Tuesday 4 December 2012

"పాలపిట్ట" చూశారా?

ఇదొక సాహిత్య పత్రిక. సాంస్కృతిక పత్రిక కూడా. నా యూనివర్సిటీ మిత్రుడు, ప్రముఖ విమర్శకుడు, పబ్లిషర్ గుడిపాటి పత్రిక యజమాని, ఎడిటర్ కూడా.

టీవీ చానెల్స్ వచ్చాక చాలా పాప్యులర్ మేగజైన్స్ సర్క్యులేషన్స్ కూడా చాలా దారుణంగా పడిపోయాయి. అలాంటి పరిస్తితుల్లో - ఒక సాహితీ సాంస్కృతిక పత్రిక పెట్టి, విజయవంతంగా నడపటం అంత సింపుల్ విషయమేం కాదు. గుడిపాటి మాత్రం చాలా సింపుల్ గా పని చేయగలుగుతున్నాడు. దట్ ఈజ్ మై ఫ్రెండ్ గుడిపాటి!

సొంత
డబ్బా అనుకోకపోతే, గుడిపాటి పత్రిక పెట్టే విషయంలో బహుశా అతన్ని ఎక్కువగా ప్రోత్సహించి ముందుకు తోసింది నేనే అంటే నాకు నిజంగా గర్వంగా ఉంటుంది. విషయంలో మా ఇద్దరి మధ్యలో ఎన్నెన్ని సార్లు చర్చలు జరిగాయో, మేం ఇద్దరం ఎన్ని సార్లు చర్చల గురించి యాత్రి నివాస్ లో కలిశామో మాకు మాత్రమే తెలుసు.

గుడిపాటి ఇప్పుడు ఎంత కష్టపడుతున్నా, నా దృష్టిలో అదంతా కేవలం అతను చేయగలిగిన దాంట్లో కేవలం ఒక 10 శాతం మాత్రమే! ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. కొన్ని నెలల్లో ఇదే పాలపిట్ట పత్రిక ఒక సంచలనాత్మకమైన పాప్యులారిటీకి తెర తీయబోతోంది. రోజు కోసం - ముందే అంతా తెలిసిన నేనూ కూడా ఎదురు చూస్తున్నాను!

త్వరలో పాలపిట్టలో నా రెగ్యులర్ కాలం "సృజనాత్మకమ్" ప్రారంభం కాబోతోంది. అలాగే - మార్కెట్లో డిమాండ్ ఉన్నప్పటికీ, ఎప్పటినుంచో నేను వాయిదా వేస్తూ వస్తున్న నా అవార్డ్ విన్నింగ్ పుస్తకం "సినిమా స్క్రిప్ట్ రచనా శిల్పం" రివైజ్డ్ మూడో ప్రింట్ కూడా త్వరలో పాలపిట్ట బుక్స్ నుంచి రాబోతున్నందుకు హేప్పీ గా ఉంది. త్వరలో నేను ప్రారంభించబోతున్న మైక్రోబడ్జెట్ ఫిలింస్ ప్రాజెక్ట్ సందర్భంలోనే ఈ రెండూ పాలపిట్ట నుంచి రావటం అనేది నిజంగా నన్ను మరింత సంతోషపెడుతున్న విషయం.
  

2 comments: