Sunday 30 March 2014

నేను మోహన్ బాబుని హేట్ చేస్తాను!

ఇది నా మాట కాదు. "రౌడీ" సినిమా ఆడియో ఫంక్షన్లో రామ్‌గోపాల్ వర్మ మాట్లాడిన మొదటి వాక్యం ఇది..

ఆడియన్స్‌లో కూర్చున్న అందరూ షాక్!

ఎదురుగా ఆడియెన్స్‌లోనే కూర్చున్న మోహన్ బాబు తన కుర్చీలో కొంచెం ఎలెర్ట్ అయినట్టుగా కదిలారు. తర్వాతేదో "విషయం" చెప్పబోతున్నాడు వర్మ నా గురించి.. అన్న భావం ఆయన ముఖంలో.

మోహన్ బాబు ముఖంలో చిరునవ్వు సైజు కాస్త పెరిగింది.

రాత్రి దేని గురించో యూట్యూబ్‌లో నేను వెదుకుతోంటే, మధ్యలో, "రౌడీ" ఆడియోఫంక్షన్లో వర్మ స్పీచ్ కనిపించి ప్లే చేశాను. అదీ విషయం.

కట్ టూ మన పాయింట్ - 

వర్మ మోహన్ బాబుని అంతగా హేట్ చేయాల్సినంత ఘోరం ఏం చేశాడు?.. అసలు ఏం జరిగింది?.. అన్న ఆసక్తి అందర్లోనూ సహజంగానే కలుగుతుంది. అలా కలగచేయగల టెక్నిక్ వర్మకు వెన్నతో పెట్టిన విద్య అని నేను ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను.

వర్మ ట్వీట్లు కానివ్వండి.. ఇంటర్వ్యూలు కానివ్వండి.. అన్నీ ఇలాగే క్యాచీగా, ఎవ్వరూ ఊహించనివిధంగా "అప్‌సైడ్ డౌన్"గా ఉంటాయి.

రొటీన్ సొద అసలు ఉండదు.

నిజానికి ఇలా మాట్లాడ్డానికి గట్స్ అవసరం లేదు. నిజాయితీ కావాలి. దీనికి కొంత మేనిప్యులేషన్ ఫ్లేవర్ కూడా అవసరం అనుకోండి. అది వేరే విషయం.

ముఖ్యంగా, తను అనుకున్నది చెప్పగల/చేయగల సత్తా ఉండాలి. అలాంటి సత్తాని సంపాదించుకోడానికి కావల్సింది ఒక్కటే. ఫ్రీడమ్.

ఆ ఫ్రీడమ్‌ను సంపాదించుకున్నాడు కాబట్టే వర్మ వర్మ అయ్యాడు. తనకంటూ ఒక బ్రాండ్‌ని క్రియేట్ చేసుకున్నాడు.

ఇది అందరివల్లా అయ్యే పని కాదు. ఎందుకంటే - అందరికీ.. అవ్వా, బువ్వా రెండూ కావాలి!

అది అవ్వో, బువ్వో తెలీదుగాని.. ఆ రెంటిలో వర్మ ఎంచుకున్నది మాత్రం ఒక్కటే.

సినిమా!

పాయింట్ అర్థమయ్యిందనుకుంటాను. అందుకే వర్మ అంటే నాకు పిచ్చి జెలసీ..  

1 comment:

  1. అతను ఏమైనా అనగలడూ..చేయగలడూ..తీయగలడు! దటీజ్ రాంగోపాలవర్మ !!

    ReplyDelete