Thursday 27 March 2014

"పవనిజం" అడిగే మొట్టమొదటి ప్రశ్న!

ప్లేటో, అరిస్టాటిల్.. మార్క్స్, మావో.. చెగువేరా.. పావ్‌లో కోయెల్యూ, ఎక్‌హర్ట్ టోలి..

ఇంక ఇప్పుడు.. మన పవన్ కళ్యాణ్!

తప్పేంలేదు. ఇది నిజంగా స్వాగతించాల్సిన విషయం. ఇంత మంచి సాహిత్యాన్ని, తత్వాల్ని, సిధ్ధాంతాల్నీ చదివే అలవాటు.. పుస్తకాలు రాసే అలవాటు ఉండటం అనేది చాలా గొప్ప విషయం.

అదీ మాంచి పీక్ పొజిషన్లో ఉన్న ఒక కమర్షియల్ హీరో విషయంలో అంటే - ఇంకా ఇంకా ప్రశంసించదగ్గ విషయం అని నా వ్యక్తిగత ఉద్దేశ్యం.

ఇంతమంచి ఆలోచన, అలవాట్లు ఉన్న హీరో పవన్ కళ్యాణ్.. అవినీతికి తప్ప ఎందుకూ పనికిరాని "మన బ్రాండు" రాజకీయాల్లోకి రావడం అనేది చాలా చాలా తప్పు నిర్ణయం అని నేను మళ్లీ అనడానికి సందేహించలేకపోతున్నాను.

ఎట్‌లీస్ట్.. ఇప్పుడు ప్రొఫెషనల్‌గా తనున్న పీక్ స్టేజ్‌లో.. ఇది నిజంగా అంత సరైన నిర్ణయమయితే కాదు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే - పవన్ చెప్తున్నంత/ఆశిస్తున్నంత సీను మన దేశ రాజకీయాల్లో లేదు. ఇప్పట్లో రాదు.

అలాగని, ఇదేదో పెస్సిమిజమ్‌తో అంటున్నది కాదు. ఒక లేయర్ లేయర్ లేచి పోవాలి. ఒక ఉప్పెనలా అంతా అలా తుడిచిపెట్టుకుపోవాలి.

దానికే ఈ జనసేన తొలి అడుగు అనుకోవచ్చుగా?.. అని మీరు అనొచ్చు.

మన ఊహల్లోని యుటోపియా వేరు. మన కళ్లముందు కనిపిస్తున్న నిజం వేరు.

నిజమే. ఎవరో ఒకరు పూనుకోవాలి. తప్పదు.

కానీ.. ప్రశ్నించడం మానేసి, ప్రశంసించడమే తప్పు. నువ్వు విమర్శించిన అదే పాత మురికితో చేతులు కలపడం తప్పు. అలా కలపడం ద్వారా ఇంకేదో కొత్త "ఇజం" తెస్తానని కలలు కనడం ఇంకా పెద్ద తప్పు. ఒక భ్రమ.

మిగిలిన స్టార్‌లకు, స్టూడియో అధిపతులకు, రియల్ దందాలో బాగా సంపాదించుకుని పెట్టుకున్నవారికి .. అవసరాలుంటాయి. వ్యక్తిగత ఎజెండాలుంటాయి. ఆ అవసరం పవన్‌కు లేదనే నా ఉద్దేశ్యం.

పోటీ చేయడం కూడా ముఖ్యం కాదు. అధికార దాహం లేదు. కుళ్లిపోయిన ఈ రాజకీయాల్ని, వాళ్లు చేస్తున్న తప్పులను ప్రశ్నించడం కోసమే జనసేన అన్నప్పుడు.. మరి ఆ కుళ్లుతోనే కలవడాలెందుకు? కరచాలనాలెందుకు? పొత్తులెందుకు? ప్రశంసలెందుకు? ..

ఏమైనప్పటికీ, పవన్ కళ్యాణ్ తన "ఇజం" పుస్తకం రాయడాన్ని, ఆవిష్కరించడాన్ని మాత్రం ఎవరయినా ఆహ్వానించాల్సిందే. అభినందించాల్సిందే.

ఎందుకంటే - ఒక పుస్తకం రాయడం, దాన్ని పబ్లిష్ చేయడం అనేది చెప్పినంత సులభం కాదు. ఆ పని పవన్ చేశాడు. అందుకు అభినందిద్దాం.

కట్ టూ మన "కొశ్చన్ మార్క్" - 

పవన్ అభిమానుల్లో నిజంగా ఎంతమందికి ఈ "ఇజం" అర్థమవుతుంది?  అదే మిలియన్ డాలర్ కొశ్చన్ .. 

4 comments:

  1. "పవన్ అభిమానుల్లో నిజంగా ఎంతమందికి ఈ "ఇజం" అర్థమవుతుంది? అదే మిలియన్ డాలర్ కొశ్చన్"

    పవన్ కల్యాణ్ మాట్లాడిన మాటలు ఆయనకే అర్ధం అయ్యాయా? ముందు ఈ ప్రశ్న తేలిస్తే తరువాత మీ ప్రశ్న.

    ReplyDelete
  2. Papam Gottimukkala gaaru anni blog llonu doorutunnaranna mata...Pawan kalyan matalu thanaku ardhamayyaya ani adugutunnarante meeku ardham kaledani spasthamayyindi....Prathi okkaru meelaage alochisthaaru anukunte elagu sir! Chala mandiki manchi cheyyalani oka talampu raavochu. Cheyyaniddam. Meelaa oka prantheeyavaadaniki salaam kotti...(Oka leader ki)...evaroo mararu, idanthaa vrudhaa ante elaa? meeru(Gottimukkala) elaagooo mararu....mare vaallani enduku chedagodataaru...?

    ReplyDelete
    Replies
    1. మారటం అంటే - తను విమర్శించిన మురికి రాజకీయంతోనే మళ్లీ చేతులు కలపడం అన్నమాట మీ దృష్టిలో! :)

      Delete
    2. ఇప్పటి వరకూ పూర్తిగా రాజకీయానికి దూరంగా ఉన్న వ్యక్తులు వేరే, పవన్ కళ్యాన్ వేరే. ఈయనకు ఉన్న ప్రజారాజ్యం నేపధ్యాన్ని చెరిపి వేయడం సులభం కాదు. తెలంగాణా మీద ప్రరాపా యూటర్న్ తీసుకున్న పాపంలో ఈయనకు భాగం లేదా? దాని గురించి ఎందుకు సమాధానం చెప్పలేదు?

      విక్టరీ వెంకటేష్ లాంటి వారు పార్టీ పెట్టి ఉంటె ఈ ప్రశ్నలు రావు. వారెప్పుడూ గతంలో రాజకీయాల జోలికి పోలేదు కాబట్టి కొత్త పుస్తకంతో (fresh slate) మొదలు పెట్టొచ్చు. ఈ assumption పవన్ కల్యాణ్ పార్టీకి వర్తించదు.

      ఈరోజు ఇమాన్యుల్ కాంట్, చే గవేరా వగైరాలు మాట్లాడుతున్నాడు కాబట్టి నమ్మడానికి చెవిలో పువ్వు పెట్టుకోలేదు.

      ఇంతకీ జమ్మికుంట ఏ జిల్లాలో ఉంది?

      Delete