Friday 11 January 2013

నిజమైన భక్తులు మన్నించాలి!


పైన టైటిల్ పెట్టకపోతే - బ్లాగ్ పోస్ట్ చదివాక, సిన్సియర్గా అయ్యప్పను కొలిచే భక్తులు నన్ను బాగా తిట్టుకునే ప్రమాదముంది. సో, వారి నిజమయిన భక్తిని గౌరవిస్తూ, ముందే వారికి మాట చెప్పేస్తూ - ఇక టాపిక్లోకి వస్తున్నా .. 

నేను చూసిన ప్రపంచం, నాకు తెలిసిన ప్రపంచం చాలా తక్కువ కావొచ్చు. కానీ, కొంచెం లోనే నన్ను తీవ్రంగా డిస్టర్బ్ చేసిన అంశాలు వందలకొద్దీ ఉన్నాయి. వాటిలో ఒకటి - అయ్యప్ప మాల.

శబరిమలలో - ప్రత్యేకమైన రోజున - దూరంగా కొండ మీద జ్యోతి కనిపించడం వెనకున్నది అయ్యప్ప మహిమా లేక మరొక మానవ క్రీడా అన్నది నేనిక్కడ చర్చించబోవటం లేదుఎదుటివారి నమ్మకం ఒక పాజిటివ్ రిజల్ట్కు, ఒక మంచి జీవన శైలికి తోడ్పడుతుందంటే, నమ్మకాన్ని బేషరతుగా నేను గౌరవిస్తాను. అలా అందరూ గౌరవించాలని కూడా కోరుకుంటాను. ఇంక దాని వెనకున్న, లాజిక్కులు, జిమ్మిక్కుల గురించి తవ్వకాలు జరపాల్సిన అవసరం లేదు.

తెల్లవారు జామునే చన్నీళ్లతో స్నానం చేస్తూ, నల్ల దుస్తులు (లేదా మరో రంగు దుస్తులు) వేసుకుని, కాళ్లకు చెప్పుల్లేకుండా, వేరుగా వంట చేసుకుని తింటూ, బ్రహ్మచర్యం పాటిస్తూ, మరే ఇతర దురలవాట్ల గురించి ఆలోచించకుండా, రోజుకి కనీసం రెండు సార్లు గుడికో, భజనకో వెళ్తూ .. సుమారు 40 రోజులపాటు కఠోరమైన క్రమశిక్షణతో అయ్యప్ప మాల వేసుకొని దీక్షలో ఉండటం అనేది నా దృష్టిలో చాలా గొప్ప విషయం.

ఎందుకు గొప్ప విషయమంటే - కనీసం 40 రోజులయినా వారు అబధ్ధమాడకుండా - ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ  ఎదుటి వాడిని మోసం చేయకుండా, దోచుకోకుండా, దురాలోచనలు చేయకుండా, న్యాయంగా, ధర్మంగా, సంపూర్ణ మానవత్వంతో స్వఛ్ఛంగా ఉండటం అనేది వారికి మాత్రమే దొరికే అదృష్టం. అదృష్టం అందరికీ దొరకదు. అందుకే ఇది చాలా గొప్ప విషయం.

సగటు మనిషి నిత్య జీవితం లోని వృత్తి వ్యవహారాల్లో ఇది చాలా మందికి, చాలా వరకు సాధ్యం కాని విషయం

 ఇంతవరకూ ఓకే. ఇక్కడ కట్ చేస్తే -

నాకు
తెలిసిన కొందరు భక్తులు ప్రతి యేటా అయ్యప్ప మాల వేస్తారు. వీరిలో కొందరు - కనీసం మాల వేసుకున్న కొద్దిరోజులయినా "మందు" మానేయవచ్చుననే ఉద్దేశ్యంతో వేసుకుంటారు. "జ్యోతి"ని దర్శించి - శబరిమల నుంచి అలా తిరిగి వస్తారో లేదో ... మళ్లీ త్రాగుడు షురూ!

అన్ని రోజుల 'బ్యాక్‌లాగ్‌'ని ఒక్క వారంలో బ్యాలెన్స్ చేసేస్తారు! ఇది నిజం. ఎంత నిజం అంటే - ఆయా వ్యక్తులతో (భక్తులతో) సంవత్సరాలుగా ఇదే టాపిక్ పైన నేను ఇంకా చర్చిస్తూనేవున్నంత నిజం!!  

ఇది
ఇలా ఉంటే - ఒక అగ్ర దర్శకుని ఆఫీసు కాంపౌండులో అయ్యప్ప మాల వేసుకున్న మేనేజర్ గబుక్కున ఒక మూలకెళ్లి సిగరెట్ తాగేస్తుంటాడు. షాకయిపోయి "అదేంటి, మీరు మాల వేసుకుని ఉన్నారు కదా!?" అని అమాయకంగా మనం అడిగితే - "పోండి సార్! అన్నీ ఎలా వీలవుతాయ్? ప్రతి నియమానికీ కొన్ని రిలాక్సేషన్స్ ఉంటాయి" అంటాడు!

అదే కాంపౌండులో - మాల వేసుకున్న తండ్రీ కొడుకులిద్దరూ పేకాట టీమ్లో ఎదురెదురుగా కూర్చుని పేకాడుతుంటారు! ఏదో టైంపాస్ కి కూడా కాదు... డబ్బులు పెట్టే!!

ఇంకో అయ్యప్ప భక్తుడు, ఇంకో మూలన, ఒక లేడీ ఆర్టిస్టుతో రొమాన్స్ విషయాలు మాట్లాడుతుంటాడు!

" సినిమా వాళ్లు అంతా ఇంతే" అనుకోవచ్చు. కానీ, ఇవి మాత్రమే కాదు. ఇంతకుమించినవి ఎన్నిటినో, ఇతర ఫీల్డుల్లోని అయ్యప్ప భక్తుల్లో కూడా చూసి ఎన్నోసార్లు డిస్టర్బ్ అయ్యాన్నేనుఒకసారి "గూగుల్" కు వెళ్లండి. "Ayyappa Mala" అని టైప్ చేసి, పైన ఇమేజెస్ మీద క్లిక్ చేయండి. మీకు కనిపించే వందలాది అయ్యప్ప వీర భక్తుల్ని చూసి మీరే అశ్చర్యపోతారు.

ఇలాంటి మీది మీది భక్తులంతా కూడా - మాల వేసినన్ని రోజులూ - నోరు తెరిస్తే చాలు .. "స్వామి శరణం!" అంటుంటారు - చాలా విచిత్రంగా, అసహజంగానా బాధల్లా ఒక్కటే. వీరి వీరి స్వప్రయోజనాల కోసం, కేవలం ఒక "మాస్క్" గా వాడుకోవటం కోసం ఒక క్రమ శిక్షణకు తోడ్పడే అయ్యప్ప దీక్షకు అనవసరంగా చెడ్డ పేరు తేవడం ఎందుకూ అని...

స్వామి శరణం!!!

4 comments:

 1. వినాశకాలే విపరీత బుధ్ధి అన్నారు. వీల్లు మాలవేసుకోకున్నా అలాంటిపనులేచెస్తారు. మనం మాలధారనతో పవిత్రంగా గడిపేవారిగూర్చి ఆలోచిద్దాం

  ReplyDelete
 2. నేను ఓసారి వేరే పని మీద కొట్టాయం వెళ్ళాను అయ్యప్పల సీజన్ లో..!నాకు కొన్ని వందల మంది మాల వేసుకున్న భక్తులు కనిపిస్తే దాంట్లో తమిళులు,మళయాళీలు పట్టుమని పదిమంది కూడా లేరు.ఒంటరిగా వేరే ప్రదేశాలు వెళ్ళలేని వారు,లేదా చూసివద్దాం ఆటవిడుపు కి అనుకునేవారు... ఫ్రెండ్స్ తో కలిసి అలా వెడదాం అనుకునే వారే మనదగ్గర ఈ మాల ఎక్కువగా వేసుకొంటున్నారనిపించిది.నిజమైన భక్తులు ఒకటి లేదా రెండు శాతం వుండవచ్చునేమో..!!!

  ReplyDelete
  Replies
  1. మీతో ఏకీభవిస్తున్నాను.

   Delete