Saturday 19 October 2013

"పవనిజమ్"లో నిజమెంత?

ఈ మధ్య ట్విట్టర్లో రాంగోపాల్‌వర్మ ఓ అదే పనిగా ఒక విషయం గురించి ఊదరగొడుతున్నాడు. అది - పవన్ కల్యాణ్‌కు ఫ్యాన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి. పర్సనల్‌గా పవన్ కల్యాణ్ బ్రాండ్ ఇమేజ్ గురించి.

అంతవరకే అయితే ఫరవాలేదు. పవన్ అన్న చిరంజీవితో కంపేర్ చేస్తూ, చిరంజీవికన్నా పవర్ స్టార్‌కే పవర్ ఎక్కువగా ఉంది అని ఇన్‌డైరెక్టుగా చెప్పడం ఆ క్యాంపులో కొంచెం ఇబ్బందికరంగానే అనిపించి ఉంటుంది.

అంతటితో ఆగలేదు ఆర్‌జీవీ. ఇంత పవర్ ఉన్న ఇట్లాంటి సమయంలో - పవన్ కల్యాణ్ ఇమ్మీడియెట్‌గా ఒక పార్టీ పెట్టకపోతే అతనొక "ఇడియట్" కిందే లెక్క అని కూడా ట్వీట్ చేశాడు రామూజీ.

నాకు తెలిసి, రాంగోపాల్‌వర్మకు ఒకరిని పొగిడి డేట్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిని ఆయన ఎప్పుడో దాటేశాడు. కానీ, తన మైండ్‌లో ఏదో ఒకటి తప్పక స్పార్క్ అయ్యే ఉంటుంది. అందుకే ఈ హంగామా క్రియేట్ చేశాడని నేననుకుంటున్నాను. అదేంటన్నది ఆయనకే తెలియాలి.

ఎప్పుడూ ఏదో ఒకరకంగా వార్తల్లో ఉండాలిగా!

కట్ చేస్తే -

మొన్నటి "థాంక్యూ మీట్"లో పవన్ కల్యాణ్ భారీ ఎమోషనల్ స్పీచ్..

దాన్ని కూడా రామూజీ వదల్లేదు. మొన్నటి "అత్తారింటికి దారేది" పైరసీకి మూలకారణమైన ఆ వ్యక్తులెవరోగానీ వాళ్లని వితవుట్ వార్నింగ్ ఏదో చేసేలాగున్నాడని కామెంట్ చేశాడు వర్మ. పవన్ స్పీచ్‌ని తెగ మెచ్చుకున్నాడు.

నా ఉద్దేశ్యంలో - రామ్‌గోపాల్ వర్మ ఒక హీరోని మరీ ఇంత ఆకాశానికి ఎత్తెయ్యడం అనేది ఆయన స్టయిల్ కాదు. ఎక్కడో ఏదో తంతోంది..

కట్ చేస్తే -

పైరసీ అనేది ఒక్క హీరోకి సంబంధించిన విషయం కాదు. మొత్తం ఇండస్ట్రీకి సంబంధించింది. తనదగ్గర ఏదయినా సమాచారం ఉన్నప్పుడు దాన్ని బయటపెట్టడం, చట్టప్రకారం వారిపై చర్యతీసుకునేలా ఇండస్ట్రీకి, చట్టానికి సహకరించడం తప్పనిసరి. అదే కరెక్టు "ఇజమ్".

అలా కాకుండా, కేవలం వ్యక్తిగతంగా "తాటతీస్తా" నంటూ చెప్పిన ఆ ఒక్క పదం, తిలక్ కవిత్వాన్ని కోట్ చేస్తూ అద్భుతంగా ముగించిన ఆనాటి పవన్ కల్యాణ్ మొత్తం స్పీచ్‌కి ఒక మరకలా, మచ్చలా నిల్చిపోయింది.

"అత్తారింటికి దారేది" పైరసీని ప్రొత్సహించిన ఆ ఈఇండస్ట్రీలోని వ్యక్తులు ఎవరో, పవన్‌కు మాత్రమే తెలిసిన ఆ నిజం ఏంటో ఎప్పటికయినా బయటికి రావాల్సిందే.

అదే సిసలైన పవనిజమ్.   

6 comments:

  1. రాం గోపాల్ వర్మ ఏది చేసినా దాని వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది.అవన్నీ తన ప్రయోజనం కోసమే ఉంటాయి.

    ReplyDelete
    Replies
    1. 100% ఏకీభవిస్తాను మీతో.

      Delete
  2. మీరు మాట్లాడ్దానికి బ్లాగు, అగ్రిగేటర్ ఉంటే చాలు ..
    కానీ ఎవడిదైనా పేరు బయటపెట్టాలంటే "పటిష్టమైన" ఆధారాలు, సాక్ష్యాలు కావాలి.
    అన్ని ఆధారాలు అందరికోసం నగ్నచిత్రాన్ని చూపెట్టవవు ..

    ReplyDelete
    Replies
    1. మిత్రమా! నేను విషయాన్ని చాలా పాజిటివ్‌గా రాశాను. సాక్ష్యాధారాలు లేవు కాబట్టే ఆ డైలాగు. ఉంటే, ఆ "తాట తీయటం" అనేది ఎప్పుడో అయిపోయేది. అది మీకూ, నాకూ, వర్మగారికీ, అందరికీ తెలుసు. :)

      Delete
  3. పవన్ కళ్యాణ్ గారు తాట తీస్తా అని తమ అభిమానుల చప్పట్లకోసం అని ఉంటారు! కాని చెప్పకుండా చేయడమే పవనిజం! సాంకేతికత క్షణక్షణాభివ్రుద్ధి చెందుతున్న కాలంలో పైరసీ భూతాన్ని ఆపటం చాలా కష్టం!సెన్సేషనలిజమే రాం గోపాల్ వర్మిజం!పవన్ కళ్యాణ్ ఇప్పుడే పార్టీ పెట్టడం అనవసరం!వైవిధ్యమైన కథలకోసం నిత్యాన్వేషణ చేయాలి!అతని సినిమాలమీద ప్రేక్షకుల అంచనాలు వరుసవిజయాలతో అనూహ్యంగా పెరిగిపోయాయి!అతను ఇపుడు ప్రతి అడుగూ ఆచి తూచి బహు జాగ్రత్తగా వేయాలి!

    ReplyDelete
    Replies
    1. పార్టీ పెట్టడం కంటే ఫూలిష్ పని ఇంకొకటి లేదు. అది పవన్‌కి బాగా తెలుసు. వర్మలాంటివాళ్లు ఎంత గుచ్చినా, ఎంత ఎక్కించినా అలాంటి పిచ్చి స్టెప్ పవన్ వెయ్యడుగాక వెయ్యడు.

      Delete