Thursday 17 October 2013

కలెక్షన్లకు దారేది?

రిలీజ్ విషయంలో - నానా ట్విస్టులతో, ఆగీ ఆగీ రిలీజై రికార్డులు బద్దలు కొట్టిన సినిమా "ఆత్తారింటికి దారేది".

రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు ఒక ట్విస్టు. పూర్తయి రెడీగా ఉన్న సినిమాను రిలీజ్ చేయకుండా అలా వెయిట్ చేస్తూ ఆపి ఉంచాల్సివచ్చింది. ఇదే పెద్ద టెన్షన్ అనుకుంటే, ఆ సినిమాలో ఓ 90 నిమిషాల భాగం పైరసీ చేయబడి ఇంటర్‌నెట్లోకి ఎక్కేయడం ఇంకో పెద్ద ట్విస్టు.

విధిలేని పరిస్థితుల్లో ఆ సినిమాను కేవలం 4 రోజులముందు రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది. కొత్తగా పెద్ద పబ్లిసిటీలేమీ లేకుండా, అన్ని రోజులు ఆపి ఉంచిన ఆ సినిమాను అప్పటికప్పుడు, నాలుగంటే నాలుగు రోజుల్లో రిలీజ్ చేసేసారు! (రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు అప్పటికి ఇంకా అలాగే ఉన్నాయి అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి!)

సినిమా సూపర్ డూపర్ హిట్!

ఎంత హిట్టంటే, ఆ సినిమా నడుస్తున్న పోకడలను, అది క్రియేట్ చేస్తున్న కలెక్షన్ల రికార్డులను ఎప్పటికప్పుడు బాలీవుడ్‌తో పాటు, హాలీవుడ్ కూడా మానిటర్ చేసింది!

కేవలం 4 రోజులముందు రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసి రిలీజ్ చేసిన "అత్తారింటికి దారేది" సినిమా, ఓవర్సీస్‌లో భారీ కలెక్షన్లు సాధించిన 3వ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. (మొదటిది "చెన్నై ఎక్స్‌ప్రెస్స్", రెండోది "యే జవానీ హై దీవానీ").

అంతే కాదు. కేవలం 17 రోజుల్లో 64 కోట్ల నెట్ వసూళ్లు సాధించి, "బ్లాక్‌బస్టర్ ఆఫ్ ది ఇయర్"గా కనక వర్షం కురిపించింది ఈ సినిమా.

కట్ టూ ప్రీతిష్ నంది -

కవి, చిత్రకారుడు, జర్నలిస్టు, పొలిటీషియన్, ప్రొడ్యూసర్ కూడా అయిన ప్రీతిష్ నంది గురించి ఎక్కువగా చెప్పబోవటంలేదు నేను. ఈ సినిమా విషయంలో ఆయన లేవనెత్తిన రెండు పాయింట్ల గురించి మాత్రం ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.

1. "పైరసీని మనం భూతద్దంలో చూస్తున్నాము."
నిజమే. అంతగా లేని భయాన్ని పైరసీ పట్ల మనం పెంచుకుంటున్నాము. సినిమాలో దమ్మున్నప్పుడు దానికంత సీన్ ఉండదు. ప్రతివాడూ థియేటర్‌కే చచ్చినట్టు వెళ్లి మరీ సినిమా చూస్తాడు.

2. "ప్రచారానికి కోట్లకొద్దీ ఖర్చు పెట్టడం తప్పనిసరి ఏమీకాదు."
100% నిజం ఇది కూడా. ఎలాంటి భారీ పబ్లిసిటీ లేకుండా, ఒక రకమయిన స్మశానవైరాగ్య స్థితిలో, కేవలం 4 రోజులముందే రిలీజ్ డేట్ ప్రకటించి విడుదల చేసిన ఈ సినిమా కోట్లు కొల్లగొట్టింది!

ఎలా కాదంటాం?

అయితే ఇది కేవలం పవన్ కల్యాణ్ మీద ప్రేమతోనో, ప్రొడ్యూసర్ ప్రసాద్ మీద జాలితోనో ప్రేక్షకులు చేసిన హిట్టు కాదు. సినిమాలో విషయం ఉంది. ఇంకా చెప్పాలంటే - పవన్ ఇమేజ్‌ని కేంద్రంగా చేసుకొని, మనం మర్చిపోతున్న మానవ సంబంధాలను ముడిసరుకుగా హైలైట్ చేస్తూ, కమర్షియల్‌గా ఆ సినిమాను అంత బాగా రూపొందించిన దర్శకుడు త్రివిక్రమ్‌దే ఈ విజయం. 

1 comment:

  1. సినిమాలో విషయం ఉంటే పైరసీ జరిగినా మళ్ళీ మళ్ళీ థియేటర్ లకు వెళ్లి పడిపడి చూస్తారు!పడి చస్తారు! పబ్లిసిటీ చేయకున్నా కలెక్షన్స్ తగ్గవు!త్రివిక్రమ్ సంభాషణలు ఆకట్టుకున్నాయి!సెంటిమెంటు పండింది!సంగీతం అలరించింది!పవన్ కళ్యాన్ దర్శకుడు చెప్పినట్లు బుద్ధిగా ఒద్దికగా నటించాడు!అత్తపాత్రధారిణి హుందాగా నటించింది!ఎక్కడా విసుగు పుట్టలేదు! బ్రహ్మానందం ఎప్పటిలా నవ్వులు పండించాడు!minneapolis లో Carmike Cinemas లో టిక్కెట్ కు 10 డాలర్లు చెల్లించి పోయినవారం చూశాము! మొత్తం 75 సీట్స్ ఉన్నాయి!మా కుటుంబం కాక మరో 3 కుటుంబాలు చూశాయి!15 సీట్లు మాత్రమే నిండాయి! తెల్లారే మళ్ళీ నెట్ లో చూశాము!

    ReplyDelete