Wednesday 16 September 2015

అసలు క్యూబ్ వాళ్లు ఏం చేస్తున్నట్టు?

నా సినిమా థియేటర్లో నడుస్తుండగా ఈ టాపిక్ పైన బ్లాగ్ రాస్తానని అసలు నేను అనుకోలేదు.

కానీ రాయక తప్పడం లేదు.

ఈ సమస్య వల్ల నేరుగా సఫర్ అయినవాణ్ణయి ఉండీ .. నేను దీని గురించి రాయకపోతే .. అంతకంటే ఫూలిష్‌నెస్ ఇంకోటి ఉండదు. అందుకే రాస్తున్నాను.

కనీసం, దీన్ని చదివిన మా సినిమావాళ్లు కొందరయినా ముందు ముందు జాగ్రత్తపడతారనీ, పడాలనీ నా ఉద్దేశ్యం.

డిజిటల్ ఫిలిం మేకింగ్ వచ్చాక, సినిమా థియేటర్లకు ఫిల్మ్ రీళ్ల డబ్బాలు వెళ్లే పాతరాతియుగానికి తెరపడింది. అయినా - మనవాళ్ళు ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు. ఆ వాసనలు వదళ్లేదు. అప్పటి పధ్ధతిలోనే పని చేస్తున్నారు. లేదా, అప్పటి పధ్ధతిలోనే పని తప్పించుకుంటున్నారు.

కోట్లు కుమ్మరించి సినిమాలు తీసి, తమ సినిమాలను థియేటర్లకు  పంపుతున్న నిర్మాతల, డైరెక్టర్ల, ఆర్టిస్టుల జీవితాలతో ఆడుకుంటున్నారు!

కట్ టూ క్యూబ్ -

డిజిటల్ ఫిల్మ్ మేకింగ్ పధ్ధతి వచ్చాక, ఇప్పుడు థియేటర్లకు ఫిలిం రీళ్ల డబ్బాలు వెళ్లవు. క్యూబ్, యు ఎఫ్ వో, పి ఎక్స్ డి, స్క్రాబుల్ వంటి డిజిటల్ ఫార్మాట్స్ ద్వారా సినిమా హాల్స్‌లో సినిమాలు ఆడతాయి. వీటిగురించి ఇంతకంటే వివరంగా చెప్పడం అనేది ఇప్పుడు మనం చర్చిస్తున్న టాపిక్ కు అనవసరం. సో, డైరెక్టుగా పాయింటుకొస్తున్నాను.

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో ఉన్న థియేటర్లలో ఎక్కువ భాగం క్యూబ్, యు ఎఫ్ వో సిస్టమ్‌ల ద్వారానే నడుస్తున్నాయి.

మొన్న మేము రిలీజ్ చేసిన స్విమ్మింగ్‌పూల్ చిత్రం నడుస్తున్న మెయిన్ థియేటర్ ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లో ఉన్న శ్రీ మయూరి. అలాగే - సిటీలో, ఉప్పల్ లో ఉన్న సినీ స్క్వేర్ మల్టీప్లెక్స్ లో కూడా స్విమ్మింగ్‌పూల్ రిలీజయింది. ఈ రెండు థియేటర్లలోనూ ఉపయోగిస్తున్న ప్రొజెక్టర్ సిస్టమ్ ఒక్కటే.

క్యూబ్.

శ్రీ మయూరిలో సినిమా కనీసం ఒక 30% డిమ్‌గా కనిపిస్తుంది. డిటిఎస్ సిస్టమ్ కూడా పరమ చెత్తగా కేవలం ఒక్కవైపే పనిచేస్తోంది. ఇందులో ఎంత కొత్త సినిమా వేసినా - దాన్ని చూస్తున్న ప్రేక్షకులకు "ఇది ఏ కాలం నాటి సినిమారా బాబూ" అనిపిస్తుంది.

మరోవైపు, అదే క్యూబ్ సిస్టమ్ ద్వారా నడుస్తున్న ఉప్పల్ లోని సినీ స్క్వేర్ మల్టిప్లెక్స్ లో మాత్రం - సినిమా ఒక ఆడియోవిజువల్ ట్రీట్ లా అద్భుతంగా ఉంటుంది!

స్విమ్మింగ్‌పూల్ సినిమాను పై రెండు థియేటర్లలో చూసిన తర్వాత - సదరు క్యూబ్ కంపనీ వాళ్లను మా కలరిస్ట్ ఇంజినీర్ రత్నాకర్ రెడ్డి "ఎందుకిలా?" అని కారణం అడిగారు.

అక్కడా ఇక్కడా, రెండుచోట్లా మా ప్రొజెక్టరే పనిచేస్తోంది. ఇంకా చెప్పాలంటే - శ్రీ మయూరిలో ఇంకా మంచి ప్రొజెక్టర్ ఉంది అన్నారు.

"మరెందుకిలా గుడ్డి గుడ్డిగా సినిమా కనిపిస్తోంది?" అన్న మా హంబుల్ కొశ్చన్‌కు క్యూబ్ వాళ్ల సమాధానం విని షాకయ్యాం.

"సినీస్క్వేర్ లో వాళ్లు మేము ఇచ్చిన స్టాండర్డ్ బల్బులు వాడుతున్నారు. వీళ్లు చైనా బల్బులు వాడుతున్నారు!"

ఇదెంతవరకు నిజమోగానీ, ఇదేగాని నిజమయితే, ఇంతకంటే ఘోరం ఇంకోటి ఉండదు.

ఇలా ఎన్నిచోట్ల జరుగుతోందో?! 

ఇలాంటి ఘోరాలు జరుగుతోంటే - కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు తీస్తున్న నిర్మాతల మండలులు, దర్శకుల సంఘాలు ఏం చేస్తున్నట్టు? అసలు తమ కంపనీ ప్రమాణాలు పాటించనందుకు ఇలాంటి థియేటర్లను క్యూబ్ వాళ్లు ఎందుకని చూసీ చూడనట్టు వదిలేస్తున్నారు?

సినీ ఫీల్డు ఇనుప తెర వెనుక మీకు కనిపించని నగ్నసత్యాలు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. వాటిలో ఇది కేవలం ఒకే ఒక్క ఉదాహరణ.

జస్ట్ మీతో షేర్ చేసుకుందామని.

అంతే.  

4 comments:

 1. మీరు భలే చెప్పారండి. ఈ దేశంలో అందరికీ అంత రెస్పాన్సిబిలిటీ ఉంటే, ఈ రోడ్లు ఎందుకంత చెత్తగా ఉంటాయి? ప్రపంచం అంతా ముందుకు వెళ్ళిపోతుంటే, ఇంకా మనం పాతరాతి యుగంలోనే ఎందుకు ఉంటాము? బాధ్యతా యుత ప్రవర్తనని మన దేశంలో ఎవరి దగ్గరి నుండీ ఆశించలేము.

  ReplyDelete
 2. క్యూబ్ వాళ్ళు ఇంకా ఇతర డిజిటల్ ప్రొజెక్షన్ కంపనీ వాళ్ళయినా, థియేటర్లో వాళ్ళ ఎక్విప్మెంట్ ఫిట్ చేయంగానే వాళ్ళ పని అయిపోయింది అనుకుంటారు. ఆ తరువాత దాన్ని సక్రమంగా ఉపయోగించే బాధ్యత థియేటర్ల వాళ్ళదే! ప్రొజెక్షన్ బ్రైట్ గా వుండాలంటే సరైన బల్బ్ వాడాలి. స్క్రీన్ దుమ్ము ధూళితో డార్క్ అయిపోతుంటుంది. దాన్ని తరచుగా శుభ్రం చేస్తుండాలి. పీరియాడికల్ గా సౌండ్ ఇంజనీర్ తో సౌండ్ సిస్టం చెక్ చేయిస్తూ వుండాలి. కాని మయూరి లాంటి థియేటర్ వాళ్ళు ఇలాంటివి ఏమి పట్టించుకోరు. మన చిన్న సినిమాల దౌర్భాగ్యం ఎమిటంటే మనకింతకంటే మంచి థియేటర్లు రెగ్యులర్ షోస్ కి దొరకవు. అందుకని చిన్న సినిమాలు రెగ్యులర్ షోస్ కాన్సెప్ట్ మానుకోవాలి. మల్టిఫ్లెక్స్ లల్లొ ఒక షొ దొరికినా చాలు, వీలైనన్ని ఎక్కువ మల్టిఫ్లెక్స్ లల్లో విడుదల చేసుకోవడం మంచిది!

  ReplyDelete
 3. @ఎస్పీ జగదీష్....

  ఈ దరిద్రం మనకేనా...ప్రపంచం అంతా ఇంతేనా??అని...ఒక్క విషయం లో కూడా పెర్ఫెక్షన్ ఉండదు...వాడు...ఇంజనీరయినా...డాక్టరయినా...పైలట్ అయినా...ఈ దేశం లో ఇదిగో వీడు పద్ధతి గా ..చేస్తాడు అన్న వాణ్ణి ఒక్కణ్ణి కూడా చూపలేం?తాహిసీల్దారు...వీఅర్వో...ఏఈ గారూ...డాక్టరు ఎవ్వడూ...ఒకటైమ్...పద్దతి అంటూ ఏడ్చిన దాఖలా కనబడదేం...కోట్లు ఖర్చు చేస్తున్న...ఇండస్ట్రీ వాళ్ళకే పద్దతయిన మనుష్యులు దొరక్క పోతే...మనకేమాత్రం ??

  ReplyDelete
  Replies
  1. ఈ పధ్ధతి, ఇలాంటి పధ్ధతులు .. ఖచ్చితంగా మనదగ్గరే ఎక్కువ. @SP Jagadish ji!

   Delete