Saturday 2 November 2013

ఈ గోల్డెన్ లెగ్ రెమ్యూనరేషన్ 2 కోట్లు!

"అత్తారింటికి దారేది" సూపర్ డూపర్ హిట్ తర్వాత ఆ టీమ్‌లో పనిచేసిన చీఫ్ టెక్నీషియన్లకు, ముఖ్యమయిన ఆర్టిస్టులకూ ఒక్కసారిగా రెమ్యూనరేషన్లు పెరిగిపోయాయి. ఇది సహజం. ఇక్కడ డిమాండ్ ఉన్నప్పుడే డబ్బులొస్తాయి. డిమాండ్ లేకపోతే అంతే. నువ్వెవరో నేనెవరో!

అందుకే ఇక్కడందరూ దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకుంటారు.  అలా యెవరైనా జాగ్రత్త పడలేదంటే తర్వాత బ్రతుకు బస్టాండే ..

ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు చాలా విలువిస్తారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో ఈ (మూఢ) నమ్మకాన్ని ఎక్కువగా పాటిస్తారు.

ఉదాహరణకి మొదట్లో శృతిహాసన్‌కు హిట్లు లేవు. ఐరన్ లెగ్ అన్నారు. హీరోయిన్‌గా ఆమె గ్రాఫ్ పాతాళానికెళ్లింది. తర్వాత "గబ్బర్ సింగ్" హిట్టయ్యింది. సెంటిమెంట్ ఠక్కున తల్లకిందులైపోయింది. గ్రాఫ్ పైపైకి ఎగిసింది. బోలెడన్ని సినిమాలు ఇప్పుడామెకి. ఒక్క తెలుగులోనే కాదు. హిందీలో కూడా. ఇప్పుడు ఏ ఐరన్ లెగ్గూ గుర్తుకురాదు..

సేమ్ టు సేమ్ విత్ ప్రణీత. ఐరన్ లెగ్ అని ఆమెని అస్సలు ఎవ్వరూ  పట్టించుకోలేదు ఈ మధ్య. సపోర్టింగ్ కంటే కాస్తంత ఎక్కువగా ఉండే పాత్రలో "అత్తారింటికి దారేది" చిత్రంలో తనని ఎలాగో ధైర్యం చేసి తీసుకున్నారు. (సెకండ్ హీరోయిన్ పాత్ర అయినా తీసుకునే సాహసం చేసేవాళ్లు కాదు!).

సినిమా హిట్టు. కట్ చేస్తే ఒక అరడజన్ సినిమాలు ఆమె బుట్టలో పడిపోయాయి. రెమ్యూనరేషన్ చెప్పనక్కర్లేదు. ఆమె డిమాండ్ మేరకు.. ఆమె ఎంత చెప్తే అంత! ఇప్పుడు ఐరన్ లెగ్ అసలు గుర్తుకు రాదు..

కట్ టూ మన గోల్డెన్ లెగ్ -

"ఏ మాయ చేసావె" నుంచి ఇప్పటి వరకూ సమంత సినిమాలన్నీ హిట్లే. ఏదో ఒకటీ అరా తక్కువ రేంజ్‌లో నడవ్వొచ్చు. కానీ మొత్తంగా చూస్తే సమంత సినిమాలన్నీ హిట్లనే చెప్పొచ్చు. ఇంకేముంది.. ఇండస్ట్రీలో గోల్డెన్ లెగ్‌గా ఎస్టాబ్లిష్ అయిపోయింది.

ఎక్కువమంది భారీ హీరోలందరితో నటించిన ఈ స్టార్ హీరోయిన్‌కు లేటెస్టుగా వచ్చిన భారీ హిట్టు "అత్తారింటికి దారేది." దీంతో ఒక్కసారిగా టాప్ రేంజ్‌కు చేరిన ఈ గోల్డెన్ లెగ్ డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ అక్షరాలా 2 కోట్లని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

"ఏంటి.. అంతనా!?" అనుకోకండి. అదీ ఇండస్ట్రీ.

స్టార్ నిర్మాత బెల్లంకొండ సురేష్ కొడుకు శ్రీనివాస్‌ని హీరోగా పరిచయం చేస్తూ తీస్తున్న సినిమాలో సమంత హీరోయిన్‌గా నటిస్తోంది. అందులో లిప్‌లాక్ సీన్లు కూడా ఉన్నట్టు వినికిడి. ఆ లెక్కన సమంతకిస్తున్న 2 కోట్ల రెమ్యూనరేషన్ పెద్ద ఎక్కువేం కాదు.

సో, బి రెడీ ఫర్ ది నెక్‌స్ట్ స్పైసీ లిప్‌లాక్ సీన్ ఆఫ్ సమంత ఆన్ స్క్రీన్ ..  

1 comment:

  1. సినిమా పరిశ్రమలో కథానాయికలు ఎక్కువకాలం చెల్లుబాటు కారు! అందుకే తమ దీపం బాగా వెలుగుతుండగానే ముల్యాలు పెంచేసుకొని ఇళ్ళు చక్కపెట్టుకుంటారు! సమంత కూడా అంతే! అయిదేళ్ళలో సమంతా ఒక సామంత రాణి అయిపోయి అక్క,అత్త పాత్రలకూ షిఫ్ట్ అయిపోతుంది అప్పుడు ముద్దు సీన్లకోసం ఎవ్వరూ అడగరు కదా! అందుకే అవి చేసేసి ఎంచక్కా encash చేసుకుంటోంది! అంతే ! అందులో ఆశ్చర్యం ఏముంది!

    ReplyDelete