Tuesday 19 August 2014

క్యా సర్వే హై సర్ జీ!

దశాబ్దాల నా హైదరాబాద్ జీవితంలో మొట్టమొదటిసారిగా పండుగకాని ఓ పెద్ద పండుగ వాతావరణాన్ని చూశాను. ఏ సంక్రాంతి, దసరాలకు కూడా ఇలాంటి సందడి, ఇంత చర్చ నేను చూళ్లేదు.

మా సాదిక్ భాయ్ దీన్ని "సర్వే పండుగ" అన్నాడు అందుకేనేమో!

రోడ్లు పూర్తిగా ఖాళీ. ఆఫీసులు, షాపులు, హోటళ్లు, పాన్ షాపులు, మందు షాపులు.. అన్నీ బంద్!

ప్రతి ఇంటిదగ్గరా పండుగ సందడి. ఎన్నడూ లేనివిధంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఒకే సమయంలో ఇంత ఫ్రీగా ఉండటం, ఎవరో ఓ ముఖ్యమైన అతిథి కోసం ఎదురుచూస్తున్నట్టుగా కూర్చోవడం, ఇరుగూ పొరుగూ మనసువిప్పి మాట్లాడుకోవటం..  

ఇదే సీన్ తెలంగాణలోని అన్ని జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లోనూ ఉందని నేను మాట్లాడిన కొన్ని ఫోన్లు, బ్రౌజ్ చేసిన సోషల్ మీడియా చెప్పకనే చెప్పాయి.

కట్ టూ నెగెటివిటీ - 

కె సి ఆర్ దగ్గినా, తుమ్మినా అందులో తప్పే కనిపిస్తుంది. మాటనే కాదు.. ఆయన తీసుకొనే ప్రతి నిర్ణయాన్నీ, వేసే ప్రతి అడుగునీ పనిగట్టుకొని విమర్శించాలి.

కొందరికి అదొక ఆనందం. కొందరికి అదొక అవసరం. కొందరికి వొట్టి అపనమ్మకం.

"ప్రభుత్వ పథకాలను సమగ్రంగా అర్హులకే అందేలా చూసే క్రమంలో భాగంగానే ఈ సర్వే జరుపుతున్నట్టు" ప్రభుత్వ వర్గాలు ముందే ప్రకటించాయి.

అదేం కాదు, "ఈ సర్వే ద్వారా సీమాంధ్రులను ఏరివేస్తారని" కొంతమంది అపోహ విన్నాను. నిజంగా అదే చేయాలనుకొంటే కె సి ఆర్ కి ఈ సర్వే అవసరమా? సింపుల్ లాజిక్..

నిజానికి ఈ అపోహకి సంబంధించిన ప్రశ్న ఈ సర్వేలో నాకు ఒక్కటీ కనిపించలేదు. పది నిమిషాలలోపే మా ఇంట్లో సర్వే పూర్తయిపోయింది. కనీసం నా జన్మస్థలం విజయవాడా, వరంగలా అని కూడా అడగలేదు. ఇంక ఈ సర్వే ద్వారా సీమాంధ్రుల ఏరివేత ఎలానో.. నాకైతే అర్థం కాలేదు.

ఏది ఎలాఉన్నా.. కె సి ఆర్ ఒక సర్వే చేయాలనుకున్నారు. యావత్ దేశం ఆశ్చర్యపోయేట్టుగా అది అత్యంత విజయవంతంగా పూర్తయింది.

విజయశాంతి, పవన్ కల్యాణ్ వంటి సెలెబ్రిటీలు సర్వేకు అంగీకరించలేదని విన్నాను. జూనియర్ ఎన్ టి ఆర్ సంపూర్ణంగా సహకరించాడనీ విన్నాను. ఆలోచనలు, అపనమ్మకాలు, నిర్ణయాలు వ్యక్తిగతం.

సిస్టమ్ ఏ ఒక్కరికోసం కాదు. ఒక వర్గం కోసం కాదు. అది ఎవ్వరికోసం ఆగదు.

కె సి ఆర్ ఏ ప్రతిఫలాన్ని ఆశించి ఈ సర్వేని ప్లాన్ చేశారో అది తప్పక నిజమవుతుంది. నో డౌట్.

ఇది నా గుడ్డి నమ్మకం కాదు. ప్రాక్టికల్ రియాలిటీ. అది ఆయన బ్రాండ్!

ఆయన రుజువు చేసుకున్నారు. చేసుకుంటున్నారు. చేసుకుంటూనే ఉంటారు.

వాట్ నెక్‌స్ట్ సర్ జీ?   

1 comment:

  1. "ఈ సర్వే ఎందుకు ? ప్రతిఫలం ఏమిటి ? తదితర ప్రశ్నలన్నీ దండగ !!!! ఇది కే సి ఆర్ సర్వే అంటే ఇబ్బంది గా వుంటే గవర్నమెంట్ సర్వే అనుకో భాయ్.... మనకి లోన్ కావాలి... ఎవరికో మన ఎకౌంటు నెంబర్ ... తదితర విషయాలన్నీ చెప్తమ్... ఎక్కడ సైన్ చేయమంటే అక్కడ ఎన్ని సార్లైనా చేస్తం ... వాడు చెయ్యడా మిస్యూస్ ...బ్యాంక్ వాడు చేయగలిగే మిస్యూస్ కన్నా ఎనుమరేటార్ చేసేదేంది భాయ్...gas నెంబర్ .. ఆధార్ నెంబర్... ఎకౌంటు నెంబర్ అన్నీ ఆల్రెడీ లింకే కద... మాటల్లేవ్.... మాట్లాడుకొవటాల్లెవ్ .... సప్పుడు సేయక వివరాల్ల్చేప్పు .. నీకే మంచిగుంటది... " ఇది నా ఒపీనియన్ ... ఇస్తే ఏమైతది ... మహా అయితే మంచి జరుగుతది ...

    ReplyDelete