Monday 8 July 2013

కొత్తవాళ్లతో సినిమా తీయడం ఎందుకు సాహసం కాదు?

మొన్నొక ఆడియో కార్యక్రమంలో అనుకుంటాను.. సీనియర్ దర్శకుడు ఒకరు  ఒక మాటన్నారు. "కొత్తవాళ్లతో సినిమా తీయడం సాహసం" అని! ఇది దాదాపు ఇండస్ట్రీలోని అందరు సీనియర్లూ ఎప్పుడూ చెప్పేదే. అందులో ఎలాంటి సందేహం లేదు. అబధ్ధమూ కాదు.

అయితే, చిన్న బడ్జెట్లో సినిమా తీయాలనుకునేవారికి మరో గత్యంతరం లేదు.

బడ్జెట్ విషయం అలా ఉంచితే - అంతా కొత్తవాళ్లతో తీస్తున్న సినిమాలకు బిజినెస్ ట్రెండు ఈ మధ్య చాలా బావుంది. కనీసం సపోర్టింగ్‌కి కూడా తెలిసిన ఆర్టిస్టులను, సీనియర్ ఆర్టిస్టులను తీసుకోకుండా ఇప్పటి దర్శకులు విజయాల్ని సాధించి మరీ చూపిస్తున్నారు.

ఈ విప్లవాత్మక మార్పుని సో కాల్డ్ సీనియర్ సినీ పండితులు గమనిస్తున్నారనుకుంటాను. "సపోర్టింగ్‌కి ఫలానా ఫలానా ఆర్టిస్టుల్ని, కమెడియన్లని పెట్టండి. ఫోటో కార్డు మీద, పోస్టర్ మీద.. కనీసం వాళ్ల తలకాయల్ని చూసయినా జనాలొస్తారు సినిమాకి!" అని పాత చింతకాయ పచ్చడి రూల్స్‌ని చెప్పేది ఈ సినీ పండితులే. ఆ తలకాయలే లేకపోతే అసలు సినిమాకి శాటిలైట్ రైట్స్ రానే రావు అనీ, అసలు సినిమానే రిలీజ్ కాదనీ సొద పెట్టేదీ వీళ్లే.

కానీ అవన్నీ హాయిగా జరిగిపోతున్నాయి.  

వరుసగా హిట్లు కొడుతూ, క్రిటిక్స్ మన్ననలు కూడా (!) అందుకొంటున్న ఇటీవలి కొత్త సినిమాల్లో ఈ రూల్‌ని ఏ డైరెక్టరూ అసలు పట్టించుకోలేదు.

అయితే ఒక్కటి మాత్రం నిజం. సినిమాలో స్టఫ్ ఉండాలి. స్టఫ్ లేకపోయినా, ఆడియన్స్‌ని థియేటర్‌కు రప్పించగల యూ.ఎస్.పి. (యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్) ఏదో ఒకటి ఉండాలి. ఆ రేంజ్‌లోనే ప్రమోషన్ కూడా అవసరం. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు. కొత్తవాళ్లతో సినిమా తీసినా ఎలాంటి రిస్క్ ఉండదు.

ఈ నిజాన్ని, ఇటీవలే రిలీజయి కోట్లు కుమ్మరించిన కొన్ని చిన్న సినిమాలు నిరూపించాయి.

బడ్జెట్ పరంగా నాకున్న పరిధిలో, ఇప్పుడు నేను చేపట్టిన మూడు మైక్రో బడ్జెట్ సినిమాల ప్రాజెక్టులో అంతా కొత్తవారినే పరిచయం చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే చేస్తున్నాను.

ఈ సందర్భంగా మరో విషయాన్ని కూడా మీతో పంచుకోవాలి. ఆల్రెడీ ఖాతాలో హిట్లు ఉండి, కాస్త బాగానే పేరున్న చిన్న హీరోల సినిమాలు, ఇంతకు ముందే భారీ హిట్లిచ్చిన కొందరు సీనియర్ దర్శకుల కొత్త చిత్రాలు కూడా కొన్ని ఈ మధ్య బిజినెస్‌కు నోచుకోవడం లేదు!

ఈ చిత్రాలతో పోలిస్తే, కొత్తవాళ్లతో తీసే చిత్రాల బడ్జెట్ చాలా చాలా తక్కువ. కాబట్టి - సినిమా హిట్టయినా, ఫట్టయినా రిస్కు శాతం కూడా చాలా చాలా తక్కువ. ఇంక ఇతర భారీ హీరోలు, దర్శకుల చిత్రాలతో పోలిస్తే - అంతా కొత్తవాళ్లతో తీసే ఈ చిత్రాలకు అసలు రిస్క్ అనేది దాదాపు లేనట్టే!  
(My direct email: mchimmani@gmail.com)

6 comments:

 1. మీ బ్లాగు ని "పూదండ" తో అనుసంధానించండి.

  www.poodanda.blogspot.com

  ReplyDelete
  Replies
  1. ఈ రోజే చేస్తున్నాను. థాంక్స్.

   Delete
 2. పూర్తిగా కొత్తవాళ్ళతో తెలుగుసినిమా తీస్తే తక్కువలో తక్కువ ఎంతవుతుంది ఎక్కువలో ఎక్కువ ఎంతవుతుందో చెప్తారా?అది చూసి ఎవరయినా ముందకు రావచ్చు!ఏమో ఎవరు చెప్పగలరు గుర్రం ఎగరావచ్చు!

  ReplyDelete
  Replies
  1. తక్కువలో తక్కువ 30 లక్షలు. ఎక్కువలో ఎక్కువ 50 లక్షలు.

   30 విషయంలో ప్రమోషన్ కోసం ఎక్కువగా స్పాన్సర్స్ మీద, ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్ మీద, సోషల్ నెట్వర్క్ సైట్స్ మీద ఆధారపడటం/ఉపయోగించుకోవడం జరుగుతుంది. కొంత ఒత్తిడి ఉంటుంది.

   50 విషయంలో, ఎలాంటి సమస్యా ఉండదు. ఏ స్టేజ్ లోనూ కాంప్రమైజ్ కావల్సిన అవసరం రాదు. మన సినిమా, మన ఇష్టం అన్నమాట!

   మీ కామెంట్స్‌కీ, ప్రోత్సాహానికీ చాలా థాంక్స్!

   Delete
 3. కొత్తరక్తం సినిమాల్లోకి ప్రవేశిస్తే కొత్త పరిశుభ్రమయిన గాలి ప్రవేశించి ఒక తాజాతనంతో సినిమా జవజవలాడుతుంది!పాతవాళ్ల జిడ్డు కంపు వదలిపోతుంది!వీళ్ళల్లో నందమూరి అక్కినేని స్థాయినటులు ఒక్కరూ లేరు!శరీర సౌష్టవం ఉన్న తెలుగమ్మాయిలు ఎందరెందరో ఉన్నారు...కామంతో కైపెక్కిన కళ్ళతో చూడకపోతే!పాడుతా తీయగాలో ఎందఱో గాయనీ గాయకులు సంగీత దర్శకులు దొరుకుతారు!నృత్య దర్శకులు టీవీ కార్యక్రమాల్లో దొరుకుతారు!ఫిల్మ్ institutes నుంచి తయారయిన చాయాచిత్రాగ్రాహకులు,సాంకేతిక నిపుణులు నటీనటులు దర్శకులు ఎడిటర్లు ఒక్క అవకాశంకోసం ఎదురుచూస్తున్నారు!మీదే ఆలస్యం పదండి ముందుకు!ఒక్క సినిమాతో దుమ్మురేపుతారు!నిర్మాతకు కాసులు గలగలలాడిస్తారు!మొదట సాహసం చేసేవారు మీరేఅవ్వండి!సుడి ఉన్నవాడు అవకాశం మొట్టమొదట అందుకుంటాడు!త్వరపడన్డహో!!!!!!!!

  ReplyDelete
 4. కొత్తవాళ్ళతో సినిమా తీయటం సాహసమే.
  ప్రస్తుతం రంగాన్ని యేలుతున్న వారసులకు నటన అన్నది తెలియదు కదా?
  క్రమంగా మనమూ నటన అన్నది యెలా ఉంటుందో అనికూడా అలోచించటం‌ మానివేస్తున్న రోజులు.
  కొత్త నటులు, నటిస్తారు.
  అది కొత్త విషయం.
  అంచేత అటువంటిది ప్రదర్శించటం సాహసమే‌ కద!

  ReplyDelete