Sunday 13 September 2015

వాటీజ్ దిస్ #SwimmingPoolChallenge ?

కేవలం 12 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసి నిర్మించిన మా స్విమ్మింగ్‌పూల్ చిత్రాన్ని 11 సెప్టెంబర్ 2015 నాడు రిలీజ్ చేస్తామని కనీసం ఒక 40 రోజులముందే ప్రకటించాను.

ఎలాంటి మార్పులేకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో సుమారు 20 ప్లస్ థియేటర్లలో రిలీజ్ చేశాము.

యు కె లో రిలీజ్ చేశాము. కొన్ని సాంకేతిక కారణాలవల్ల కొంచెం ఆలస్యంగా జర్మనీ, యు ఎస్ లలో కూడా రిలీజ్ చేయబోతున్నాము.

బాహుబలి, రుద్రమదేవి వంటి "మాగ్నమ్ ఓపస్"లే ఈ పని చేయలేకపోయాయి. వాటి నేపథ్యం వేరు. వాటికుండే సమస్యలు వేరు.

అలాంటప్పుడు కూడా - "అంతా పూర్తయ్యాకే వాళ్లు డేట్ ప్రకటించొచ్చుకదా" అన్నది నా హంబుల్ కొశ్చన్.

ఈ కొశ్చన్ ఎందుకంటే - ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్లలో పదే పదే మార్పు అనేది చిన్న సినిమాలెన్నిటి ప్రాణాలనో నిర్దాక్షిణ్యంగా తీసేసింది!

ఈ నిజం ఇండస్ట్రీకి తెలుసు.

కట్ టూ మరికొన్ని సినిమా ఆలస్యాలు -  

3 కోట్లనుంచి, 30 కోట్లదాకా బడ్జెట్ ఖర్చుపెట్టి, సినిమా అన్నివిధాలుగా పూర్తిచేసి, సెన్సార్ అయిపోయి, రిలీజ్‌కు అన్నివిధాలా రెడీ అయిన మరికొన్ని సినిమాలు కూడా వాటి రిలీజ్ డేట్ విషయంలో ఇలాగే చాలా గందరగోళాన్ని సృష్టించాయి.

ఈ లిస్టులో మా స్విమ్మింగ్‌పూల్ హీరో అఖిల్ కార్తీక్ నటించిన "క్రిమినల్స్" కూడా ఉండటం విశేషం. పైగా ఆ సినిమా, మా స్విమ్మింగ్‌పూల్ సినిమా షూటింగ్ ప్రారంభించేనాటికే పూర్తయ్యింది!

నాకు తెలుసు. వీటన్నిటి ఆలస్యాల వెనుక ఎన్నో సాంకేతిక, ఆర్థిక, న్యాయపరమైన కారణాలుంటాయి. ఆర్థికపరమైన లిటిగేషన్సే ఎక్కువగా ఉంటాయన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్.

ఇదంతా నేను ఒక పాజిటివ్ కోణంలోనే చెప్తున్నానన్న విషయం మీరు గమనించాలి.

బట్, నా బాధ ఒక్కటే.

అంతా పూర్తిగా క్లియర్ కాకుండా, ఆదరాబాదరా డేట్ ఎనౌన్స్ చేసి, ఎన్నో చిన్న సినిమాల రిలీజ్‌ను గందరగోళంలో పడేసి, వాటి ప్రాణం తీసే పాపం మూటకట్టుకోవడం ఎందుకూ అని..

కట్ టూ మా కష్టాలు - 

అవడానికి మైక్రో బడ్జెట్ సినిమానే అయినా - మా స్థాయిలో మాకూ 101 కారణాలు, కష్టాలున్నాయి. సినిమా వాయిదా వేయడానికీ, అసలు రిలీజ్‌నే ఆపేసుకోడానికి!

అయినా - మేం అడుగు ముందుకే వేశాం. చెప్పిన తేదీకే రిలీజ్ చేశాం. చేయగలిగాం.

అదే రోజు రిలీజయిన మరో భారీ చిత్రంతో హోరాహోరీగా పోటీపడి, దానికంటే మంచి కలెక్షన్లు, మంచి టాక్ తెచ్చుకోగలిగాం. సాధించుకోగలిగాం.

ఇదంతా, అసలు ఎలాంటి ప్రమోషన్ లేకుండా!

అదే మా  #SwimmingPoolChallenge! 

2 comments:

  1. ఇన్ని భారీ సినిమాల విడుదలల మధ్య మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సినిమాని రిలీజ్ చేయగలిగినందుకు మిమ్మల్ని మీ నిర్మాతలని అభినందిస్తున్నాను మనోహర్ జీ! మీరన్నది నిజమే, పెద్ద సినిమాల విడుదలలు వాయిద పడటం వల్ల చిన్న సినిమాలు బలి అయిపోతున్నయి. ఈ విషయం పెద్ద నిర్మాతలు గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళ వాళ్ళ సినిమాలు పూర్తయ్యాకే విడుదల తేదీలు ప్రకటించాలి, అన్న మాట ప్రకారం విడుదల చేయాలి!

    ReplyDelete
    Replies
    1. థాంక్ యూ రామ్‌కుమార్ జీ! మీ లాంటి పెద్దల ఆశీస్సులే మాలాంటి వాళ్లకు శక్తి!!

      Delete