Wednesday 12 March 2014

మార్చి 14న పవన్ జన సేన!

ఎంతవరకు నిజమో తెలీదుగాని.. మొత్తం టీవీ మీడియా, వెబ్‌సైట్లూ ఈ విషయాన్ని దాదాపు ఖరారు చేసేశాయి. ఈ మార్చి 14నాడు పవన్ కళ్యాణ్  తన కొత్త రాజకీయపార్టీని ప్రకటించబోతున్నాడు. దాని పేరు "జన సేన!"

వార్తలు లేదా దీనికి సంబంధించిన గాసిప్స్‌లో కొన్ని ఇలా ఉన్నాయి:

> ఈ ఎలెక్షన్స్‌లో అన్ని స్థానాల్లో "జన సేన" పోటీ చేయకపోవచ్చట!

> పార్టీ అధికారం కోసం కాదట.. ఏ తప్పు జరిగినా అడగడానికట!

> ఈ పార్టీ వెనక అవసరమైన సమాచారం, పవన్ ఉపన్యాసాలూ అవీ చూసుకొనేది డైరెక్టర్ త్రివిక్రమ్‌ట!

> అసలు ప్రోత్సాహమంతా ప్రముఖ నిర్మాత పొట్లూరి ప్రసాద్‌ట!

వీటిల్లో ఏది ఎంతవరకు నిజమో తెలీదు.

మరోవైపు రామ్‌గోపాల్ వర్మ లాంటి వాళ్లు ట్విట్టర్లో ఓ తెగ ఊదేస్తున్నారు పవన్‌ని. శివసేన కంటే జనసేన లోనే ఎక్కువ పవరుందట. పవన్ కళ్యాణ్ ను మించిన నాయకుడు ఇంక ఎవరూ దొరకరట. తెలుగువాళ్లు తెలివైనవాళ్లయితే పవన్‌నే గెలిపించుకోవాలిట..

ఇదంతా నిజమా .. సెటైరా? సెటైరిక్‌గా నిజం చెప్తున్నాడా.. నిజమనిపించేలా సెటైర్లు వేస్తున్నాడా.. అంతా ఆ వర్మకే తెలుసు!  

కట్ టూ నా వ్యక్తిగత అభిప్రాయం - 

> చాలా గ్యాప్ తర్వాత, తన కెరీలో ఒక పీక్ దశకి చేరుకున్న ఈ సమయంలో పవన్ కల్యాణ్‌కి ఈ "జనసేన"లు ఇప్పుడు అవసరమా?

> పుస్తకాలు, సినిమాలు వేరు. రొచ్చు రాజకీయాలు వేరు. రజనీకాంతే వద్దనుకున్న రాజకీయాల్లో పవన్ ఏం సాధించాలనుకుంటున్నాడు?

వీటికి జవాబు రేపు 14వ తేదీనే తెల్సిపోతుందనుకుంటున్నాను.  

3 comments:

  1. రొచ్చు రొచ్చు అని అనుకోవటం వల్లే మనల్ని రొచ్చు రొచ్చు చేసారు మన నేత లు

    ReplyDelete
    Replies
    1. 100% నిజం. ఒప్పుకుంటాను.

      నిజానికి మీ ఈ చిన్న కామెంటే నన్ను తీవ్రమైన ఆలోచనలో పడేసింది. రేపే నేనొక నిర్ణయం తీసుకోవచ్చు. అది యాక్టివ్ పాలిటిక్స్ కాకపోవచ్చు. బట్.. సమ్‌థింగ్ ఐ విల్ డు!

      Delete
  2. అదికారం కోసం కాదు... ఏ తప్పు జరిగిన ప్రశ్నించడానికి... జనసేన.
    బాగానే ఉంది కానీ ప్రశ్నించడానికి 10రూపాయలతో సమాచార హక్కు చట్టంతో ఎవరినైనా ప్రశ్రించవచ్చు కదా దీని కోసం పార్టీ పెట్టడం అవసరమా...

    ReplyDelete