Monday 27 May 2013

సినిమా తీద్దాం రండి!

ఫిల్మ్ మేకింగ్‌లో సాంకేతికంగా ఎన్నో మార్పులు వచ్చాయి. ఇప్పుడు అసలు ఫిల్మ్ (నెగెటివ్) అనేది లేకుండానే ఫిల్మ్ తీయవచ్చు! అంతా డిజిటల్‌మయమైపోయింది.

ఒకటి రెండేళ్ల క్రితం వరకూ, సినిమా తీయడానికి కోట్లరూపాయల విలువైన కెమెరాలు ఉపయోగించేవారు. ఇప్పుడా కెమెరాలకు పూర్తిగా కాలం చెల్లింది. కేవలం లక్షన్నర రూపాయల కెమెరాతో కూడా ఇప్పుడు ఒక మంచి క్వాలిటీ సినిమా తీయవచ్చు.

అటు అంతర్జాతీయంగా, ఇక్కడ టాలీవుడ్‌లోనూ రికార్డులు సృష్టిస్తున్న కెనాన్ 5 డి కెమెరాలు కూడా చూస్తుండగానే అవుట్‌డేట్ అయిపోనున్నాయి. 5 డి కెమెరా ధరలో సుమారు సగం ధరకే మరింత మంచి క్వాలిటీ సినిమాను షూట్ చేయగలిగే కెమెరాలు మార్కెట్లోకి రావటానికి ఆల్రెడీ లైన్లో ఉన్నాయి!

కట్ టూ స్టూడియోస్ అండ్ ల్యాబ్స్ -

ఈ బ్లాగ్‌లోనే ఇంతకుముందు నేను దీని గురించి రాశాను. బహుశా అది - సింగిల్ బెడ్రూమ్ సినీ స్టూడియో! ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.. అతిశయోక్తి కూడా కాదు. కేవలం ఒక్కటంటే ఒక్క అడ్వాన్స్‌డ్ కంప్యూటర్ సిస్టమ్ ఇంట్లోనో, ఆఫీస్‌లోనో ఉంటే చాలు. అదే మన సినీ స్టూడియో అవుతుంది!

ఆ ఒక్క సిస్టమ్‌తోనే రికార్డింగ్, ఎడిటింగ్, డబ్బింగ్, రీరికార్డింగ్, ఎఫెక్‌ట్స్ ఎట్సెట్రా హాయిగా చేసుకోవచ్చు.

ఇదంతా నేనేదో ఊహించి చెప్పటం కాదు. హాలీవుడ్‌లో ఎందరో దీన్ని ప్రాక్టికల్‌గా చేసి చూపించారు. ఇంకా చెప్పాలంటే - "వన్ మ్యాన్ ఫిల్మ్ మేకింగ్" అనేది ఇప్పుడు హాలీవుడ్‌లో, ఇతర పాశ్చాత్య దేశాల "వుడ్స్"లో ఒక ప్యాషన్! సినిమాను ప్రాణంగా ప్రేమించే వందలాది ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్ ఇప్పుడు ఇదే సిస్టమ్‌ను ఫాలో అవుతున్నారు. పైగా, అన్ని ప్రముఖ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లోనూ వీరికే ఎక్కువ అవార్డులు రివార్డులు దక్కుతున్నాయి. ఇక్కడ నేను చెప్తున్నది "ఆర్ట్" సినిమాల గురించి కాదు. కమర్షియల్ సినిమాలు. ఇది గమనించాల్సిన విషయం!        

కట్ టూ మన మెయిన్ టాపిక్ -

మారుతి "ఈ రోజుల్లో" పూర్తిగా కొత్తవాళ్లతో తీశారు. ఈ సినిమాలో ఎం ఎస్ నారాయణ వేసిన ఆ అతి చిన్న పాత్ర అంతగా లెక్కలోకి రాదు. శాటిలైట్ రైట్స్ దృష్టితో ఈ ఒక్క విషయంలో మనవాళ్లు కాంప్రమైజ్ అయినట్టున్నారు. లేకపోతే, ఆపాత్రలో కూడా కొత్తవారే ఉండేవారన్నది నా ఉద్దేశ్యం. అలాగే, "ఒక రోమాంటిక్ క్రైమ్ కథ", "బస్టాప్",
"3 జి లవ్" సినిమాల్లో కూడా అంతా కొత్తవారే!

ఈ సినిమాలన్నీ ఇటీవలి కాలంలో అత్యంత తక్కువ బడ్జెట్లో తీసిన సినిమాలు. కలెక్షన్ల రికార్డులు బద్దలు కొట్టిన చిన్న సినిమాలు! వీటిని తీయడానికి అయిన ఖర్చు.. ఒక రొటీన్ తెలుగు సినిమాలో ఒక పాట చిత్రీకరణకు కూడా సరిపోదంటే అతిశయోక్తికాదు.

మొన్నటి వరకూ పూర్తిగా కొత్తవాళ్లతోనే ఒక చిన్న సినిమా తీయాలన్నా కనీసం కోటి రూపాయలు అవసరం అయ్యేది. కాన్సెప్టు, సెటప్పుని బట్టి, ఇప్పుడు అదే బడ్జెట్లో రెండు లేదా మూడు సినిమాలు తీయవచ్చు. అంటే, 30 నుంచి 50 లక్షల రేంజ్‌లో, కొత్తవాళ్లతో, ఇప్పుడొక మంచి యూత్ సినిమా తీయొచ్చు!

ఇటీవల నేను ప్రారంభించిన కొత్త ప్రాజెక్టు (మైక్రోబడ్జెట్ సినిమాల సీరీస్) ఈ నేపథ్యంలో ప్రారంభించిందే. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న "యురేకా సకమిక" ఈ సీరీస్‌లో మొదటి సినిమా.

సినీ ఫీల్డు పట్ల అమితమైన ఆసక్తి ఉన్నప్పటికీ - భారీ బడ్జెట్లకు భయపడి ఆగిపోయిన ఔత్సాహిక కొత్త నిర్మాతలకు నిజంగా ఇదొక  మంచి అవకాశం. కొత్త వాళ్లతో తీసే యూత్ సినిమాలకు ఇపుడు మంచి మార్కెట్ ఉంది. ఒక మంచి కాన్సెప్టుతో, కొత్తదనమైన ప్రజెంటేషన్‌తో వెళితే ఎలాంటి రిస్కూ ఉండదు.

లేటెస్ట్ టెక్నాలజీపైన అవగాహన, దాన్ని ఉపయోగించి ఫిల్మ్ తీయగల సామర్థ్యం, హీరోలతోనూ, కొత్తవాళ్లతోనూ సినిమాలు చేసి రిలీజ్ చేసిన అనుభవం ఉన్న నాలాంటి ఫిల్మ్ మేకర్స్ సహాయంతో-లేదా-వారి కొలాబరేషన్‌తో, హాయిగా రంగంలోకి దిగిపోవచ్చు. (My direct email: mchimmani@gmail.com)

తక్కువలో తక్కువ, ఒక యావరేజ్ హిట్ ఇచ్చినా కోట్ల వర్షం కురుస్తుంది. ఒక వేళ "ఫట్" అయినా మైక్రో బడ్జెట్ కాబట్టి పెద్ద రిస్క్ ఉండదు. మీరు పెట్టినంతవరకు మీ పెట్టుబడి మీకు సేఫ్‌గా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దాదాపు జీరో రిస్క్!

కొన్ని నిర్ణయాలు తీసుకోడానికి గట్స్ ఉండాలి. ఫీల్డు పట్ల ఆసక్తి, ప్యాషన్ ఉన్నవారికి ఆ గట్స్ ఎలాగూ ఉంటాయన్నది నా వ్యక్తిగత అనుభవం.

సో, సీ యూ ఆన్ ది సెట్స్!    

4 comments:

 1. సాంకేతికత వేగ వేగముగా అనూహ్యముగా మారిపోతున్న నేటికాలంలో కొత్తవాల్లనుంచే గొప్ప సినిమాలు,కళను కలనూ వాణిజ్యాన్నీ కలగలిపి వచ్చే అవకాశం ఉంది!అనుభ వజ్నులయిన చిమ్మని లాంటివారు సినిమాస్క్రిప్ట్ ను పకడ్బందీగా రూపొందించుకొని అన్నికోణాలనుంచి సరిచూసి సంసిద్ధముగా పెట్టుకుంటే అందిపుచ్చుకొని ముందుకురికేవారు రాకపోరు!తెలుగుదేశం ఔత్సాహిక నిర్మాతలకు గొడ్డుపోలేదు!అయితే పాత కథానాయకుల నాయికల జోలికి ఎంతమాత్రం పోకుండా నవతరంగపు ప్రతిభాపాటవాలను ఉపయోగించుకుని మెరిసేట్లు మెరుగుపరచి సానపెట్టి రతనాలుగా తీర్చి దిద్దుకోవచ్చు!అయితే అందుకు చాల సహనం కావాలి!ఓర్పు ఉందా?సమయం వెచ్చించాలి సమయం ఉందా?

  ReplyDelete
  Replies
  1. Thanks for your comment, Surya Prakash garu. మీరు అడిగిన సహనం, ఓర్పు, సమయం.. నా దగ్గర పుష్కలంగా ఉన్నాయి. లేకపోయినా క్రియేట్ చేసుకుంటాను. సినిమా నాకిష్టం కాబట్టి. జస్ట్ లైక్‌మైండెడ్ ఇన్వెస్టర్స్ కోసమే నా అన్వేషణ. :)

   Delete
 2. సినిమా అంటే పడిచచ్చేవారు చాలామంది కనపడుతున్నారు మీ ప్రాజెక్ట్ నచ్చితే ఇన్వెస్ట్ చేసేవారు ముందుకు రావచ్చు లేదా పదిమంది కలసి తలా ఒక చేయి వేసేవాళ్ళు ముందుకు రావచ్చు ఏమో గుఱ్ఱం ఎగరావచ్చు!నేనీరోజు USA వెళ్తున్నాను 6 నేలలలోపున వస్తాను ఏమో నేనొచ్చే లోగానే మీ సినిమా విడుదలయ్యి విజయవంతం కానూ వచ్చు నేను ఆశావాదిని LET US హోప్ ది BEST !

  ReplyDelete
  Replies
  1. As you said, Crowd Funding is the best option and it's in vogue in US and other developed countries. In India, it's not that popular. Happy journey and thanks for all your comments and best wishes, Surya Prakash ji..

   Delete