Sunday 13 October 2013

మిలియన్ డాలర్ కొశ్చన్! [2]

కొంతమందికి తాము ఏం చేయాలి అన్న విషయం మీద ఉండాల్సినంత స్పష్టత ఉండదు. "నేనేదో క్లరికల్ జాబ్ చేశాను.. అంతకు మించి నాకేం రాదు.. చేయలేను" అన్న పధ్ధతిలో వీరి ఆలోచన ఉంటుంది. కానీ, అది నిజం కాదు.

ఆలోచిస్తే ప్రతి ఒక్కరికీ ఎన్నెన్నో జీవిత లక్ష్యాలుంటాయి. వీటికి ఆర్థిక స్థోమత అనేదే ఎప్పుడూ అడ్డు కాదు. కాకపోతే - ఆ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్వచించుకోవడం దగ్గరే చాలామంది ఫెయిల్ అవుతారు. కొంతమందికి ఆ స్పష్టత ఉన్నా - ఆచరణ దగ్గరికి వచ్చేటప్పటికి డీలా పడిపోతారు.

నిజంగా ఏంచేయాలో తట్టనివారు ఒక్కసారి వారి వారి చిన్నతనపు జ్ఞాపకాల్లోకి వెళితే సమాధానం దొరుకుతుంది. మనం పెద్దయ్యాక ఏం కావాలని అనుకున్నామో ఎన్నటికీ మర్చిపోలేము. ఆ మెమొరీ బాక్స్‌ని ఒకసారి తెరిస్తే చాలు. మీరు ఏం చేయాలన్నది మీకే తెలుస్తుంది.

ఇక వాస్తవ జగత్‌లోకి వద్దాం..

"ఊహలు సరే .. ఏ రేంజ్‌లో నయినా ఊహిస్తాం. కానీ, అసలు డబ్బే లేకుండా ఎలా?" అని చాలా మంది ప్రశ్నిస్తారు.  మన మిలియన్ డాలర్ కొశ్చన్‌కు అసలు సమాధానం ఇక్కడే ఉంది.

డబ్బు మన దగ్గర లేదు. అదే మనకి ప్రధాన అడ్డంకి అనుకున్న మానసిక అభద్రతాస్థితిలో ఏ ఒక్కరూ తాము చేయగలిగిన ఏన్నో పనుల గురించి కనీసం అలోచించడానికే భయపడతారు. అలా కాకుండా - మన దగ్గర ఓ కోటి రూపాయలున్నాయి.. ఎలాంటి అడ్డంకులు, ఇబ్బందులు లేవు అనుకున్నపుడు ఉండే మానసిక స్థైర్యం వేరు.

ఇలాంటి స్థితిలోనే మనిషిలోని సంపూర్ణ సామర్థ్యం బయటికి వస్తుంది. అనుకున్న ఏ పనిని అయినా వేగంగా, విజయవంతంగా చేయగలుగుతారు. నిజానికి ఈ స్థితే మనలో సహజంగా ఉన్న అనేక శక్తిసామర్థ్యాలను బయటకు తెస్తుంది.

కట్ టూ నాణేనికి మరో వైపు -

"డబ్బు వచ్చాకే ఏదయినా చేద్దాం" అనుకునేవాళ్లంతా ఏదీ సాధించలేరు. ఎన్నటికీ. డబ్బు చేతినిండా అందినప్పుడు కూడా. ఇది నిరూపణ అయిన నిజం.

ఏదయినా లక్ష్యం పెట్టుకొని సాధించాలనుకొనేవారు తమలో సహజంగా ఉన్న సామర్థ్యాలను బయటకు తెచ్చుకొని కృషిచేయాల్సి ఉంటుంది. ఈ విషయంలో - మీలో ఉన్న సహజ సామర్థ్యాలను గుర్తించడానికి ఈ మిలియన్ డాలర్ కొశ్చన్ ఎక్సర్‌సైజు బాగా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఎలాంటి భయం లేకుండా ఒక ప్రణాలిక ప్రకారం మీరు కృషి చేస్తారు.

అది మీకు ఎంతో ఇష్టమైన పని, మీరు చేయగలనని నమ్మిన పని కాబట్టి.. సక్సెస్ సహజంగానే మిమ్మల్ని వరిస్తుంది.

సో, ఇప్పుడు మళ్లీ ఒక్కసారి మీరు రాసుకొన్న సమాధానాల్ని చూడండి. తర్వాత మీరేం చేయాలో మీకు ఎవరూ చెప్పనక్కర్లేదు!      

1 comment:

  1. మీరు కుబుసం విడిస్తే మీరు చురుగ్గా మీ సృజన శక్తిలో ఆకాశం అంచులు అంటవచ్చును! స్కై ఈస్ ది లిమిట్! మీరు హనుమంతులు,మీ శక్తి మీకే తెలియదు!చిమ్మని మనోహర్లు ఎందరో మీ శక్తిని తెలియచెపితే అప్పుడు మీరు విజ్రు౦భి౦చి ఒక్క దూకులో సముద్రాన్ని దాటుతారు!కనుక లేవండి!బలమైన సినిమా స్క్రిప్ట్ తయారు చేసుకోండి!అప్పుడు రామానాయుడు,రామోజీరావు డబ్బుల సంచులు పట్టుకొని మీ ఇంటిగుమ్మం తలుపుకొడతారు!ఎందుకంటే వాళ్ళు ఫిలిం స్టూడియో లు కట్టుకున్నారు కాని వారిలో సృజన శక్తి లేదు!

    ReplyDelete