Friday 4 January 2013

"స్పిరిచువాలిటీ" అర్థం మారిపోయిందా?

స్పిరిచువల్ గురు 'ఓషో' రజనీష్ రచనలంటే నాకు చాలా ఇష్టం. అంతదాకా ఎందుకు ... అసలు "ఓషో" అన్న పదంలో ఉన్న నవ్యత్వం, అందం, ఆకర్షణ మరే ఆధ్యాత్మిక 'స్కూలు' కు చెందిన పదంలోనూ నాకు కనిపించలేదు.

అలాంటి ఓషో సృష్టికర్త రజనీష్ గురించి, నా చిన్నతనంలో 'ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ' లో ఎన్నోసార్లు చదివాను. అదే రజనీష్ గురించి, ఆయన చివరి రోజుల్లో కొన్ని నెగెటివ్ వార్తల్ని కూడా చదివాను.

ఇండియా లోనూ, ఫారిన్ లోనూ రజనీష్ కు ఉన్న రోల్స్ రాయిస్ కార్ల సంఖ్య అప్పట్లో నన్ను దిగ్భ్రాంతికి గురి చేసింది. అది అలా ఉంటే - రజనీష్ పూనే ఆశ్రమంలోనూ, ఫారిన్లోని మరికొన్ని ఆశ్రమాల్లోనూ ఓషో ఆధ్యాత్మిక భక్తుల 'ఫ్రీ సెక్స్' జీవన శైలి గురించి కూడా చదివేటప్పటికి వయస్సులో నిజంగా కొంచెం షాక్, షేక్ కూడా అయిపోయాన్నేను!

కట్ చేస్తే -

మళ్లీ  మధ్య ... ఒక అందమయిన సినీ నటితో స్వామి నిత్యానంద కామ క్రీడల లీలల్ని 'యూ ట్యూబ్' లో చూసాక దిమ్మ తిరిగిపోయింది! అయితే - పాయింట్లు పెంచుకోడానికి, న్యూస్ నే పదే పదే 'బ్రేకింగ్ న్యూస్' గా వేస్తూ మన దేశపు టీవీ చానెళ్లు చూపిన అమితాసక్తి మాత్రం బాగా చిరాకు పుట్టించింది

టీవీ చానెళ్ల బ్రేకింగ్ న్యూస్ లలో 10% పాజిటివ్ వార్తలుటే, 90% నెగెటివ్ వార్తలుంటాయి! నిజానికి, రెండు రకాల న్యూస్ లో దేన్ని హైలైట్ చేయాలన్నది కామన్ సెన్స్. కామన్ సైన్స్కానీ, ఇవేవీ చానెల్స్ కు అవసరం లేదువారికి కావల్సింది ఒక్కటే... పాయింట్స్/రేటింగ్!

కట్ టూ లాస్ట్ వీక్ -

ప్రపంచం నలుమూలల నుంచీ లక్షలాది మంది "ధ్యాన ప్రియులు" (!) మొన్న మన మహబూబ్ నగర్ జిల్లా లోని కడ్తాల్ లో ధ్యానం చెయ్యడానికి సమావేశమయ్యారు. ఇక్కడివరకూ బాగానే ఉంది. కానీ, తర్వాతే - పేపర్లలో, టీవీల్లో మళ్లీ బ్రేకింగ్ న్యూస్ లు!

"పిరమిడ్ ధ్యానం" ను పాప్యులర్ చేసిన బ్రహ్మర్షి (!) పత్రీజీ నేపథ్యం, లీలలు, అదీ ఇదీ …

స్త్రీల మీద, అమ్మాయిల మీద చేయి వేయకుండా, వాలిపోకుండా పత్రీజీ బహుశా నిల్చోలేరు, కూర్చోలేరు, పడుకోలేరులా ఉంది. అలా ఉన్నాయి ఫోటోలు, వార్తలు, బ్రేకింగ్ న్యూస్ లు!! 

నేను కర్నూలు ఆలిండియా రేడియో లో పని చేస్తున్నపుడు - అక్కడ కర్నూలు లో మొదటిసారి పత్రీజీని చూశాను. కలిశాను. ఒకసారి ఆయన 'మౌన దీక్ష' లో ఉన్నపుడు విషయం మర్చిపోయి మాట్లాడేశారు. "అదేంటి... మీరు మౌన దీక్షలో ఉన్నారు కదా?!" అని మా అనౌన్సర్ శాస్త్రి ఆయన్ని అడిగాడు చాలా అమాయకంగా. "నువ్వు గమ్మునుండు... ఇదంతా మామూలే!" అన్నట్టుగా చాలా క్యాజువల్ గా, మళ్లీ తన మౌన భాషలోనే మా వైపు చూస్తూ ఒక ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు పత్రీజీ.

అప్పుడు అవాక్కయిపోయిన మా అనౌన్సర్ మిత్రుడు శాస్త్రి, తర్వాత కూడా నాతో విషయం పదే పదే ఎన్నోసార్లు చర్చించడం నాకింకా గుర్తుంది. స్పిరిచువాలిటీ కదా ... అంత సులభంగా మర్చిపోలేం

ఫినిషింగ్ టచ్ ఏంటంటే -

కర్నూలు లోని పిరమిడ్ ధ్యాన కేంద్రానికి అప్పుడు ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ ఒకసారి వచ్చారు. బహుశా పత్రీజీ ఆహ్వానించి ఉంటారు ఆయన్ని. సందర్భంలోనే - యండమూరిని మా ఆలిండియా రేడియోకి పిల్చి - శాస్త్రీ, నేనూ ఇంటర్వ్యూ చేసిన విషయం నాకింకా గుర్తుంది. యండమూరిని  మేం ఇంటర్వ్యూ చేసిన టేపు బహుశా ఇంకా మా ఆలిండియా రేడియో లైబ్రరీలో ఉండే ఉంటుంది.

అసలు విషయం ఏంటంటే - అప్పుడు యండమూరికి పత్రీజీ, ఆయన ధ్యాన కేంద్రం నచ్చలేదన్న విషయం నాకు మొన్ననే టీవీ ద్వారా తెలిసింది! "ఆనందో బ్రహ్మ" లాంటి అద్భుత నవలలు రాసిన యండమూరి బహుశా అప్పుడే, ఒక్క క్షణంలో - మన బ్రహ్మర్షి గారినీ, వారి ధ్యాన కేంద్రాన్నీ, అక్కడి  కార్యకలాపాల్నీ ‘ఎక్స్ రేతీసుంటారు

ఇప్పుడు నాకో ధర్మ సందేహం కలుగుతోంది. అసలీ ధోరణులన్నింటికీ మూలమయినఆధ్యాత్మికత’ (అదే, స్పిరిచువాలిటీ!) అంటే ఇంక "ఇదేనా"? ఇంకేదయినా నాకు తెలియనిది ఉందా?!

ఒక వేళ వేరొక అర్థం అంటూ ఉంటే - మరి ఎప్పుడూ స్వామీజీలు, బాబాలు, దేశ విదేశాల్లో వీరి ఖరీదయిన ఆశ్రమాలు, వీరి లెక్కలేనన్ని ఆస్తులు, అందమయిన ఆధ్యాత్మిక ఆడ భక్తులు, వారితో శృంగార లీలలు ... ఇవే ఎందుకు ఎప్పుడూ వార్తల్లో దర్శనమిస్తుంటాయి?  

మన ది గ్రేట్ 'పౌరాణిక స్పిరిచువల్ గురు' విశ్వామిత్రుడు కూడా సెక్సీ మేనకను చూశాక తపస్సు, గిపస్సు జాన్తానై అని రొమాన్స్ లోకి దిగిపోయిన ఎపిసోడ్ కూడా చిన్నప్పుడు చదివాను. మన పురాణాలు, ఇతిహాసాల్లోని ఇలాంటి ఎన్నో ఎపిసోడ్లు ఇప్పుడు నాకు ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి. అంటే - అప్పుడూ ఇప్పుడూ, స్పిరిచువాలిటీ అంటే ఇంక ఇదేనా? నేను పొరపడ్డానా?? కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంది. క్లారిటీ వచ్చాక, ఇంకోసారి ఇదే టాపిక్తో కలుద్దాం..

మై గాడ్! మర్చేపోయాను. నా "మెడిటేషన్" టైమయింది... ఇప్పటికి శెలవ్

3 comments:

 1. ఈ మధ్య మీరు రాసిన ఒక పోస్ట్ చూసి ఒక నాలుగు పేజీల ప్రతిస్పందన రాసుకున్నాను. రెండు మూడు రోజుల క్రితం మిమ్మల్ని కలిసినప్పుడు కూడా అది నా జేబులోనే ఉంది. ఐతే అందులో రాసుకున్నట్టు గానే నా పై మీ అభిప్రాయం ఎక్కడ మారిపోతుందోనని ఆగిపోయాను. ఆ తర్వాత హైద్రాబాద్ టైమ్స్ లో కొంత అలాంటి అభిప్రాయమే ఎవరో రాసారు. సరే మీరు చదివే ఉంటారనుకున్నాను. ఐతే ఈ పోస్ట్ చూసినప్పుడు కొంత మళ్ళీ అలజడి. కూర్చుని రాయడం మొదలు పెడితే ఆగదేమో అనిపించింది. అందుకే సింపుల్ గా ముగిస్తాను. ఎక్కువ రాయాలంటే ఓపిక కావాలి మరి...!! నేనా మహా బద్దకస్తుడ్ని .. !!! వైద్యుడు తప్పు చేస్తే డాక్టర్లంటే "ఇంతేనా" అంటాం కానీ వైద్యం అంటే "ఇదేనా" అని అనం.వివేకానంద చెప్పినట్టు పదహారు సంవత్సరాలు చదివిన ఒక మెకానికల్ ఇంజనీరు తన బైకు బాగు చేసుకోలేడు కానీ ఒక బైకు గ్యారేజి లో చిన్న పిల్లాడు బైకు తీసుకెళ్ళగానే దానిని స్టార్ట్ చేసి లోపం తో పాటు ఏం చేయాలో ఎంతవుతుందో చెప్పేస్తాడు. సాధన శక్తి అది.ఆద్యాత్మికమైనా, మరేదైనా..!!!???

  ReplyDelete

 2. డియర్ కృష్ణా, ఒక బ్లాగ్ రీడర్ గా నీ కామెంట్ ని స్వేఛ్ఛగా రాయవచ్చు. అదే నాకు కావల్సింది కూడా!. మన గురుశిష్య సంబంధం నీ భావ స్వేఛ్ఛకు ప్రతిబంధకం కాకూడదు. గో ఎహెడ్! నీ 4 పేజీల ప్రతిస్పందన కోసం ఎదురుచూస్తుంటాను...

  ఇక తర్వాతి పాయింట్ కు వస్తున్నాను... ఈ పోస్టులో "స్పిరిచువాలిటీ" అనేది ఒక "బిగ్ బిజినెస్" గా మారిపోయి, దాని విలువ ఇలా పడిపోయిందేమిటా అన్న దృక్పథంలో ఒక సెటైర్ గా రాశాను. అంతే తప్ప ఆధ్యాత్మికతకు అర్థం తెలియక కాదు.. దాని మీద అయిష్టతతోకాదు.

  మరో విషయం ఏంటంటే - బ్లాగ్‌లో నీ ప్రతిస్పందనలను బట్టి నీ మీద నా అభిప్రాయాన్ని మార్చుకోవటం జరగదు. దృక్పథాలు తూర్పు పడమరలుగా ఉండే ప్రాణ స్నేహితులు, గురుశిష్యులు ఎంతమంది లేరు? :)

  ఇక, నువ్వు కోట్ చేసిన వివేకానంద కొటేషన్‌కీ, ఈ టాపిక్‌కీ నాకు నిజంగా లింక్ దొరకలేదు. :(

  ReplyDelete
 3. ఏమిటో, మరి!

  న్యూస్ పేపర్లు చదివి 'స్పిరిట్ ' ల గురించి అంటే, వేరే స్పిరిట్ అనుకున్నా!

  ఉన్నది ఇద్దరు ఒక ఆడ ఒక మగ. మరి ఇక ఆకర్షణ వారి మధ్య ఉంటేనే కదా 'స్పిరిట్' మరి ?

  స్పోర్టివ్ స్పిరిట్ అంటారే అంటే ఏమిటి ?


  జిలేబి.

  ReplyDelete