Monday 11 January 2016

సినిమా స్క్రిప్టు రచనాశిల్పం - 1

నేను రాసిన "సినిమా స్క్రిప్టు రచనాశిల్పం" పుస్తకం అప్పట్లో హాట్‌కేక్‌లా 5 వేల కాపీలు అమ్మటం జరిగింది. తర్వాతనే నేను డైరెక్టర్ అయ్యాను. ఆ అనుభవంతో పుస్తకాన్ని రివైజ్ చేసి మళ్లీ ప్రింట్ చేయొచ్చులే అనుకున్నాను. కానీ, నాలుగు సినిమాలు పూర్తయినా ఆ పని చేయలేకపోయాను ఈ రోజువరకూ!

కట్ టూ జిరాక్స్-

నవోదయ, విశాలాంధ్రవాళ్లు ఎన్నిసార్లు అడిగినా నేను మళ్లీ వేయలేకపోయిన నా పుస్తకాన్ని - ఫిలిం నగర్ కాంప్లెక్స్‌లో ఉన్న జిరాక్స్ సెంటర్‌లో బాహాటంగానే జిరాక్స్ కాపీలుగా అమ్మారు. నేనూ ఒక కాపీ కొనుక్కున్నాను .. ఆ విషయం నిజమే అని తెలుసుకోడానికి!

అయితే నేనే ఆ పుస్తక రచయితనని ఆ జిరాక్స్ షాప్ వాళ్లకు తెలీదు. నేనా పుస్తకం రాసిందే చదవటం కోసం కాబట్టి - అలా అమ్మడం నాకు సంతోషంగానే అనిపించింది. కాపీరైట్ చట్టప్రకారం అది నేరమే అయినా!

కట్ టూ ఫిల్మ్ స్కూల్ - 

నా పుస్తకాన్ని దేవదాస్ కనకాల గారి ఫిల్మ్ ఇన్స్‌టిట్యూట్‌లో చేరిన విద్యార్థులకు ఒక కాపీ ఇచ్చేవారట .. విధిగా చదివితీరాలని! థాంక్స్ టూ దేవదాస్ కనకాల గారు ..

కట్ టూ వి ఏ కె - 

సుప్రసిధ్ధ "సకలకళావల్లభులు" వి ఏ కె రంగారావు గారు నా పుస్తకం చదివి నాకు ఉత్తరం రాశారు. 5 కాపీలు తీసుకున్నారు, తనకు తెలిసినవాళ్లకు ఇవ్వడానికి. ఆ తర్వాత మేము చెన్నైలోని వారి ఇంట్లో మూడునాలుగు సార్లు కలిశాము. ఆప్యాయంగా నా చేత "తాతా" అని పిలిపించుకున్నారు. వారింట్లో ఉన్న వేలాది గ్రాంఫోన్ రికార్డులు, పుస్తకాల మధ్య కూర్చుని తాత గారిని నేను ఇంటర్వ్యూ కూడా చేశాను. ఆ క్యాసెట్ నా దగ్గర ఇంకా ఉంది. వారి మీద ఓ పెద్ద ఆర్టికిల్ కూడా రాశాను.    

కట్ టూ ఫినిషింగ్ టచ్ -

స్క్రిప్ట్ రైటింగ్ పైన రాసిన నా ఈ పుస్తకం వచ్చాక - అప్పటిదాకా ఈ అలోచనే రాని పెద్ద సినీ రచయితలు ఇలాంటిదే ఓ పుస్తకం రాసి పబ్లిష్ చేశారు. అదంతగా పాపులర్ అవ్వలేదు. మరికొందరు చవకబారు రైటర్స్ ఈ పుస్తకాన్ని కాపీ కొట్టి కూడా బుక్స్ రాశారు. ఆఖరుకు టైటిల్ కూడా దగ్గర దగ్గరగా ఉండి పాఠకులని మిస్ లీడ్ చేసే రేంజ్‌లో!    

ఈ విశేషాలన్నీ నాకు ఆనందాన్నే ఇచ్చాయి. ఎందుకో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను. 

4 comments:

 1. అర్జెంటుగా ఆ బుక్ మళ్ళీ పబ్లిష్ చేయండి మనోహర్ జీ, అందరితో పాటు నేనూ ఆతురతో వెయిట్ చేస్తున్నా ఆ బుక్ చదవడానికి. పోతే VAK రంగారావ్ గారి గురించి ప్రస్థావించారు. ఆయనకి నేను వీరాభిమానిని. నా స్కూల్ డేస్ లల్లో ఆయన ఆంధ్ర పత్రిక, వీక్లీ, లో సరాగమాల శీర్షికన సినిమా పాటల గురించి రాసేవారు. ఎంతో ఆసక్తిగా వుండేవి. పాత సినిమా పాటల ఎన్ సైక్లోపీడియా ఆయన. ఆయన దగ్గర వున్నంత గ్రామఫోన్ రికార్డుల కలెక్షన్ నాకు తెలిసీ మరెవ్వరి దగ్గరా లేదు. ఆయన గురించి మీరు రాసిన ఆర్టికల్ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయండి, ఆయన అభిమానుల గురించి, ప్లీజ్ !

  ReplyDelete
  Replies
  1. తప్పకుండా!
   బుక్ పబ్లిష్ చేస్తాను.
   మీరు కోరినట్టుగా వి ఎ కె గారిమీద నేను రాసిన పెద్ద ఆర్టికిల్ కూడా పబ్లిష్ చేస్తాను. అది టైప్ చెయ్యడానికే చాలా టైం పడుతుంది. కనీసం 12 పేజీలుంది. ఓ 4 భాగాలుగా పోస్ట్ చెయాలిక!

   Delete
 2. నవోదయ, విశాలాంధ్రవాళ్లు ఎన్నిసార్లు అడిగినా నేను మళ్లీ వేయలేకపోయిన నా పుస్తకాన్ని - ఫిలిం నగర్ కాంప్లెక్స్‌లో ఉన్న జిరాక్స్ సెంటర్‌లో బాహాటంగానే జిరాక్స్ కాపీలుగా అమ్మారు. :)

  ఇది స్వకపోల ప్రారబ్ధ కర్మ గాదూ ? అంత డిమాండ్ ఉన్న పుస్తకాన్ని రాబోయే కాలం లో రివైజ్ చేసి వేస్తా నానుకుని ఉన్న కాలాన్ని కలాన్ని వృధా చేసుకున్నట్టు అనిపించింది నా కైతే

  జిలేబి

  ReplyDelete
  Replies
  1. బ్రతకడం కోసం నాలుగు పనుల్లో బిజీగా ఉంటూ, అప్పుడప్పుడూ సినిమాయాలోకంలోకి తొంగిచూస్తూ .. దాదాపు నిరంతరం ఏదో ఒక టెన్షన్‌లో ఉండే నాకు, నాలాంటివాళ్లకు మాత్రమే ఇంత ఆలస్యం ఎందుకు జరిగిందో తెలుస్తుంది. కానీ, జిలేబీగారూ, మీరు కామెంట్‌లోని ఒక్కమాటని నేను బేషరతుగా ఒప్పుకుంటాను. "కాలయాపన" మాత్రం జరిగింది! కారణాలు ఏవైనా కానీండి..

   Delete