Tuesday 18 February 2014

జై తెలంగాణ!

నాకు తెలుసు. కోట్లాది తెలంగాణ ప్రజలకూ తెలుసు. ఈ రోజు పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఎలాగయినా పాసయిపోతుందని.

ఎందుకంత నమ్మకం?

"ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీ వెళ్తున్నాను. మళ్ళీ నేను అడుగుపెట్టేది తెలంగాణలోనే!" అని మొన్నే చెప్పి వెళ్లారు కేసీఆర్. కానీ, ఎన్నో మలుపులు. ఎంతో టెన్షన్.

అయినా, ఇక "సంబురాలు చేసుకోడానికి సిధ్ధంగా ఉండండి!" అని మాత్రం నిన్ననే చెప్పారు కేసీఆర్.  

కేసీఆర్ చెప్పిన ఆ ఒక్క మాటే అందరి నమ్మకం.

ఎన్నో ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరింది. ప్రొఫెసర్ జయశంకర్ గారి విజన్ నిజమైంది. తెలంగాణ కల సాకారమైంది. మన దేశంలో 29 వ రాష్ట్రంగా ఇప్పుడు తెలంగాణ అవతరించింది. 

సుమారు వెయ్యిమందికి పైగా ఈ ప్రాంత విద్యార్థులు, ప్రజల ఆత్మబలిదానం తర్వాత వచ్చిన ఈ తెలంగాణ ఆ అమరవీరులకే అంకితం.

ఎవరు ఎన్ని లాజిక్కులు చెప్పినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా .. చివరికి జరగాల్సింది జరక్క తప్పలేదు. ఈ క్రెడిట్ అంతా ఒక్క కేసీఆర్‌కే దక్కుతుంది, దక్కాలి .. అని నా వ్యక్తిగత అభిప్రాయం. 

అయితే ఈ వాస్తవం ఒప్పుకోడానికి చాలామందికి రకరకాల ఈగోలూ, రాజకీయ కారణాలూ, ఇతర మైలేజీలూ మన్నూ మశానం అడ్డొస్తాయి.

నిజమే. ఇప్పుడు తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ, కాంగ్రెస్ పార్టీ, యూపీఏ గవర్నమెంటూ, అందులోని కొన్ని భాగస్వామ్య పార్టీలు కావొచ్చు. చివరి నిమిషాల్లో నానా తికమకలు మాట్లాడి, ఎలాగో ఒకలాగా దీనికి ఫినిషింగ్ టచ్ మేమే ఇచ్చాము అని బీజేపీ కూడా అనుకోవచ్చు. 

కానీ, ఇదంతా ఇలాంటి క్లయిమాక్సు చేరుకోడానికి సింగిల్ హ్యాండెడ్‌గా, చెదరని ఫోకస్‌తో ఒక గెరిల్లా ఉద్యమ నాయకుడిగా ఎదుటివారి ఎత్తులకు పైఎత్తులు వేస్తూ, చివరకు విజయం సాధించడానికి కారకుడయిన ఏకైక వ్యక్తి నిస్సందేహంగా కేసీఆరే.

ఒక్క మాటలో చెప్పాలంటే - 60 ఏళ్ల తెలంగాణ ఉద్యమానికి ఒక "గేమ్ చేంజర్" కేసీఆర్. ఫాలోడ్ బై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిలోకం, తెలంగాణ పొలిటికల్ జేఏసీ, ఇంకా ఇతర ఎన్నో జేఏసీలు. ఆ తర్వాతే మిగిలిన ఎవరైనా. 

కట్ టూ వాట్ నెక్స్‌ట్? 

ఇది ఒకరి విజయం, మరొకరి ఓటమి కానే కాదు. ఏదో ఒకరోజు జరగాల్సిన ఒక పరిష్కారం. దశాబ్దాలుగా రకరకాల దోపిడీ, దురాక్రమణలు, అణచివేత, వెన్నుపోట్లు వంటి ఎన్నో ఆరోపణలు, అపనమ్మకాల మధ్య ఒకే భాష మాట్లాడే ఇద్దరు అన్నదమ్ములు విడిగా బ్రతకడానికి వేరుపడ్డారు. అంతే. 

ఇదంతా ఒక (అ)సాధారణ రాజకీయ ప్రక్రియలో భాగం. ఏర్పడిన కొత్త రాష్ట్రానికి ఎవరు సీఎం అనీ, మంత్రులు ఎవరనీ, నాకేంటీ, నీకేంటీ అని .. మళ్లీ షరా మామూలే.

ఆ రాజకీయం ఒకవైపు. మానవ సంబంధాలు మరోవైపు.

నా ఆత్మీయ మిత్రులు, బంధువులు ఎందరో ఆంధ్రలో ఉన్నారు. రాయలసీమలో ఉన్నారు. దేశమంతా ఉన్నారు. ప్రపంచం నలుమూలలా ఉన్నారు. 

రాజకీయంగా, పరిపాలనాపరంగా ఎన్నో మార్పులుండొచ్చు. అది సహజం. మన సంబంధాల్లో మాత్రం ఎలాంటి విద్వేషాలుండవని నా నమ్మకం. ఉండకూడదని నా కోరిక. 

12 comments:

  1. రాజకీయంగా, పరిపాలనాపరంగా ఎన్నో మార్పులుండొచ్చు. అది సహజం. మన సంబంధాల్లో మాత్రం ఎలాంటి విద్వేషాలుండవని నా నమ్మకం. ఉండకూడదని నా కోరిక.

    Baaga Chepparu...

    ReplyDelete
    Replies
    1. థాంక్ యూ, గంగాధర్ గారు!

      Delete
  2. పులి, బంగారు కడియం కథ గుర్తొస్తొంది. అంత సడన్ గా మీరు సాంతికాముకులయ్యారంటే నమ్మే పిచ్చివాళ్ళు లేరిక్కడ

    ReplyDelete
    Replies
    1. అది మీ అభిప్రాయం.

      నిజానికి మీరు చెప్పిన ఆ "పులి బంగారు కడియం" కథే తెలంగాణ విషయంలో జరిగింది. కాబట్టే, ఈ ఉద్యమం.. ఈ తెలంగాణ ఏర్పాటు. ఇంతకుమించి దీన్ని సాగదీయటం నాకు ఇష్టం లేదు.

      Delete
  3. ఈ రోజు సీమాంద్ర కి జరిగింది రేపు తెలంగాణా లో కూడా జరుగుద్ది ....ఎవరో తలకు మాసిన వాడు వచ్చి Hyderabad ని సెపెరతె స్తతె గా చెయ్య మంటాడు. అప్పుడు వోట్లు-సీట్లు కోసం మళ్ళి తెలంగాణా ని ముక్కలు చేస్తారు ...ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నా!

    ReplyDelete
    Replies
    1. మీ రాజకీయ పరిజ్ఞానానికి, జోస్యానికి అభినందనలు.

      Delete
  4. తెలంగాణ రాష్ట్ర్ర ఏర్పాటుతో సీమాంధ్రులు బాధ పడాల్సిన అవసరం లేదు.

    ఎందుకంటే తెలుగు ప్రజలకోసం ఇప్పటికే....
    23 జిల్లాలున్నాయి.
    294 నియోజక వర్గాలున్నాయి.
    1200 మండలాలున్నాయి.
    25 వేల గ్రామాలున్నాయి.... ఇప్పుడు రెండు రాష్ట్ర్రాలు వస్తాయి. అంతే తేడా.
    రావచ్చు. పోవచ్చు. కలిసి ఉండవచ్చు. జస్ట్ ఇది రాజకీయ ప్రక్రియ మాత్రమే.
    తెలుగు వారంతా ఎప్పటికీ కలిసి ఉండాలని కోరుకుందాం.

    ReplyDelete
    Replies
    1. సంతోషం. అందరు కోరుకొనేదీ అదే. :)

      Delete