Sunday 4 October 2015

చివరాఖరికి స్పిరిచువాలిటీ!

నిన్న సాయంత్రం ఓ 20 నిమిషాలపాటు ప్రముఖ రచయిత, కవి .. కొనకంచి గారితో ఫోన్లో మాట్లాడాను.

హిపోక్రసీ లేని ఆయన "ఎ కె 47 టైప్" రైటింగన్నా, టాకింగన్నా నాకిష్టం.

నిన్న మా ఫోన్ టాక్ సబ్జెక్ట్: స్పిరిచువాలిటీ!  

1926 లో చలం "మైదానం" రాశాడు. నా ఫేవరేట్ ప్రపంచస్థాయి రచయితల్లో చలం ముందు వరసలో ఉంటాడు. ఆకాలంలోనే ఆయన రాయగలిగిన ఆ అందమైన తెలుగు శైలిని ఇప్పుడు 2015 లో కూడా ఎవ్వరూ రాయడం లేదన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.

అలాంటి చలం .. ఆరోజుల్లోనే .. ఎంత అగ్రెసివ్, ఎంత అన్‌ట్రెడిషనల్ టాపిక్స్ పైన రచనలు చేశాడో అందరికీ తెలిసిందే. ఆ టాపిక్స్ అప్పుడే కాదు, ఇప్పటి మన హిపోక్రసీ నేపథ్య సమాజంలో కూడా సంచలనాత్మకమైనవే!

అలాంటి రచయిత కూడా చివరికి స్పిరిచువాలిటీ అంటూ రమణ మహర్షి ఆశ్రమం చేరాడు.

ఇలాంటి ఉదాహరణలు కనీసం ఒక వంద ఇవ్వగలను నేను.

లైఫ్ అంతా ఉవ్వెత్తు కెరటాల్లా రకరకాలుగా ఎగిసిపడి, మిడిసిపడి, యుధ్ధాలు చేసి, దేన్నీ లెక్కచేయకుండా ఎన్నోరకాలుగా ఎంజాయ్ చేసి, చివరాఖరికి వచ్చేటప్పటికి స్పిరిచువాలిటీ అంటారెందుకు అన్నది నా హంబుల్ కొష్చన్!  

దానికి కొనకంచి గారిచ్చిన సమాధానం నాకు బాగా నచ్చింది. అదేంటన్నది ఇక్కడ బ్లాగ్ లో రాయడం కొంచెం కష్టం.

అయితే, కొనకంచి గారు ఈ మధ్యే, ఇదే టాపిక్ పైన తన ఫేస్‌బుక్ లో ఏదో పోస్ట్ చేశారట. వీలయితే చూడండి. నేనూ చూస్తాను. షేర్ చేస్తాను.

కట్ టూ 1001 ఉదాహరణ -

ఇప్పటిదాకా అనుకున్న ఈ స్పిరిచువల్ "ట్రాన్స్‌ఫార్మేషన్" కేవలం క్రియేటివ్ రంగాలవారిలోనే వస్తుందని కాదు. చరిత్రలో అలెక్జాండర్ వంటి రారాజు నుంచి, సాధారణ రొటీన్ మనుషుల విషయంలోనూ జరుగుతుంది.

ఈ లెక్కన నేనిందాక న్నట్టు 100 ఉదాహరణలు కాదు. 1000 ఉదాహరణలు కూడా ఇవ్వగలను. వెయ్యిన్నొక్క ఉదాహరణ కూడా నాదగ్గర రెడీగా ఉంది.

అది ఎవరని మాత్రం ఇప్పుడే నన్నడక్కండి ప్లీజ్ ..

4 comments:

 1. vishayam cheppaka pote ela mestaaruu?

  ReplyDelete
 2. చివరికైనా ఆధ్యాత్మికతకు చేరలేకపోతే.......వారెవరో చెప్పకపోయినాబాధేం లేదుగాని...

  ReplyDelete
 3. లక్ష నాగళ్ళతో,ఆ లక్ష నాగళ్ళకీ వృషబహరాజద్వయాల్ని కట్టి మహారాజులుగారు దున్నించి ఇవ్వగా ఓంకార క్షెత్రాన్ని నిర్మ్మించాలని కలలు గంటున్న హేతువాద వీరాభిమాన మీడియా గందభేరుండం గారు కాబోలు!

  ఫ్.శ్:ఇది నా వూహ మాతర్మే,అయినా అన్ని క్లూలు ఇచ్చాక యెవరు కనుక్కోలేరు - నా పిచ్చి గానీ?

  ReplyDelete
 4. ఆస్తికవాదు లు కాకపోయినా హేతువాదులు ఐనా పరవాలేదు ఎందుకంటే నిజం తెలిస్తే ఒప్పుకొంటాము అనేది హేతువాదం కానీ నాస్తికవాదులతోనే ప్రమాదం ఏమైనా ఒప్పుకోము అంటారు .హేతువాదులం అని చెప్పుకొనే కొందరు అర్ధం లేని వాదన చేస్తారు అసలు వీళ్ళు ఏకోవకు చెందుతారో వీళ్ళకే అర్ధంకాదు

  ReplyDelete