Saturday 4 January 2014

ఏ ఆనందం గొప్పది?

నేను తీసుకోకపోతే ఒక వ్యక్తి నా తొలి సినిమాకి మేనేజర్ అయ్యేవాడు కాదు. నేను చేయకపోయి ఉంటే, అదే వ్యక్తి నా మలి సినిమాకి ఎక్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అయివుండేవాడు కాదు. ఐదేళ్లుగా ఖాలీగా ఉన్న అదే వ్యక్తిని మళ్లీ.. నేను చేయకపోయివుంటే "ప్రొడ్యూసర్"కూడా అయి ఉండేవాడు కాదు!  

ఇది ఇండస్ట్రీ అంతా తెలిసిన వాస్తవం..

అలాగే - ఇప్పటివరకు నేను చేసిన మూడు సినిమాలూ ఒక రూపందాల్చి, పూర్తయ్యి, బయటపడటానికి, నలుగురూ నాలు డబ్బులు సంపాదించుకోడానికీ, నా ద్వారా పరిచయమైన ఎందరో ఇండస్ట్రీలో నిలదొక్కుకొని పైకి రావడానికి మూలకారణమైన వ్యక్తిని నేను. 

కట్ టూ నా ఆనందం -

అయితే, ఇదంతా నేను "తిరిగి వాళ్లేదో నాకు ఉపకారం చెయ్యాలని" చేసింది మాత్రం కాదు. ఎప్పుడయినా ఎక్కడయినా ఎదురుపడినప్పుడు కనీసం "హాయ్" చెప్తే కలిగే ఆ ఆనందం వేరు.  ఇంకెక్కడో.. టీవీల్లోనో, సినిమాల్లోనో వీళ్లందరినీ చూస్తున్నప్పుడు నాకు కలిగే ఆ ఆనందం వేరు.

ఆ ఆనందం చాలా గొప్పది నా దృష్టిలో.

"యూజ్ అండ్ త్రో" కల్చర్ కాదు!

కట్ టూ 2014 -

మళ్లీ అదే ఆనందం కోసం 2014 ని నాకు సంబంధించి ఒక "ఎపిక్ ఇయర్" చేసుకోబోతున్నాను. చాలా కష్టమే. అనుకున్నంత సులభం కాదు. కానీ, ఆ కష్టంలో ఉన్న మజానే వేరు!

ఇంక మనకు కావల్సినవి అంటారా? అవే ఫాలో అవుతాయి. ఇప్పుడు నేను వేరు. 

2 comments:

  1. హేపీ న్యూ ఇయర్ సర్!!మీ బ్లాగ్ రెగ్యులర్ ఫాలోయర్లం...మీ పోస్ట్లన్నీ బావుంటున్నాయ్...ఈ క్రొత్త సంవత్సరం లొ మరిన్ని మంచి విషయాలు మీ బ్లాగ్ ద్వారా పాంచుతారని ఆశిస్తాం....

    ReplyDelete
    Replies
    1. థాంక్ యూ వెరీ మచ్.
      తప్పకుండా. ఈ 2014 లో ఇంకా చాలా చాలా విషయాల గురించి రాయాలనుకుంటున్నాను. అవి మీకు తప్పక నచ్చితీరతాయి కూడా.
      మీకు కూడా.. వెరీ హేపీ న్యూ ఇయర్!!

      Delete