Monday 15 July 2013

ఏదో ఓ "బ్లా బ్లా" రాయడం ఎలా?

బ్లాగ్‌లో మనం రాసేది పది వాక్యాలు కావొచ్చు. వంద వాక్యాలు కావొచ్చు. 'ఏదో ఒకటి రాయొచ్చులే' అనుకుంటాం. ఆ ఏదో ఒకటి రాయడం కూడా నిజానికి అంత సులభం కాదు. ఎంత రాయాలనుకున్నా ఆ ఫ్లో సహజంగా రాదు.

నా వ్యక్తిగత అధ్యయనంలో, బ్లాగింగ్‌కి సంబంధించి కొన్ని అంతస్సూత్రాల్ని గుర్తించాను. వాటిల్లో కొన్నిటి గురించి ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను.

ఒక సక్సెస్‌ఫుల్ బ్లాగర్ - లేదా - ఒక 'ఏ గ్రేడ్ బ్లాగర్' కావాలనుకొనేవాళ్లకి ఇప్పుడు నేను చర్చించబోయే రెండు పాయింట్లు తప్పక ఉపయోగపడతాయని నా ఉద్దేశ్యం.

బ్లాగ్ పోస్టుల్లో రెండే రెండు రకాలుంటాయి:

1. చాలా విలువయిన పోస్టులు / మాసివ్ వేల్యూ పొస్ట్స్ (MVPs)
2. ఖాళీని నింపే పోస్టులు / ఫిల్లర్ పోస్టులు (FPs)  

ఒక MVP లో రాసిన అంశంతో ఒక పుస్తకం కూడా రాయొచ్చు. అంత విలువయిన సమాచారం గానీ, ఫీల్ గానీ అందులో ఉంటుంది. FP అలా కాదు. ఏదో ఒకటి రాయాలని అన్నట్టుగానే రాస్తారు. కానీ, అందులోనూ కనీసం ఒక్క వాక్యమయినా సెన్సిబుల్‌గానూ, విలువైనదిగానూ ఉంటుంది. ఉండి తీరుతుంది. ఆ ఒక్క వాక్యంతోనే ఆ FP కి ఆ వాల్యూ వస్తుంది.

సహజంగానే ఒక MVP రాయడానికి కొన్ని గంటల సమయం తీసుకుంటుంది. FP కి మాత్రం ఒక అరగంట చాలు.

సాధారణంగా 'ఏ-క్లాస్' బ్లాగర్లందరి బ్లాగుల్లోనూ ఈ రెండు రకాల పోస్టులుంటాయి. వీటి రేషియో మామూలుగా 1:4 గా ఉంటుంది. అంటే ఒక MVP పోస్టు రాస్తే, కనీసం ఒక నాలుగు FP పోస్టులు రాస్తారు. ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం రాస్తారని కాదు. అదలా జరిగిపోతుందంతే!  

కట్ టూ నగ్నచిత్రం -

నగ్నచిత్రంలో నేను ఎక్కువగా ఏదో ఒక 'నాన్సెన్స్' రాయాలనుకొనే ప్రారంభిస్తాను. రాయడం పూర్తయ్యేటప్పటికి అది తప్పక ఒక FP నో, MVP నో అవుతుంది. ఈ రెండింటి రేషియో కూడా నా బ్లాగ్‌లో ఇంచు మించు 1:4 గానే కనిపిస్తోంది. నా ఈ కొద్ది నెలల బ్లాగింగ్ అనుభవంలో నేను తెలుసుకొన్నది ఏంటంటే - మనం ఏ చెత్త రాసినా అది తప్పక పాఠకుడ్ని ఆకర్షించే చెత్తనే అయి ఉండాలి. దానికి తోడు, చదివించే గుణం కూడా చాలా ముఖ్యం.

సో, మన బ్లాగే కదా అని ఏదో ఒకటి రాసేస్తే సరిపోదు. కొంచెం ఆలోచించి రాయాలి, కొంచెం ఎట్రాక్టివ్‌గా కూడా రాయాలన్నమాట!    

5 comments:

 1. ౧. ఎంత చెత్త రాస్తే అంత ఆకర్షణ ఈ‌ నాడు. విషయం ఉన్న పోష్టులు చదివి తలనొప్పి తెచ్చుకోవటం ఎందుకని జనాభిప్రాయం అనుకుంటాను.

  ౨. బ్లాగరుకు ఉన్న following కూడా తరచుగా ఉపయోగిస్తుంది, విషయ సంబంధం లేకుండా. కాని దాన్ని మాత్రం నమ్ముకుంటే గోవిందా.

  ౩. ఎక్కువ following కనబడిన టపాలకు మరింత యెక్కువ ఆకర్షణ ఉంటుంది. ఇదొక వలయం. మంచో చెడో అదంతే.

  ౪. మీ టపా వివాదాస్పదం లేదా బిన్నాభిప్రాయాలకు తావిచ్చే వేదిక అయితే పంట పండవచ్చు.

  ReplyDelete
  Replies
  1. థాంక్ యూ. నాలుగు మంచి పాయింట్లు చెప్పారు. వాటిలో నాలుగవది అద్భుతం. దాని గురించి నేను ఎప్పట్నుంచో అనుకుంటున్నాను. ఎప్పుడో అదీ చేస్తాను. కాకపోతే, పాజిటివ్ కోణంలో! తర్వాత అది ఏ కోణంలోకయినా మలుపు తిరగొచ్చు. అది మన చేతుల్లో లేదు. :)

   Delete
 2. విషయం ఏది రాసినా ఆసక్తికరంగా చదివించేదిగా ఉండాలి!అల్లాటప్పా టపాలు టపీమని ఎడాపెడా గుప్పిస్తే చదివే సమయం చదువరులకు లేదు!భారమయిన విషయాన్ని కూడా తేలికగా చెప్పాలి!అరటిపండు ఒలిచి నమిలి నోట్లో పెట్టినట్లు ఉండాలి!నమిలే సమయంలేదు!అంతా వేగం వేగం వేగం!వేగం ఈ యుగధర్మం!టపాలు రాయడం కంటే వ్యాఖ్యలు రాయడం కొంచం సులభం!వ్యాఖ్యలు రాయడమంటే విసిరినా పిండిమీద గీతాలు గీయడం!వ్యాఖ్యకారుడికంటే టపాకారుడే గొప్ప!టపారాయటం కొందరు పదవీవిరమణ చేసిన పెద్దలకు ఒక timepass!రోజంతా ఖాళీగా ఉండి తోచిచావక ఇదొక వ్యాపకంగా పెట్టుకుంటారు!ఇలా మూడు టపాలు ఆరు వ్యాఖ్యలుగా అంతర్జాలం వర్ధిల్లుతోంది!

  ReplyDelete
 3. మాటర్ తక్కువ స్పేస్ ఎక్కువ! అది స్రుష్టి రహస్యం యొక్క నగ్న చిత్రం నాయనా!. అంత గొప్పగా కనపడే మనిషిలో కూడ అణువుల మద్య ఖాళీ అంతా తీసేస్తే , ఆ పధార్థ మానవుడిని చూడటానికి మైక్రోస్కోప్ ఉపయోగించాలట! మనం తినే తిండిలో కూడ మీరు చెప్పే సూత్రం ఉంది. మన జీర్ణ వ్యవస్త సరిగా పనిచేయాలంటే వక వంతు శక్తి నిచ్చే తిండిని,మూడు వంతులు దానిని అరగదీయడానికి ఉపయోగపడే పీచును తినాలి మనోహర్ గారు.

  ReplyDelete