Thursday 7 November 2013

సినిమా అంతిమ లక్ష్యం డబ్బే!

నేను ఆర్ట్ సినిమాల గురించి మాట్లాడ్డం లేదు. వాటి ఉద్దేశ్యం, దారి వేరు. డబ్బు గురించి మర్చిపోతే చాలు. శాశ్వతంగా చరిత్రలో నిల్చిపోయే కళాఖండాలు ఎన్నయినా తీయవచ్చు. ఈ సెక్షన్ గురించి, దీన్లోనూ ఉండే నానా రాజకీయాల గురించీ మరోసారి, మరో బ్లాగ్ పోస్ట్ రాస్తాను.

ఫీల్డు గురించి, దాన్లో మునిగి తేలుతున్నవాళ్లు అనుభవించే అప్స్ అండ్ డౌన్స్ గురించి తెల్సినవాళ్లు మాత్రం "సినిమా అంతిమ లక్ష్యం" డబ్బు తప్ప మరొకటి కాదు అన్న నిజాన్ని ఒప్పుకుంటారు. సెలెబ్రిటీ హోదా, ఫేమ్, ఇతర ఆకర్షణలు వగైరా.. ఈ సిస్టమ్‌లో ఒక చిన్న భాగం మాత్రమే.

ఇదంతా తెలియనివాళ్లు, తెలిసినా పట్టించుకోనివాళ్ళు - యథాప్రకారం ఏవో నీతి సూత్రాలు చెప్తుంటారు. "ఇలా ఉండాలి.. అలా తీయాలి" అని. ఈ చెత్తంతా ప్రాక్టికల్స్‌కి పనిచేయని థియరీ లాంటిదన్నమాట. దాన్నలా వదిలేద్దాం.
 
కట్ టూ "టు బి ఆర్ నాట్ టు బి" -

నిన్ననే ఒక గుడ్ న్యూస్ తెలిసింది. నా సినిమాటోగ్రాఫర్ మిత్రుడు వీరేంద్ర లలిత్ (ముంబై) దర్శకుడయ్యాడు. తనే కెమెరామన్‌గా, దర్శకుడుగా ఒక హిందీ-ఇంగ్లిష్ బైలింగువల్ చిత్రం అతి త్వరలో ఫ్లోర్స్ మీదకి వెళ్లబోతోంది. డిల్లీ, ఇంకా హర్యానాలోని మోర్నీ హిల్స్‌లో షూటింగ్. "టు బి ఆర్ నాట్ టు బి" ఆ చిత్రం వర్కింగ్ టైటిల్. ఐ విష్ హిమ్ ఆల్ సక్సెస్.

సుమారు మూడేళ్లక్రితం లలిత్, నేను పార్ట్‌నర్స్‌గా ఒక ఇంగ్లిష్ చిత్రం చేయాలనుకున్నాం. హిమాలయ అడవులు బ్యాక్‌డ్రాప్‌గా కథాగమనం ఉంటుంది. ఒక మిస్టిక్ థ్రిల్లర్. నటీనటులు కూడా దాదాపు ఎక్కువ భాగం అమెరికా, ఇంకా ఇతర యూరోపియన్ దేశాల వాళ్లే.

అయితే, నా వ్యక్తిగత వ్యవహారాలు, కమిట్‌మెంట్ల కారణంగా ఆ ఆలోచన అలా సా..గిపోతూ ఇంకా ఆలోచన స్టేజిలోనే ఉంది. కాకపోతే ఆ స్క్రిప్టు మీద, ఆ చిత్రం ప్రమోషన్, మార్కెటింగ్‌లమీద నాతోపాటు మరో నాలుగు దేశాల క్రియేటివ్ టెక్నీషియన్లు/ఆర్టిస్టు మిత్రులు గత కొద్ది నెలలుగా పనిచేస్తున్నాం. 2014 చివర్లో ఆ చిత్రం ఉంటుంది.  

కట్ టూ ఇప్పటి నా తెలుగు చిత్రాల నేపథ్యం -

ఇప్పుడు నేను పని చేస్తున్న ప్రాజెక్టు - ఒక మూడు మైక్రో బడ్జెట్ చిత్రాల సీరీస్. ఈ సీరీస్ కౌంట్ డౌన్ డిసెంబర్ చివర్లోనే ప్రారంభం కాబోతోంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుని ప్రతి అడుగూ వేయాల్సివస్తోంది. దీన్ని ఇంకా సాగదీసే అవకాశం లేదు. ఎందుకంటే, దీనికోసం నేను పెట్టుకొన్న నా వ్యక్తిగత డెడ్‌లైన్ కూడా చాలా దగ్గర్లో ఉంది. 

ఈ మూడు చిత్రాలూ పక్కా కమర్షియల్ ఫార్ములా చిత్రాలు. ఇంకా చెప్పాలంటే, ఒక రకమైన "నట్స్ అండ్ బోల్ట్స్" సిస్టమ్‌లో రూపొందిస్తున్నవి. శాటిలైట్ రైట్స్ వాళ్లు, అవుట్‌రైట్ బయ్యర్స్, ఫైనాన్సియర్స్.. ఇలా ఒక్కొక్కరి వ్యాపార దృక్పథాల్ని, సలహాల్ని బట్టి ఒక్కో నట్టూ, బోల్టూ ఫిట్ చేసుకుంటూ కథలు అల్లాల్సిఉంటుంది. పైగా ఆర్టిస్టులంతా కొత్తవాళ్లు!  

కాదన్నామా - రాత్రికి రాత్రే దర్శకుడు మనోహర్ స్థానంలో ఎవరో "మల్లన్న" వచ్చేస్తాడు! ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో అంత రిస్క్ అవసరం లేదన్న నిజాన్ని మీరూ ఒప్పుకుంటారనుకుంటాను.

ఈ యాంగిల్ పక్కన పెడితే - ఏ కొంచెం రిస్కు తీసుకున్నా, నన్ను నమ్మి డబ్బు పెట్టినవాళ్లు కష్టాలపాలవుతారు. వారి సేఫ్టీ, వారి లాభాల గురించి కూడా ఆలోచిస్తూ, "ఇక్కడ ఇంతే" అనుకొని ముందుకు వెళ్లాల్సిందే. నాలుగు డబ్బులు రొటేషన్ చేసుకొని బయట పడాల్సిందే.

ఇప్పడు నేను చేస్తున్నది అదే.
^^^
(My direct email for aspiring Investors : mfamax2015@gmail.com)

1 comment:

  1. ఆర్భాటంగా ఆరంభమైన సినిమాలన్నీ తెరదాకాపోవు! గట్టి నిర్మాత ఉంటే దర్శకుడు మారిపోయినా సినిమా నిర్మాణం ఆగదు! వేరే ఎవరిమీదనో ఆర్ధిక ఆశలు పెట్టుకొని సినిమా ప్రారంభించ రాదు! సినిమా స్క్రిప్ట్ చదివితే వెంటనే టక్కున చెప్పెయ్యవచ్చును అది ఆడుతుందో ఆడకుండా చతికిలపడుతుందో! పూర్తి వ్యాపార సినిమాలను కూడా కొంచం కళాత్మకంగా తీయవచ్చు!మొదటి సినిమా బోర్లాపడితే మళ్ళీ రెండో సినిమా తీయగలగడం చాలా కష్టం!తీసిన సినిమా విజయమే మాట్లాడే పరిశ్రమ,సినిమా పరిశ్రమ!

    ReplyDelete