Saturday 2 February 2013

"బ్యాన్" తెర వెనుక


చివరికి "ఎలాగో" విశ్వరూపం తమిళనాడులో విడుదల కాబోతోంది...

అసలు కారణం ఇప్పుడు మరింత క్లారిటీతో బయటకు అదే వచ్చింది. అందరికీ బాగా అర్థమైంది. దేశం గర్వించదగ్గ ఒక గొప్ప కళాకారున్ని వేధించి వేటాడే వ్యవస్థకు చేతులెత్తి ఒక నమస్కారం పెట్టడం తప్ప మరేం చెయ్యలేని దశలో ఉన్నందుకు చింతించాలో, సిగ్గుపడాలో అర్థం కావటం లేదు.

ఈ మొత్తం ఎపిసోడ్ మీద... సాక్షాత్తూ కేంద్ర ఫిలిం సెన్సార్ బోర్డ్ చైర్ పర్సన్, లీలా శాంసన్ ఇలా అన్నారు: " మేం కొన్ని వందల వేల సినిమాలకు సర్టిఫికేట్లిస్తున్నాం. విశ్వరూపం సినిమాలో అభ్యంతరకరమయినవి ఏమున్నాయో అర్థం కావటం లేదు. ఇది ఒక రకంగా కళాకారుడ్ని వేటాడటమే. వేధించటమే. పరిస్థితి ఇలా వుంటే, ఇంక భావ ప్రకటన స్వేఛ్ఛకు అర్థమేముంది?" ... ఇంతకన్నా ఏం కావాలి?    

కట్ చేస్తే -

దేశం, ప్రపంచం ఇంత పెద్ద ఎత్తున స్పందిస్తున్న ఈ విషయం పైన మన టాలీవుడ్ హీరోలనుంచి కనీస స్పందన లేకపోవటం చాలా ఆశ్చర్యకరంగా ఉంది! రేపు ఇలాంటి పరిస్థితి మన వాళ్లకూ రాదని గ్యారంటీ ఉందా? ఒక ఫేస్‌బుక్ మిత్రుడు "తెలుగు హీరోలు లేవరా?!" అనే క్యాప్షన్ తో ఇదే విషయం లేవనెత్తాడు. మరి మన హీరోలు ఎందుకు లేవరో/లేవలేదో వాళ్లకే తెలియాలి.


1 comment:

  1. హీరోలు సరే
    భావప్రకటన స్వేచ్చ లగూర్చి ఉపన్యాసాలతో దుమ్ముదులిపే మన మేతావు లంతా ఎక్కడ కూర్చుని మేధో మథనం సాగిస్తున్నారో ?????

    ReplyDelete