Thursday 18 July 2013

ఒక్క బ్లాగ్ ఉంటే చాలు.. ఏదయినా సాధించవచ్చు!

"ఏ రచయితైనా, తన జీవన పర్యంతం రాయటం అనే తన ప్యాషన్ ను మర్చిపోలేడు. ఇదే ఇతర సృజనాత్మక రంగాల్లోని వారికందరికి కూడా వర్తిస్తుంది. నా విషయంలోనూ అంతే. పైగా, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మనకు అందించిన ఒక అందమైన బహుమతి 'బ్లాగ్'. ఈ బహుమతిని నేను మనస్పూర్తిగా స్వీకరించాను.

ఇదివరకటిలా కాగితం మీద రాసి, పోస్ట్ చేసి, దాని ప్రచురణ కోసం ఎదురుచూడాల్సిన అవసరం ఇప్పుడు లేదు. మనం ఏదంటే అది రాసుకోవచ్చు, ఎప్పుడంటే అప్పుడు రాసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్నది కూడా అదే. 

ఒక్క బ్లాగ్‌ ఉంటే చాలు. రచయిత ఏదయినా రాయవచ్చు. ఎన్ని ప్రయోగాలయినా చేసుకోవచ్చు. ఎంతయినా సాధించవచ్చు. ప్రస్తుతం నా ఆలోచనలు ఆ దిశలో సాగుతున్నాయి."

...

ఇది ఎవరి కొటేషనూ కాదు. నా మాటలే! 

థాంక్స్ టూ పూదండ! తెలుగు బ్లాగుల అడ్డా.. "పూదండ" లో వచ్చిన నా ఇంటర్వ్యూలోంచి ఒక చిన్న భాగాన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేశాను. ఆసక్తి ఉన్నవారు, ఇంటర్వ్యూ మిగిలిన భాగాన్ని ఈ లింకు ద్వారా వెళ్లి "పూదండ"లో చదవవచ్చు.
 

నా దృష్టిలో నిజానికి ఇది ఇంటర్వ్యూ కాదు. నన్ను నేను ఒకసారి పలకరించుకోడానికీ, విశ్లేషించుకోడానికీ పూదండ నాకిచ్చిన అవకాశం.  

6 comments:

  1. ఎప్పటి నుండో అడుగుదామనుకున్న ప్రశ్న .
    మీ పోస్ట్ లు చదువుతుంటే , మీరు పూర్వాశ్రమం లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేసేవారని తెలుస్తుంది . సినిమాల పట్ల మీకు అంత passion కూడా లేదని తెలుస్తుంది .
    కాని దానికి resign చేసి, ఈ సినిమా అనే మాయా అనిశ్చిత రంగం లోకి రావడానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు .
    అంతటి భరోసా ఈ రంగం లో ఏం కనిపించింది .
    ఒక మధ్యతరగతి మనిషి ( మీరు మధ్యతరగతి అని అనుకుంటున్నాను ) ప్రభుత్వ ఉద్యోగం వదిలి రావడం చాలా సాహసం.
    డబ్బు విషయం లో లోటు లేని వాళ్ళు కూడా భయపడతారు .
    సక్సెస్ రేట్ అతి తక్కువగా ఉండే రంగం ఇది . మీరు ఏ ధైర్యం తో వచ్చారో చెప్పగలరా ?

    ReplyDelete
    Replies
    1. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి రిజైన్ చేసింది నాకెప్పుడూ సమస్య కాలేదు. నేను రిజైన్ చేసిన చివరి ఉద్యోగం.. నేను పని చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మూడవది.

      నేను ప్రభుత్వ ఉద్యోగం చేస్తే వచ్చే ఆదాయం కంటే కనీసం రెండు రెట్లు ఎక్కువ ఆదాయాన్నీ, లైఫ్‌స్టయిల్‌నీ నా ఇతర వ్యాపకాల ద్వారా నేను పొందగలిగాను. పొందుతున్నాను. ప్రభుత్వ ఉద్యోగం వదిలిపెట్టానే అని నేను ఎప్పుడూ బాధపడలేదు.

      నేను ఆ ఉద్యోగం వదిలిపెట్టింది కేవలం హైద్రాబాద్‌లో ఉండటం కోసం. విచిత్రమేంటంటే, ఇప్పుడు నాకు హైద్రాబాద్ మీద అంత ప్రేమ లేదు!

      మీరన్నది నిజం. సినిమా ఫీల్డు ఒక మాయా లోకం. ఒక సక్సెస్ రావాలంటే దాని వెనక ఎన్నో ఉంటాయి. అవన్నీ ఉన్నా, చాలా సందర్భాల్లో సక్సెస్ మనకు అందదు. అయితే, ఒకటి మాత్రం నిజం. ఇదివరకటి రోజులతో పోలిస్తే, ఇప్పుడు పరిస్ఠితి చాలా మారింది. దీనికి కారణం ఆధునిక టెక్నాలజీ. దీనివల్ల సక్సెస్ రేటు పెరిగింది. ఆర్థికపరమైన రిస్కు తగ్గింది.






      Delete
  2. మనోహర్ జీ,
    ఇప్పుడే పూదండలో మీ ఇంటర్వూ చదివాను. చివర్లో అమెరికాలో యాంత్రికజీవితం అని వ్రాశారు. ఆది సరి కాదండీ. ప్రపంచంలో ఎక్కడయినా యాంత్రికం, క్రుతకం మన మనస్తత్వాన్నిబట్టే వుంటాయనుకుంటా. నాకైతే యాంత్రికమేమి కనపడలేదు. కాకపోతే ఇండియాలా 24గంటలూ సినిమాలు నడవవు కాబట్టి బోర్ అనిపించగానే వెళ్ళలేకపొవచ్చు..... ఒక working day లో (ఉదాహరణకి Monday - Friday) హైదరాబాద్ లో దాదాపు ప్రతి సినిమా థియేటర్ ఎందుకు/ఎలా ఫుల్లవుతుందో నాకిప్పటికీ అర్ధం కాదు

    ReplyDelete
    Replies
    1. పండు గారూ!

      "యాంత్రికం" అన్న పదాన్ని మీరు వివరించిన కోణంలో నేను రాయలేదు. నా ఉద్దేశ్యం పూర్తిగా వేరు. అది మరొక బ్లాగ్ పోస్ట్ అవుతుంది. తప్పకుండా రాస్తాను మరోసారి.

      కామెంట్లో మీరు చెప్పిన పాయింట్‌తో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. థాంక్స్ ఫర్ ది కామెంట్!

      Delete
  3. చిమ్మని కేంద్ర భద్ర safe ఉద్యోగాన్ని వదలుకోవడం అనే రిస్క్ ను నేను ఊహించలేను!బాబోయ్ ఎంత అపాయం!అంతకు రెండు రెట్లు ఆదాయం అనేది నేను ససేమిరా నమ్మలేకపోతున్నాను!నాకు రెండు అవకాశాలు వచ్చినా ఉద్యోగం వదలుకొనే సాహసం నేను చేయలేకపోయాను!అందుకు నేను ఇపుడు చింతించడం లేదు!ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా పదవీ విరమణచేసి ప్రశాంతంగా బతుకుతున్నాను!october 20 వరకు అమెరికాలో ఉంటాను.వివరాలు నా ఆత్మకథలో విశదీకరిస్తాను.నేను Dr జయప్రకాశ్ నారాయణ్ IAS ప్రభుత్వోద్యోగాన్ని వదలి సంఘసేవ చేస్తానన్నప్పుడు నేను సరైన నిర్ణయం కాదన్నాను!అతను మా నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పుడు అతనికే నా వోట్ వేసాను!గెలిచాడు.అతనంటాడు ఆనాటినుంచి ఈనాటి దాకా తాను అప్పుడు రాజీనామా చేసిందే రైట్ అని!ఎవరిజీవితం వారిష్టం!

    ReplyDelete
    Replies
    1. Surya Prakash ji!
      Thanks for your comment.
      Plz forward me your email, if you don't mind.

      Delete