Monday 14 July 2014

జాతీయస్థాయిలో రెండో అత్యుత్తమ యూనివర్సిటీ!

ఇందాకే చదివాను ..

ఉస్మానియా యూనివర్సిటీకి 2014 వ సంవత్సరానికి గాను జాతీయస్థాయిలో 2 వ స్థానం లభించింది.

ఆ మధ్య కొంత స్లో అయినా - మళ్లీ మన ఓ యూ ప్రగతి స్థానంలో మిసైల్‌లా దూసుకుపోటోందన్నమాట!

ఇండియా టుడే - నీల్సన్ గ్రూప్‌లు సమ్యుక్తంగా దేశంలో ఉన్న సుమారు 200 యూనివర్సిటీలపై జరిపిన సర్వే ఆధారంగా చెప్తున్న విషయం ఇది. ఈ సర్వేలో - జాతీయస్థాయిలో ఢిల్లీ యూనివర్సిటీ మొదటి స్థానాన్ని పొందగా, మన ఓయూ రెండో స్థానాన్ని సొంతం చేసుకోవడం అత్యంత సంతోషకరమైన విషయం.

సుమారు పాతికేళ్లక్రితం ఇదే యూనివర్సిటీలో నేను రెండు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చదివాను. యూనివర్సిటీ టాపర్‌గా రెండు గోల్డ్ మెడల్స్ కూడా సంపాదించాను. ఆ రెండు కోర్సులు చదువుతూనే - పార్ట్ టైమ్‌గా 3 ఏళ్ల రష్యన్ డిప్లొమా కూడా చదివాను. అది రష్యన్‌లో డిగ్రీకి సమానం. అందులోనూ నేనే యూనివర్సిటీ టాపర్.

కట్ టూ ది అదర్ షేడ్ - 

పోరాటాల గడ్ద అయిన ఓయూలో నేను చదువుతున్న ఆ నాలుగేళ్ల సమయంలోనే - రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ మెంబర్‌గా (ఇది అప్పుడు కొన్నాళ్లు నిషేదించబడింది!), ఓయూ రైటర్స్ సర్కిల్ మెంబర్‌గా, ఇంకా దాన్లో దీన్లో బాగానే తిరిగాను. నా హాస్టల్ రూం మీద దాడి కూడా చేశారు. ఇదంతా నా అత్యంత దగ్గరి మిత్రులకు కూడా చాలా మందికి తెలియని ఓ ప్రత్యేక ఎపిసోడ్!

ఏది ఏమయినా - ఓయూలో ఆ నాలుగేళ్లూ నేను గడిపిన నా విద్యాజీవితం ఓ గొప్ప మధురస్మృతి!  

1 comment:

  1. తెలంగాణాకు తెలుగు వారికి అత్యంత గర్వకారణమైన వాటిలో ఖచ్చితంగా ప్రప్రధమ స్థానం ఓ యు ది.

    ReplyDelete