Sunday 13 July 2014

నాకు తెలిసి ఏ మాత్రం క్వాలిఫికేషన్ అక్కర్లేనిది రివ్యూవర్ జాబ్!

ఇవాళ రామ్‌గోపాల్ వర్మ తన ఫేస్‌బుక్ పేజ్ లో తెలుగులో ఒక పోస్ట్ పెట్టాడు.

ఫిలిం మేకింగ్, క్రియేటివిటీ, క్రిటిసిజం లకు సంబంధించి అందులో విషయం చాలా ఉంది. ఎవరో తన సినిమాని విమర్శించారని కాదు. విమర్శించడానికి ఆ రివ్యూయర్‌కు ఉన్న అర్హత ఏంటన్నది ఆయన ప్రశ్న.

సినిమా రామ్‌గోపాల్‌వర్మదా ఇంకొకరిదా అన్నది ఇక్కడ విషయం కాదు. 0/5 పాయింట్లు ఇచ్చేంత గొప్ప కాలిబర్ ఉన్న ఇలాంటి విమర్శకులు వాళ్లే స్వయంగా హాలీవుడ్ రేంజ్ బ్లాక్‌బస్టర్ సినిమాలెందుకు తీయకూడదు?

ఒక సినిమా చూసి ఇలా తీయాలి, అలా తీయాలి అని చెప్పడం ఏ దద్దమ్మయినా చేయగలడు. లక్షలు, కోట్లు కుమ్మరించి ఒక సినిమా తీసినప్పుడు మాత్రమే అసలు సినిమా ఏంటో తెలుస్తుంది.

వెబ్‌సైట్లలో పాయింట్లు ఇస్తూ, రివ్యూల పేరుతో పనికిరాని సొల్లు రాసే వీళ్లంతా ఇకనుంచీ వాళ్లు చెప్పే స్థాయి సినిమాలు తీయడం మొదలెడతారని ఆశిద్దాం. అప్పుడు మేకర్స్ వాళ్లే, రివ్యూయర్స్ కూడా వాళ్లే అవుతారు.
5 కు 5 పాయింట్లు వేసుకున్నా ఎవడూ అడగడు.

అసలు ఈ రివ్యూయర్ల రివ్యూలు చదివి సినిమాలకు వెళ్లేవాళ్ల సంఖ్య ఎంత?

కట్ టూ RGV పోస్ట్‌లోంచి కొన్ని కోట్స్ - 

> ఆ రివ్యూవర్ కి, వాడిలాంటి మిగతా రివ్యూవర్లకి నా మీద ఉన్న ద్వేషాన్ని చూసి నేను నవ్వలేదు.... ఏడ్చాను... ఎందుకంటే వాళ్ల మీద జాలితో.

> ఒక కెమెరాకి తలెక్కడో తోకెక్కడో కూడా తెలియకపోవడమే కాకుండా ఆ వెబ్ సైట్ లో వాడికి ఉద్యోగం లేకపోతే, ఒక ప్రొడక్షన్ యూనిట్ లో టీ-బాయ్ గా ఉండే అర్హత కూడా ఉండదనేది నా అభిప్రాయం కాదు, నమ్మకం.

> అసలు ఐస్ క్రీం లో తప్పులేంటో, ఏలా తీసుండొచ్చో, ఎలా తీసుండకూడదో నాకు చెప్పటానికి దమ్ముంటే వాడు నాతో ఒక టివిఛానల్ లో లైవ్ డిబేట్ కి రావాలని నా ఓపెన్ చాలెంజ్.

> నాకు తెలిసి ఏ మాత్రం క్వాలిఫికేషన్ అక్కర్లేనిది రివ్యూవర్ జాబ్. కేవలం ఒక ప్రేక్షకుడిగా సినిమా చూసి నోటికొచ్చినట్టు వాగటమే రివ్యూ అయితే సినిమా చూసిన ప్రతివాడు రివ్యూయరేగా. కాని కేవలం ఒక మ్యాగజైన్ కో, వెబ్ సైట్ కో పనిచేయడం మూలాన రివ్యూయర్ మాత్రం ఒక ప్రత్యేకమైన ప్రేక్షకుడిగా ఫీల్ అవుతాడు.

> సినిమా అనేది కథ, పెర్ఫార్మన్సెస్ టేకింగ్, సౌండ్ మొదలైన అంశాల సమ్మేళనం. ఆ సమ్మేళనం ఒక డైరెక్టర్ చేతిలో తన సెన్సిబిలిటీలో ఉంటుంది. ఆ సెన్సిబిలిటీకి కనెక్ట్ అవ్వనప్పుడు సినిమా నచ్చక పోవచ్చు.

> సినిమా హిట్టా, ఫ్లాపా అని విశ్లేషించడానికి 3 కారణాలుంటాయి. ఎంత కాస్ట్ అయ్యింది, ఎంత రికవర్ అయ్యింది అనేది. ఎంతకి కొన్నారు, ఎంత వచ్చింది అనేది.. ఆ తరువాత ఒక ప్రేక్షకుడు ఆ సినిమా గురించి ఏమి ఫీల్ అయ్యాడు అనేది.

> కాస్ట్ వర్సెస్ బాక్సాఫీస్ కలెక్షన్స్ఒక సినిమాకి కరెక్ట్ కొలబద్ద.
(ఆర్ట్ సినిమాల కొలబద్దలు వేరే ఉంటాయి. అది వేరే విషయం. ఇక్కడ చర్చ కమర్షియల్ సినిమా గురించి.)

> వ్యక్తిగతంగా కొందరికి సూపర్ హిట్ సినిమా కూడా నచ్చకపోవచ్చు. కొందరికి సూపర్ ఫ్లాప్ సినిమా కూడా నచ్చొచ్చు. కానీ చివరికి బాక్సాఫీస్ నిర్ణయమే తుది నిర్ణయం అని ఇండస్ట్రీ గురించి ఏ మాత్రం ఓనమాలు తెలిసినోడైనా చెబుతాడు.

> పాటలు, స్టార్లు, ఫైట్లు, కామెడీ లేకుండా ఒకే ఒక్క లొకేషన్లో తీసిన ఐస్ క్రీం అనే సినిమాకి సూపర్ ఓపెనింగ్ రావడమే అందరికి షాక్ ఇచ్చింది.

> ఐస్ క్రీం కి మేము పెట్టిన ఖర్చెంతంటే కేవలం ఒక్క రోజు కలెక్షన్లతో ప్రొడ్యూసరు,డిస్ట్రిబ్యూటర్లు వాళ్ల పెట్టుబడి రికవర్ చేసుకున్నారు.

> నేను ఐస్ క్రీం లో ప్రవేశ పెట్టిన ఫ్లో క్యాం, ఫ్లో సౌండ్ టెక్నాలజీ మున్ముందు ఒక ప్యారెలెల్ ఇండస్ట్రీని సృష్టిస్తుందని నా ప్రెడిక్షన్.

> నేనిక్కడ రాసింది చదివి వాళ్లు చేయగలిగేది కేవలం నా మీద ఇంకారెట్టించిన ద్వేషంతో రెచ్చిపోయి రాయడం. . నేను ఏనుగుని కాకపోవచ్చు కానీ ఆ సమీక్షకుడు మాత్రం ఖచ్చితంగా ఒక కుక్క.

No comments:

Post a Comment