Wednesday 2 January 2013

లోన్ వుల్ఫ్

నేను పూర్తిగా సినిమా మనిషిని కాదు. బ్లాగ్ లోని కొన్ని పోస్టులు చదివితే విషయం మీకు ఇట్టే తెల్సిపోతుంది. ఏదో బై మిస్టేక్ ఇటుగా వచ్చాను. వచ్చినందుకు ఇరుక్కుపోయాను. కారణాలు ఏవయితేనేం - నేను అనుకున్నది చేయలేకపోయాను ఇక్కడ.

మొట్టమొదటిసారిగా - ఎవరి హామీల మీదా నమ్మకం పెట్టుకోకుండా, పూర్తిగా, అన్ని బాధ్యతలు నేనే తీసుకుని - ఒక మైక్రో బడ్జెట్ సినిమా చేయబోతున్నాను. "అంతా ఓకే... ఆల్ హాప్పీస్ " అనుకుంటున్న సమయంలో చిన్న జెర్క్ ఒకటి మొన్న(31 నాడు) ఫోన్ రూపంలో! నో ప్రాబ్లమ్. రెండు రోజుల తర్వాత ఫేస్ చేయబోతున్నాను.

ఇంకా చెప్పాలంటే, చిన్న చిన్న జెర్కులు ఏవీ నన్నూ, నా ఇప్పటి కమిట్ మెంట్ ను ఆపలేవు. నాకు తెలుసు విషయం.

నేను ముందే ఇంకో బ్లాగ్ పోస్ట్ లో చెప్పినట్టు - సీరీస్ లో మొదటి సినిమా షూటింగ్ ప్రారంభమయిన రోజునుంచి
సరిగ్గా 9 నెలల్లో 3 మైక్రో బడ్జెట్ సినిమాలు పూర్తి చేయబోతున్నాను నేను. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు.

మొదటి సినిమాకు మాత్రం సమయం తీసుకోవటం నాకు చాలా అవసరం. ఇదివరకులాగా ప్రతిదానికీ కాంప్రమైజ్ కాదల్చుకోలేదు. పైగా, "లోన్ వుల్ఫ్" లా అన్నీ నేనే చూసుకుంటున్నాను. నాకు ఇన్వెస్ట్ చేసే వాళ్లని కూడా చాలా జాగ్రత్తగా ఎన్నుకుంటున్నాను. అనుభవం తో నా  "మనుటైమ్ మూవీ మిషన్" ఫిలిం బ్యానర్ కింద రేపు నేనే ఒక ఫాక్టరీ ప్రారంభించవచ్చు. ఒక డిజిటల్ స్టూడియో పెట్టవచ్చు.   ఏదీ రాకెట్ సైన్స్ కాదు. ఏదీ అసాధ్యం కాదు. నేను చేయగలను

జెర్కులు ఎదురయినా, ఏవి అడ్డం వచ్చినా ఒక్క సినిమాకే. తర్వాతంతా "రిన్స్ అండ్ రిపీట్" పధ్ధతే.


2 comments: