Sunday 11 January 2015

తెలుగులో మొట్టమొదటి "కార్బన్ న్యూట్రల్" సినిమా

శ్రీ శ్రీ మూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అరుణ్‌కుమార్ ముప్పన నిర్మాతగా నేను రూపొందిస్తున్న "స్విమ్మింగ్‌పూల్" సినిమా, పర్యావరణ పరిరక్షణ స్పృహతో తెలుగులో రూపొందుతున్న మొట్టమొదటి సినిమా. 

మనం సినిమా తీయాలి అనుకున్నప్పటి నుంచి - ప్రిప్రొడక్షన్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్ వంటి వివిధ దశలు పూర్తయ్యి - సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆయా దశల్లో .. మనం ఉపయోగించే ఎలెక్ట్రిసిటీ, వాహనాలు, పెట్రోల్, డీజెల్, జెనెరేటర్లు, కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్లు, మొబైల్ ఫోన్లు, ప్లాస్టిక్ వస్తువులు, పేపర్ మొదలైన ఎన్నో రూపాల్లో మన చుట్టూ ఉన్న పర్యావరణంలోకి ఎంతో కార్బన్‌డయాక్సైడ్ విడుదలవుతుంది.

మరెన్నో కార్బన్ సంబంధిత రసాయనాలు పర్యావరణం మీద ప్రభావాన్ని చూపిస్తాయి. పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి.  
మన చిత్ర నిర్మాణం ద్వారా పర్యావరణంలోకి విడుదలయ్యే ఈ కార్బన్‌డయాక్సైడ్, కార్బన్ సంబంధిత రసాయనాలు, వాయువులను న్యూట్రల్ చెయ్యడం కోసం, తగిన పరిణామంలో కొన్ని వందల చెట్లని మనం నాటాల్సి ఉంటుంది. 

ముంబైలో ఉన్న "సెంటర్ ఫర్ ఎన్వైరన్‌మెంట్ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్" (CERE) అనే ఒక అంతర్జాతీయ స్థాయి ఎన్ జి ఓ సంస్థ ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమలో ఈ పని మొట్టమొదటిసారిగా మేము మా "స్విమ్మింగ్‌పూల్" చిత్రం ద్వారా చేస్తున్నాము.

ఈ సినిమా అనుకున్న కాన్‌సెప్ట్ స్టేజ్ నుంచి, ఈ సినిమా రిలీజయ్యేవరకు, మేము అందిచే డేటాను విశ్లేషించి,
సి ఇ ఆర్ ఇ ఒక నివేదిక మాకు ఇస్తుంది. దాని ప్రకారం కొన్ని వందల చెట్లను శ్రీ శ్రీ క్రియేషన్స్ తరపున మేము నాటాల్సి ఉంటుంది.

ఈ పనిని మేము అప్పుడే ప్రారంభించాము కూడా.

ఈ విషయంలో సి ఎ ఆర్ ఇ కి మేము చెల్లించే (కొన్ని లక్షల) ఫీజుతో ఆ సంస్థ కేవలం మొక్కలను నాటడం ఒక్కటే కాకుండా, మరెన్నో సామాజికంగా నిజంగా ఉపయోగకరమైన పనులు చేస్తుంది.

ఆ విధంగా మా "స్విమ్మింగ్‌పూల్" చిత్రం తెలుగులో (బహుశా మన దేశంలో కూడా) - పర్యావరణ స్పృహతో రూపొందిస్తున్న మొట్టమొదటి "కార్బన్ న్యూట్రల్" చిత్రం అని చెప్పుకోడానికి నిజంగా సంతోషంగా ఉంది.  
కట్ టూ మా సినిమా "యు ఎస్ పి" -


"హాట్ రొమాంటిక్ హారర్" అనేది మా "స్విమ్మింగ్‌పూల్" సినిమాకు బిజినెస్ పరంగా మేము క్రియేట్ చేసుకున్న యూ ఎస్ పి (యునిక్ సెల్లింగ్ ప్రపొజిషన్). 


నిజానికి "తెలుగులో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ సినిమా" అన్నదే మా నిజమైన యు ఎస్ పి అని
 చెప్పుకోవడం వ్యక్తిగతంగా నాకిష్టం. అదే మా వీరేంద్ర లలిత్, అరుణ్‌కుమార్ ల అభిప్రాయం కూడా. 
మా టీమ్‌కు కూడా అదే ఇష్టం.     

4 comments:

  1. చలన చిత్ర నిర్మాతలుగా ప్రర్యావరణం కోసం మీరు చేసున్న కృషి. మీ చిత్ర కధాంశం కూడా సమాజానికి ఉపయోగపడే రీతిలో ఉంటుందని అనుకుంటున్నాను. చిత్రం విజయవంతం అవ్వాలని మీకు లాభాలను ఆర్జించి ఇచ్చి, మిగతా వారికి మీరు మార్గదర్శకులు కావాలి ఆశిస్తున్నాను.

    ReplyDelete
    Replies
    1. థాంక్ యూ, అనిల్ అట్లూరి గారూ!
      అండర్ కరెంట్‌గా దాదాపు ప్రతి సినిమాలో ఏదో ఒక మెసేజ్ తప్పక ఉంటుంది. "స్విమ్మింగ్‌పూల్" లోనూ ఉంటుంది. కానీ, ఇది పక్కా కమర్షియల్ సినిమా. :)

      Delete

  2. చాలా మంచి ప్రయత్నం. ఈ చిత్రానికి గవర్నమెంటు వారు టాక్సు రాయితీ ఇవ్వాలి వీరి ఈ గట్స్ కి .

    జిలేబి

    ReplyDelete
    Replies
    1. థాంక్ యూ, జిలేబి గారూ!

      మీ విలువైన కామెంట్ గవర్నమెంట్ దృష్టికి కూడా వెళ్లాలి. సినిమా రిలీజ్ అప్పుడు చూద్దాం.

      Delete