Sunday 27 September 2015

ఆడిషన్స్ అక్టోబర్‌లో!

కొత్త హీరోహీరోయిన్‌లు, సపోర్టింగ్ ఆర్టిస్టులు, సింగర్స్ కోసం ఆడిషన్స్ వచ్చే నెలలో ఉంటాయి.

ఈ ఆడిషన్స్ నేను ప్రారంభించబోతున్న తాజా ట్రెండీ యూత్ ఎంటర్‌టైనర్ చిత్రం కోసం.

ఈ ఆడిషన్స్‌కు సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన ప్రకటనను నా ఫేస్‌బుక్‌లో, ఫేస్‌బుక్ పేజ్‌లో పోస్ట్ చేయటంతోపాటు, కొన్ని వెబ్‌సైట్స్, ఫిల్మ్ మేగజైన్స్ లో కూడా త్వరలోనే ఇస్తున్నాను.

ఆర్టిస్టులు, సింగర్స్ సెలెక్షన్స్ హైద్రాబాద్‌తో పాటు - వైజాగ్, గుంటూరు లలో కూడా ఉండే అవకాశముంది.

"కొత్త లిరిక్ రైటర్స్‌ను పరిచయం చెయ్యరా?" అని చాలామంది అడుగుతున్నారు. ఆల్రెడీ నా తర్వాతి చిత్రంకోసం లిరిక్ రైటర్స్ ఎన్నిక దాదాపు జరిగిపోయింది. కాబట్టి దీని గురించి ఖచ్చితంగా ఇప్పుడేమీ చెప్పలేను. కాని, అవసరమనిపిస్తే, అప్పటికప్పుడు లిరిక్ రైటర్స్ కోసం కూడా సెలెక్షన్స్ ఉంటాయి. అయితే - ఈ సెలెక్షన్స్ కొత్త ఆర్టిస్టులు, సింగర్స్ ఆడిషన్స్ తర్వాతే ఉంటాయి.  

ఇవి కాకుండా, టెక్నీషియన్స్ లో - కొత్త అసిస్టెంట్ డైరెక్టర్స్, మొదలైన వాటికోసం ఎప్పటికప్పుడు విడివిడిగా ప్రకటనలు, సెలెక్షన్లు జరుగుతుంటాయి.

ఆడిషన్స్ కు అప్లై చేసుకొనే అభ్యర్థుల్లో - సినిమా పట్ల ప్యాషన్, టాలెంట్ .. ఈ రెండే నాకు ముఖ్యం. వీటి ప్రాతిపదికగానే నాకు అవసరమైన "లైక్‌మైండెడ్ టీమ్" ఎన్నిక జరుగుతుంది.

బెస్ట్ విషెస్ .. 

2 comments:

  1. అమెరికన్ ఎన్నారైలకు సినీ అవకాశం!
    సినిమాని అభిమానించే అమెరికా ప్రవాస భారతీయులకు శుభవార్త! అమెరికాలో తెలుగు వారికి విశేష సేవలు అందిస్తున్న పీపుల్ మీడియా,నూతన నిర్మాణ సంస్థ ఎస్.ఎ.మీడియా తెలుగు,తమిళ భాషల్లో ఒక చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. find more news

    ReplyDelete