Tuesday 27 August 2013

"చెన్నై ఎక్స్‌ప్రెస్" చెత్త సినిమానా?

షారుఖ్ ఖాన్, దీపికా పడుకొనే నటించిన రోహిత్ షెట్టి సినిమా "చెన్నై ఎక్స్‌ప్రెస్" మొన్న ఆగస్ట్ 9 నాడు రిలీజయింది. కేవలం 18 రోజుల్లో 200 కోట్ల వసూళ్లని క్రాస్ చేసి, కలెక్షన్ల రికార్డుల్ని బద్దలుకొడుతోంది!

ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఈ సినిమాని 5 సార్లు చూసి, ఓ 10 ట్వీట్లు పెట్టాడు. ఒకప్పటి అమితాబ్-మన్మోహన్ దేశాయ్ జోడీని ఇప్పుడు మళ్లీ షారుఖ్-రోహిత్ షెట్టిల జోడీతో పోల్చాడు. రోహిత్ షెట్టిని తెగ పొగిడేశాడు. ఎందుకు?

ఒక కమర్షియల్ సినిమా తీసి హిట్టు కొట్టడానికి అందరూ నానా తంటాలు పడుతుంటారు. అంత అవసరం లేదు అని రోహిత్ షెట్టి ప్రూవ్ చేశాడన్నది ఆయన అభిప్రాయం.

ఏ సగటు ప్రేక్షకుడినయితే దృష్టిలో పెట్టుకొని రోహిత్ షెట్టి ఆ సినిమా తీశాడో, ఆ సగటు ప్రేక్షకుడు దాన్ని బాగా ఇష్టపడ్డాడు. లక్ష్యం నెరవేరింది. ఇంకేం కావాలి?

చాలా మంది విమర్శకులు (ది గ్రేట్ రివ్యూయర్స్!) ఈ "చెన్నై ఎక్స్‌ప్రెస్" సినిమాను ఒక చెత్త సినిమా కింద జమకడుతూ తమ విలువైన రివ్యూలు పత్రికల్లో, వెబ్‌సైట్స్‌లో రాశారు. ఏది చెత్త అనేది మరోసారి ప్రూవయింది.

ఒక పాపులర్-లేదా-కమర్షియల్ మెయిన్‌స్ట్రీమ్ సినిమాను ఆ కోణంలోనే చూడాలి. వాటిమీద రాసే సమీక్షలు కూడా ఆ కోణంలోనే బేరీజు వేసి రాయాలి.

పాపులర్ సినిమా గొప్పతనాన్ని ప్రేక్షకులు దానికి అందించే "సక్సెస్"ను బట్టి నిర్ధారిస్తారు. ఆ సక్సెస్ కోసమే, ఆ కలెక్షన్ల కోసమే కమర్షియల్ సినిమాలను తీస్తారు. అంతే తప్ప, కేవలం నీతులు చెప్పడానికో, సందేశాలివ్వడానికో కోట్లు ఖర్చుపెట్టి సినిమాలు ఎవ్వరూ తీయరు.

మనం వేసుకున్న మైండ్‌సెట్ మాస్కుని, మన హిపోక్రసీని ఒక్క క్షణం పక్కన పెడితే ఈ నిజం మనకు అర్థమవుతుంది.

కట్ టూ "తూనికలు, కొలతలు" -

సగటు ప్రేక్షకుని వినోదం కోసం తీసేవి కమర్షియల్ సినిమాలు. సగటు ప్రేక్షకునితో సంబంధం లేకుండా, లాభనష్టాలతో సంబంధం లేకుండా ఇంటలెక్చువల్‌గానో, సందేశాత్మకంగానో తీసేవి ఆర్ట్ సినిమాలు-లేదా- నాన్-కమర్షియల్ సినిమాలు.

దేని దృక్కోణం దానిదే. దేని తూనిక రాళ్లు దానివే.

ఒక ఫక్తు కమర్షియల్ సినిమాని సోకాల్డ్ ఇంటలెక్చువల్ సమీక్షకులు తూకం వేస్తే ఇలాగే ఉంటుంది. "చెన్నై ఎక్స్‌ప్రెస్ పరమ చెత్త సినిమా" అనే రివ్యూనే మన ముందుకొస్తుంది.  

ఒక కమర్షియల్ సినిమా మంచి చెడులను నిర్ధారించేది కేవలం నలుగురయిదుగురు రివ్యూయర్లు కాదు. లక్షలాదిమంది ప్రేక్షకులు!    

3 comments:

  1. మీ లాజిక్ బాగానే ఉంది కాని, సినిమా సిల్లీగా ఉంది.
    దీనికంటే మన "మర్యాద రామన్న" చాలా బెటర్.

    ReplyDelete
    Replies
    1. నా లాజిక్ ఒక ఫిలిం మేకర్‌గా మాత్రమే. థాంక్స్ ఫర్ యువర్ కామెంట్! :)

      Delete
  2. అమెరికాలో చూశాం!హాల్ ముప్పైశాతం కూడా నిండలేదు!మా అబ్బాయికి ససేమిరా నచ్చలేదు!నాలుగేళ్ల మా మనవడికి నచ్చింది,enjoy చేశాడు మమ్మల్ని సతాయించకుండా!మా ఆవిడకు నచ్చింది!నాకు దీపికా నటన నచ్చింది!కథ అసహజంగా కృత్రిమంగా ఉంది!సినిమాలో logic లోపించింది!

    ReplyDelete