Sunday 3 November 2013

ఇప్పుడు సినిమా అంటే ఒక కార్పొరేట్ బిజినెస్!

నిన్న మొన్నటివరకూ సినిమా అంటే ఒక పెద్ద జూదం. హెవీ గ్యాంబ్లింగ్.

ఈ కారణంగానే - ఎవరైనా సరే, సినీ ఫీల్డులో పెట్టుబడి అంటే తెగ భయపడేవారు. పక్కవాళ్లు ఎవరైనా ఫీల్డులో పెట్టుబడి పెడుతున్నారన్నా "వద్దురా బాబూ" అని వారించేవారు.

ఇప్పుడు సీన్ మారింది.

ఇంతకు ముందులా, సినిమా వ్యాపారం అంటే గుప్పిట్లో మూసిన రహస్యం కాదు. ఫిలిం మేకింగ్‌లో - కాన్‌సెప్ట్ స్టేజ్ నుంచి, సినిమా రిలీజ్ అయి, డబ్బుల లెక్కలు పూర్తయ్యే వరకు.. ప్రతి  స్టేజిలోనూ జరిగే వ్యవహారం ఇప్పుడు ప్రతి ఒక్కరికీ తెలుసు. అంతా "ఓపెన్" అయిపోయింది.

ఇప్పటిదాకా - ఎవరో "కొందరు" మాత్రమే సినిమాలు తీయగలరు.. కొందరివల్ల మాత్రమే అవుతుంది ఈ వ్యాపారం అన్న అపోహ ఇప్పుడు హుష్ కాకి అయిపోయింది. అన్ని వ్యాపారాల్లాగే ఈ వ్యాపారం కూడా అన్న ఆత్మవిశ్వాసం, అవగాహన ఇప్పుడు దాదాపు అందర్లోనూ వచ్చింది.

అంతే కాదు. సినిమా రంగంలో వచ్చే సెలెబ్రిటీ హోదా ఎన్నో చోట్ల ఎంతగానో పనికొస్తుంది. చాలాచోట్ల రెడ్‌కార్పెట్ వెల్‌కమ్ లభిస్తుంది. మరెన్నో ఉపయోగాలున్నాయి. 

ఇదివరకులాగా సినిమా అంటే కోట్లు పెట్టి, భారీ హీరోలతోనే తీయాలన్న రూల్స్‌కి కూడా కాలం చెల్లింది. 30 నుంచి 60 కోట్లు పెట్టి భారీ హీరోలతో అత్యంత భారీగా తీసిన సినిమాలు ఎంత లాభాల్ని అయితే సంపాదించిపెడుతున్నాయో.. కేవలం 40-50 లక్షల్లో, అంతా కొత్తవాళ్లతో తీసిన సినిమాలూ అంతే లాభాల్ని తెచ్చిపెడుతున్నాయి.

ఇదంతా కూడా అందరూ గుర్తిస్తున్నారు.

సినిమా రంగంలో ఉన్నట్టుండి ఇంత భారీ మార్పు రావడానికి ప్రధాన కారణాలు రెండు: మొదటిది.. ఫిలిం మేకింగ్‌లో వచ్చిన లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీ. రెండోది.. ఏ ఫీల్డులోనయినా, ప్రతి లేటెస్ట్ సమాచారం ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండకుండా దాచిపెట్టగలిగే కాలం కనుమరుగు కావటం. "థాంక్స్ టూ ఇంటర్‌నెట్!" అన్నమాట ..

ఈ బిజినెస్‌లో ఉన్న 'ప్లస్' ఏంటో గుర్తించారు కాబట్టే, ఇప్పుడు రిలయెన్స్ వంటి కార్పొరేట్ కంపనీలు కూడా ఈ రంగంలోకి ఎంటరయి, భారీ సంఖ్యలో సినిమాలు నిర్మిస్తున్నాయి.

కట్ టూ కొత్త ప్రొడ్యూసర్స్ -

అతి చిన్న పెట్టుబడితో కూడా మీరు సినీ ఫీల్డులోకి ఎంటర్ కావొచ్చు. కో-ప్రొడ్యూసర్ హోదాలో నేరుగా ఫిలిం మేకింగ్‌లోని ప్రతి స్థాయిలోనూ ఏం జరుగుతుందో ప్రత్యక్షంగా పాల్గొంటూ తెలుసుకోవచ్చు.

మీరంతా నమ్మలేని ఫినిషింగ్ టచ్ ఏంటంటే - మీ పెట్టుబడి ఎంతయినా కానీ, అది 100% రిస్క్-ఫ్రీ!

ఈ గ్యారంటీ భారీ హీరోల భారీ బడ్జెట్ చిత్రాలకు మాత్రం నిల్! ఇది మీరంతా గమనించాల్సిన నిజం. ఇంక ఆలస్యం దేనికి?

రండి, సినిమా తీద్దాం!

ప్రొడ్యూసర్‌గా/కో-ప్రొడ్యూసర్‌గా "రాత్రికి రాత్రే సెలెబ్రిటీ హోదాతోపాటు - డబ్బుకి డబ్బు, మరెన్నో ఆకర్షణలు .. ఒక్క సినీ ఫీల్డులోనే సాధ్యం" అన్న విషయం మీరే ప్రత్యక్షంగా తెలుసుకోండి..
^^^

నిజంగా, సీరియస్‌గా .. ఫీల్డులోకి ఎంటరవ్వాలన్న ఆసక్తి ఉన్న ఔత్సాహిక / కొత్త ఇన్వెస్టర్లు, కో-ప్రొడ్యూసర్లు, యువ బిజినెస్ మాగ్నెట్లు (మీ ఫోన్ నంబర్‌తో) నన్ను నేరుగా సంప్రదించవచ్చు:  mfamax2015@gmail.com

1 comment:

  1. ఔత్సాహికులతో ఎంచక్కా సినిమా నిర్మించవచ్చు!...... కాని కథ,కథనం నవ్యాతినవ్యంగా,రమ్యాతిరమ్యంగా సరికొత్తగా విరచించుకోవాలి! కథలో మానవతావిలువలు రంగరించాలి,ఎదలో భావోద్వేగాలు రగిలించాలి!ఒక్క క్షణం కూడా ఎక్కడా ఎవ్వరూ బోరు కాకుండా చిత్రానువాదం పరుగులెత్తాలి!సినిమానే ఊపిరిగా చేసుకొని బతికే దార్శనికుడే మంచి సినిమా తీయగలడు!సినిమా తీసి చూడు!అత్యాధునిక డిజిటల్ టెక్నోలజి వచ్చాక ఇప్పుడు ఎవడైనా సినిమా తీయవచ్చు!సినిమాపరిశ్రమ ఇప్పుడు అందరికీ ఎర్రతివాచీ స్వాగతం పలుకుతోంది!అంతర్జాలం ద్వారా సినిమానిర్మాణంలోని సాంకేతికతలను ఇప్పుడు అందరూ నేర్చేసుకుంటున్నారు!సినిమా ఇకముందు మూసిన గుప్పిలి కాదు,తెరచిన పిడికిలి! సర్వస్వం సర్వులకూ అవగతం,కరతలామలకం!

    ReplyDelete