Sunday 15 March 2015

ప్రమోషనల్ సాంగ్ ఐడియా ఎలా పుట్టింది?

ఒక పక్కా కమర్షియల్ రొమాంటిక్ హారర్ చిత్రంలో అయిదో, ఆరో పాటల్ని కావాలని ఇరికించడమంత ఫూలిష్ పని ఇంకోటి ఉండదు.

అయినా ..

తెలుగు ఇండస్ట్రీని దృష్టిలో పెట్టుకొని "స్విమ్మింగ్‌పూల్" సినిమా కోసం ఓ మూడు సాంగ్స్ రికార్డ్ చేశాం.

ఒకటి - ట్రెండీ యూత్ సాంగ్; రెండోది - డ్యూయెట్; మూడోది - మా ప్రొడ్యూసర్ అరుణ్ కుమార్ గారి కోరిక మేరకు మాంచి ఐటమ్ సాంగ్.

అన్నీ బాగా వచ్చాయి. అంతా ఓకే అనుకున్నాం. కానీ, కనీసం ఓ నాలుగు పాటలయినా లేకపోతే, ఆడియో కంపనీలు ఆడియో తీసుకొని రిలీజ్ చేయరుగాక చేయరని కొంతమంది "పాతకాపులు" అదే పనిగా ఊదరగొట్టారు.

ముందు ప్లాన్‌లో లేని నాలుగోపాట పుట్టడానికి ఇదో కారణం. కానీ, ఖచ్చితంగా ఇదొక్కటే మాత్రం కారణం కాదు. ఎందుకంటే - ఆ మధ్య ఒకే ఒక్క పాట ఉన్న "ఐతే" సినిమా ఆడియో కూడా రిలీజయింది. ఒక్క పాటతోనే! మరి .. దీనికేమంటారు మన పాతకాపులు?

అదలా వదిలేద్దాం.

కట్ టూ మన టాపిక్ - 

ఇందాకే చెప్పినట్టు - ఆడియో సీడీ కోసం నాలుగు పాటలు కావాలన్నది సెకండరీ రీజన్.

కానీ .. నాకు మాత్రం ఇంకోపాట కావాలనిపించింది. అది నాకోసం కాదు. సినిమా కోసం. ఆడియోకు ముందే సినిమాను వెరైటీగా ప్రజెంట్ చేయడం కోసం.

ఇంకా చెప్పాలంటే - "స్విమ్మింగ్ పూల్" పైన అందరి దృష్టీ పడేలా చేయడం కోసం!

డిసైడ్ అయిపోయాను.

టీమ్‌లోని ఒకరిద్దరితో నా ఈ అలోచన గురించి చెప్పాను. కానీ ఎవరికీ అంత వివరంగా ఏమీ చెప్పలేదు.

ఒకరోజు ఉన్నట్టుండి వెండితెరకు తొలిసారిగా నేను పరిచయం చేస్తున్న మా మ్యూజిక్ డైరెక్టర్ ప్రదీప్‌కు కాల్ చేశాను. "మనం నాలుగోపాట రికార్డ్ చేస్తున్నాం" అన్నాను.

ఎందుకు, ఏమిటి, ఎలాంటిది, బడ్జెట్ ఎంత, డబ్బులున్నాయా .. అని ఒక్క ప్రశ్న కూడా అడక్కుండా "డన్, సర్" అన్నాడు.

"పాట ఇంగ్లిష్‌లో ఉంటుంది" అన్నాను.

మరింత ఉత్సాహంగా "మీరెప్పుడంటే అప్పుడే!" అన్నాడు ప్రదీప్.

తొందరపడి ట్యూనేం కొత్తగా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు అని కూడా చెప్పాన్నేను ప్రదీప్‌తో.

కట్ చేస్తే -  

ఓ వారం తర్వాత, ఆల్రెడీ రికార్డ్ చేసిన మా మూడు పాటల్లోని ఒక పాట ట్యూన్ ని నేనడగ్గానే - పియానో మీద అద్భుతంగా వాయించి ఇచ్చాడు ప్రదీప్.

అదే నాకు సపోర్ట్. దాన్ని వింటూ ఓ రోజు అర్థరాత్రి దాటాక ఓ రెండుగంటలపాటు కూర్చుని పాటని రాశాను.

తర్వాత ఓ నేటివ్ అమెరికన్ ఫ్రెండ్‌తో ఆ ట్యూన్‌కి ట్రాక్ పాడించి తెప్పించుకున్నాను. విన్నాను.

నేను అనుకున్నట్టే .. పాట బావుంది.

వెంటనే ఆ ట్రాక్, నా ఇంగ్లిష్ లిరిక్స్ ఫైల్స్ ప్రదీప్‌కి ఈమెయిల్ చేశాను. "ఇక్కడ నీకు నచ్చిన సింగర్‌తో పాడించు. నేను అనుకున్నట్టు రాకపోతే .. యు ఎస్ లోనే ఒక నేటివ్ సింగర్‌తో పాడించడానికి ఏర్పాటు చేసేశాను. డోంట్ వర్రీ!" అని చెప్పేశాను.

కట్ టూ లిప్సిక -  

వెరీ ఫేసినేటింగ్ నేమ్! పేరొక్కటే కాదు. తన వాయిస్ కూడా.

ప్రదీప్ సెలెక్షన్ కరెక్ట్. లిప్సిక నేను ఊహించినదానికంటే చాలా బాగా పాడింది.

సో.. అలా క్రియేట్ అయ్యిందే ఈ ప్రమోషనల్ సాంగ్!

డార్లింగ్ ఫీల్ మై హార్ట్ .. 

అయితే - ఈ ప్రమోషనల్ సాంగ్ రికార్డింగ్ రోజు అక్కడికి హీరో అఖిల్ కార్తీక్‌ని ఎలా రప్పించాను, హీరోయిన్ ప్రియ వశిష్ట ఎలా వచ్చిందీ, ఒక ప్లానూ గీనూ ఏదీ లేకుండా అప్పటికప్పుడు ఎలా షూట్ చేశాం ..

అదంతా .. రేపు, ఇక్కడే, ఇదే బ్లాగ్‌లో !     

No comments:

Post a Comment