Thursday 15 January 2015

రష్యన్ ప్రొఫెసర్‌కు మా 'స్విమ్మింగ్‌పూల్' లో ఏం పని?

వయస్సులో అమితాబ్ బచ్చన్ కంటే సరిగ్గా 28 రోజులు పెద్దవారు మా రష్యన్ ప్రొఫెసర్ మాధవ్ మురుంకర్.

ఉస్మానియా యూనివర్సిటీలోని రష్యన్ డిపార్ట్‌మెంట్‌లో ఆయన హెడ్ ఆఫ్ ది డిపార్ట్‌మెంట్ గా ఉన్నప్పుడు
ఓ మూడేళ్లపాటు పార్ట్ టైమ్‌గా రష్యన్ చదివాను నేను.

ఇప్పటికీ - నా చదువు మొత్తంలో నాకు బాగా నచ్చిన, మజా ఇచ్చిన చదువు ఏది అంటే - నేను ఠక్కున చెప్పే సమాధానం .. "ఓయూ లో 3 ఏళ్ల నా రష్యన్ డిప్లొమా!" అని.  

ఒక విదేశీ భాషను ఎంత బాగా, ఎంత అందంగా, ఎంత సులభంగా నేర్పవచ్చో - మా మురుంకర్ సర్, కల్పన మేడమ్ ల తర్వాతే బహుశా ఎవరయినా అని నేనిప్పటికీ అనుకొంటూ ఉంటాను.

ఆ మూడేళ్ల రష్యన్ డిప్లొమాలో నేనే యూనివర్సిటీ టాపర్. ఆ విషయం అలా వదిలేద్దాం.

కట్ టూ "స్విమ్మింగ్‌పూల్"లో మా ప్రొఫెసర్ -  

థాంక్స్ టూ ఫేస్‌బుక్ .. సుమారు రెండు దశాబ్దాల తర్వాత మళ్ళీ నేను మా ప్రొఫెసర్‌ను కలిశాను. నా రష్యన్ క్లాస్‌మేట్ స్వరూపతో కలిసి. ఆ తర్వాతే మాటల సందర్భంలో మా మురుంకర్ సర్ నోట నేనొక మాట విన్నాను.

"సినిమాలో యాక్ట్ చేయటమొక్కటే నా జీవితంలో ఇప్పటికీ నాకో తీరని కోరికగా మిగిలిపోయింది!" అని.

అంతే. ఫిక్స్ అయిపోయాను. నా తర్వాతి సినిమాలో సర్ కి ఓ మంచి రోల్ తప్పదు అని. "ఇకనుంచీ అది మీ తీరని కోరిక కాదు. అదింక నా కోరిక!" అని చెప్పాను సర్ కి.

అదీ ఫేస్‌బుక్ ద్వారానే!

కట్ చేస్తే .. ఇప్పుడు "స్విమ్మింగ్ పూల్" సినిమాలో ప్రొఫెసర్ ఆఫ్ డెమనాలజీ కేరెక్టర్ ఆయనకోసమే పుట్టింది.

ఆయన వచ్చారు. యాక్ట్ చేశారు. కొద్దిరోజుల్లో తెరమీద కనిపించబోతున్నారు.

72 వ ఏట, తన డెబ్యూ సినిమాలో! 

2 comments:

  1. గురువుగారి ఋణం ఈ రకంగా కొంతవరకు తీర్చుకున్నందుకు మీకు అభినంధనలు మనోహర్ జీ ! చాలా మందికి సినిమాల్లో నటించాలనే కోరిక వుంటుంది. కాని అప్పటికే వాళ్ళు చేస్తున్న ఉద్యోగమో, లేక వ్యాపారమో వదలుకోలేక వాళ్ళ కోరికని నెరవేర్చుకోలేకపోతారు. ఇప్పటికైనా మీ ప్రొఫెసర్ గారికి ఆ కోరిక నెరవేరినందుకు చాలా సంతోషం. నా తరపున మీ ప్రొఫెసర్ గారికి నా హృదయపూర్వక అభినందనలని తెలపండి !

    ReplyDelete
    Replies
    1. థాంక్ యూ వెరీ మచ్, రామ్‌కుమార్ జీ.
      తప్పకుండా మీ అభినందనలు సర్ కి తెలుపుతాను.

      Delete