింస్" కేటగిరీలో ఆ పుస్తకం నాకు నంది అవార్డును సంపాదించిపెట్టింది. 5 వేల కాపీలు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.
మార్కెట్లో డిమాండ్ ఉన్నా - తర్వాత నేను మళ్ళీ ఆ పుస్తకం రీప్రింట్ వెంటనే వేయలేదు. నవోదయ, విశాలాంధ్ర బుక్ హౌస్ వాళ్లు నన్ను చాలా సార్లు దీనిగురించి గుర్తు చేసినా నేనాపని చేయలేదు.
కారణం ఒక్కటే ..
ఆ తర్వాత నేను అనుకోకుండా దర్శకుడినయ్యాను.
దర్శకుడిగా నా మరిన్ని అనుభవాలను, వ్యూస్‌నూ కూడా కలిపి .. నా సినిమా స్క్రిప్టు రచనాశిల్పం పుస్తకాన్ని కొంత "రివైజ్" చేసి మళ్ళీ కొత్తగా పబ్లిష్ చేయలన్నది నా అలోచన.
ఇంతకుముందు పోస్టులోనే చెప్పినట్టు - డైరెక్టర్‌గా 4 సినిమాలు తీసి రిలీజ్ చేసిన తర్వాత కూడా నా అప్పటి ఆలోచన ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు.
ఆమధ్య నా మిత్రుడు, ఒక ప్రముఖ సాహితీ మేగజైన్ ఎడిటర్ - "నేను పబ్లిష్ చేస్తా"నని నా వెంటపడి, నాచేత రివైజ్‌డ్ స్క్రిప్ట్ రాయించి, నా దగ్గర్నించి ఈ పుస్తకం రివైజ్‌డ్ మాన్యుస్క్రిప్ట్ తీసుకున్నాడు. కానీ, సంవత్సరం తర్వాత కూడా ఆ పని జరగలేదు. ఇక చేసేదేంలేక నా పుస్తకం మాన్యుస్క్రిప్ట్ అతని దగ్గర్నుంచి వెనక్కి తీసుకున్నాను.
కట్ చేస్తే -
ఇప్పుడు మళ్లీ నేనే నా పుస్తకం కొత్త రివైజ్‌డ్ ఎడిషన్‌ను పబ్లిష్ చేయడానికి నిర్ణయించుకున్నాను. ప్యాషనేట్ మిత్రులెవరైనా ఈ విషయంలో నాకు ఆర్థికంగా కొంతయినా తోడ్పడగలిగితే సంతోషం. నా ఈమెయిల్ mchimmani@gmail.com కు, లేదా నా ఫేస్‌బుక్ ఇన్‌బాక్స్‌కు మీ నంబర్ పంపండి. నేనే మీకు కాల్ చేస్తాను.
అన్నట్టు - ఈ రివైజ్‌డ్ పుస్తకం కొత్త ఎడిషన్‌ను - ఇప్పుడు నేను ప్లాన్ చేస్తున్న నా తాజా సినిమాకు సంబంధించిన ఏదో ఒక ఫంక్షన్‌లో సినీ ప్రముఖుల మధ్య కొంచెం భారీగానే రిలీజ్ చేస్తాను. లేదంటే - ఈ పుస్తకం రిలీజ్ కోసమే ప్రత్యేకంగా సినీ ప్రముఖులతో ఒక ఫంక్షన్ ప్లాన్ చేస్తాను.

నా సహకారం మీకు తప్పకుండా వుంటుంది మనోహర్ జీ!
ReplyDeleteథాంక్యూ వెరీ మచ్ రామ్‌కుమార్ జీ!
Deleteమిమ్మల్ని అతి త్వరలోనే కలుస్తాను. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలై. ఒక ఇమ్మీడియేట్ విషయం కూడా.. :) రేపు ఉదయం కాల్ చేస్తాను మీకు.