Tuesday 25 December 2012

అత్యంత అసహ్యకరమయిన సీన్


మా చిన్నతనంలో, దాదాపు మేం చూసిన ప్రతి రెండో సినిమాలో ఒక రేప్ సీన్, ఒక క్లబ్ సాంగ్ తప్పనిసరిగా ఉండేవి.

అప్పటి జ్యోతి లక్ష్మి, జయమాలినిలను తెర మీద క్లబ్ సాంగ్స్ లో చూస్తున్నప్పుడు ... ఆనాటి డ్రెస్సింగ్, డాన్స్ మూమెంట్స్ కే తెగ "ఇదయి" పోయేవాళ్లం. ఇప్పటి హీరోయిన్ల కాస్ట్యూమ్స్, డాన్స్ మూమెంట్స్ తో పోలిస్తే అప్పటిదంతా అసలు లెక్కలోకి రాదు. చెప్పాలంటే - జీరో.

అయితే
- ఆనాటి క్లబ్ సాంగ్స్ ఇచ్చిన కిక్ ని ఇప్పటి సినిమాల్లోని "పబ్" సాంగ్ కూడా ఇవ్వలేకపోతోంది. అది వేరే విషయం.     

కట్ చేస్తే -

రోజుల్లో "ఏస్కో కొక్క కోలా" వంటి క్లబ్ సాంగ్స్ ని ఎంత బాగా ఫీలయ్యి, ఎంత బాగా ఎంజాయ్ చేసే వాళ్లమో ... రేప్ సీన్ రాగానే, ఎంతో చికాగ్గా "ఎప్పుడయిపోతుందిరా బాబూ!" అనుకొనే వాళ్లం. త్యాగరాజు గానీ, సత్యనారాయణ గానీ బయట కనిపిస్తే, మళ్లీ ఇంకో సినిమాలో రేప్ సీన్స్ చేయకుండా 'బాగా తన్నాలి' అనిపించేది

సినిమాలో రెండు నిమిషాల సీన్ కే అంత కృతకంగా, జుగుప్సగా ఫీలయ్యేవాళ్లం

క్రమంగా సినిమాల్లో రేప్ సీన్లు తగ్గిపోయాయి. తగ్గిపోయాయంటే, అట్లా ఇట్లా కూడా కాదు. ఆశ్చర్యకరంగా చాలా చాలా తగ్గిపోయాయిఎప్పుడో ఒకటీ అరా ఏదయినా సినిమాలో వస్తే - అది కూడా అయితే కట్ షాట్స్ లో, లేదంటే సింబాలిక్ గానో "జరిగింది" అని చూపిస్తున్నారు తప్ప ... వెనకటి సినిమాల్లో లాగా చీర లాగటం నుంచి చివరిదాకా చూపించటం లేదు.     

మధ్య విశ్వనాథ్ "శంకరాభరణం" లో ఇలాంటిదే ఒక సీన్; ఇటీవల రాజమౌళి "విక్రమార్కుడు" లో అమిత్ కుమార్ నటించిన ఇంకో సీన్ ... ఇవీ మధ్య కాలం లో వచ్చిన సినిమాల్లో, నేను చూసిన సినిమాల్లో, నాకు బాగా గుర్తున్న రేప్ తరహా సీన్లు! (అమిత్ కుమార్ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసింది నేనే!) రెండు ఉదాహరణల్లోనూ - ఎక్కడా చేజ్ లు, చీర లాగటాలు, టార్చర్లు లేవు. జస్ట్ సింబాలిక్ కట్ షాట్స్! అంతే.  

ఇక నేను పాయింట్ కి రాక తప్పదు... 

దాదాపు
ప్రతి సినిమాలోనూ ఎడా పెడా రేప్ సీన్లు పెట్టిన కాలంలో బయట ఎలాంటి అఘాయిత్యాలు లేవు. ఇప్పుడు సినిమాల్లో రేప్ సీన్లు తగ్గిపోయాయి. బయట దారుణంగా పెరిగిపోయాయి!

ఇప్పటి సినిమాల్లో అసలు రేప్ సీన్లకి విలువే లేదు. ఇంకా చెప్పాలంటే - నేటి రొటీన్ కమర్షియల్ సినిమాల ఫార్మాట్ లో అయితే "రేప్ సీన్" అనేది ఒక అత్యంత అసహ్యకరమయిన సీన్! అసలు ముట్టుకోకూడని సీన్!!

కాల్పనికమయిన సినిమా రంగంలోనే ఇంత భారీ మార్పులుచోటు చేసుకొన్న రోజుల్లో - సాక్షాత్ దేశ  రాజధాని  ఢిల్లీ లోనే దాదాపు ప్రతిరోజూ ఒక రేప్ జరుగుతోంది! గత సంవత్సరం ఒక్క ఢిల్లీ లోనే - 365 రోజుల్లో 453 రేప్ కేసులు రిజిస్టర్ అయ్యాయి!!   ఇంక రిజిస్టర్ కాని కేసులు ఎన్నుంటాయో ఎవరయినా ఇట్టే ఊహించవచ్చు.
  
నిన్నటి "సాక్షి" పత్రికలో - యండమూరి, తణికెళ్ల భరణి, చంద్రబోస్, మంజులా నాయుడు, అమల, యస్వీ కృష్ణా రెడ్డి, సంధ్య, మృణాలిని మొదలయిన వాళ్లంతా అతి  హేయమయిన మొన్నటి ఢిల్లీ రేప్ సంఘటన పైన వారి ఆక్రోశాన్ని, నిరసనను పలు విధాలుగా వెల్లడించారు. అన్నిటిలోకీ నన్ను బాగా కదిలించింది శేఖర్ కమ్ముల ఫీలింగ్స్!

వెరీ సెన్సిటివ్, సెన్సిబుల్ సినిమాలను తీయడానికి ఇష్టపడే అంత సాదా సీదా శేఖర్ కమ్ములే తన అవేదనను అంత తీవ్రంగా, అంత బాహాటంగా వెల్లడించగలిగాడంటే ... ఆయన స్థాయిలో చలించిపోయుంటాడు? హేట్సాఫ్ టూ శేఖర్! శేఖర్ ఫీలింగ్స్ తో నేను 100% ఏకీభవిస్తున్నాను.     

మన దేశ పౌరుల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చివేసి, రెడ్ హేండెడ్ గా దొరికిన పాకిస్తానీ టెర్రరిస్ట్ కసబ్ ను ఉరి తీయడానికి మనకు సంవత్సరాలు పట్టింది. మన పార్లమెంట్ మీద దాడి చేసిన ఇంకో టెర్రరిస్ట్ అఫ్జల్ గురు కి 2004 లోనే మన సుప్రీం కోర్టు ఉరి శిక్ష విధించింది. ఇప్పటికి ఎనిమిదేళ్లు అయిపోయింది. మన వాళ్లు ఉరి తీయాలా వద్దా అనేది ఇంకా 'పరిశీలిస్తున్నారు!'  

ఇక
, యాసిడ్ దాడి కేసులను నాన్ బెయిలబుల్ కేసులుగా చేసి, అలాంటి నేరం చేసే వారికి మరింత తీవ్రమయిన శిక్ష పడేలా చేయటం కోసం పంపించిన ప్రతిపాదనలు మన కేంద్ర ప్రభుత్వం టేబుల్ మీద రెండేళ్ల నుంచీ ఇంకా పెండింగులో ఉన్నాయట!!

ఇలాంటి అసమర్థ, అమానవీయ వ్యవస్థలో మనం సిగ్గు పడుతూ బ్రతకడానికి ప్రధాన కారణం - మన పొలిటీషియన్లు. (అందరూ కాకపోవచ్చు. కానీ, చాలా మంది మాత్రం అవును.) కనీసం ఇప్పుడయినా వాళ్లు కళ్లు తెరచివాళ్ల  బాధ్యతలను గుర్తిస్తే బాగుండు. కానీ, అది ఉట్టి పగటి కల.

నా రొమేనియన్ రైటర్ ఫ్రెండ్ ఒకరు ఎన్నో ఏళ్లుగా ఇండియా చూడ్డానికి రావాలనుకొంటోంది. ఎంతో ప్లాన్ చేసుకొని, చివరికి వచ్చే నెలలో రావటానికి అన్నీ ప్లాన్ చేసుకొంది.

మొన్నటి న్యూస్ ని ఇంటర్నెట్ లో చదివీ, చూసీ, వినీ అంతా తెలుసుకొన్న రచయిత్రి ఇప్పుడు ఇండియా రావటమే కాన్సిల్ చేసుకొంది. మొన్నటి ఢిల్లీ రేప్ ఘటన ఒక్కటే కాదు... మధ్య ఒక ఫారిన్ టూరిస్టు ను కూడా గ్యాంగ్ రేప్ చేసిన ఘన చరిత్ర మన దేశ రాజధాని ఢిల్లీ కి ఉంది. పాత న్యూస్ ను కూడా రైటరే గుర్తు చేసింది నాకు!    

ఇప్పుడు నేను నిజంగా సిగ్గు పడుతున్నాను. ఎందుకో మీకు తెలుసు...

8 comments:

 1. బాగా చెప్పారు

  ReplyDelete
 2. @ఇలాంటి అసమర్థ, అమానవీయ వ్యవస్థలో మనం సిగ్గు పడుతూ బ్రతకడానికి ప్రధాన కారణం - మన పొలిటీషియన్లు. (అందరూ కాకపోవచ్చు. కానీ, చాలా మంది మాత్రం అవును...
  అందరూనూ...రాజకీయాలోనికి వచ్చాక అన్నీ వదిలేస్తారు...చదూకున్న వాళ్ళనూ చూసా నాయకులను దగ్గరగా ....మనం నమ్మలేం..సక్సస్ కోసం అన్ని నీచాలకు తెర తీసి..కనీసమయిన అసమర్ధత..మానవత్వం కూడా వదిలేస్తారు...

  ReplyDelete
 3. @arjunbolla, Thank you!
  @kvsv, మీతో ఏకీభవించక తప్పదు. నిజం కాబట్టి.

  ReplyDelete
 4. మన దేశ సాంస్కృతిక వైభవంని అత్యాచారాల గణాంకాలు డామినేట్ చేస్తున్నాయి. పర్యాటకులు భయపడుతున్నారంటేనే తెలుసుకోవచ్చు మన విలువ ఏ పాటిదో! :(

  ReplyDelete
  Replies
  1. బాగా చెప్పారు, వనజ గారూ! మీ కామెంట్‌కి ధన్యవాదాలు.

   Delete
 5. మనం మనదేశపు గొప్ప సంస్కృతి అని చెప్పుకునేది ఉపన్యాసకేసరుల వాక్కులలోనూ, పాతబడిపోయిన గ్రంథాల్లోనూ మాత్రమే కనిపిస్తోంది. వాస్తవికజగత్తులో కనిపించేది మాత్రం విచ్చలవిడితనం మాత్రమే. దానిలో సాంస్కృతికవిలువలు ఏమీ‌ ఉండవు కదా!

  ReplyDelete
 6. The change has to come in the mindset of men.

  Some men will be neglected by the parents in childhood and they also fail to earn respect from the society. Every male child may not have a good sibling or sister in their home. Also some men undergo physical abuse from friends and family and don't possess enough self confidence. Records show that such men mostly transform into bad persons and do these kind of crimes.

  So they must be counselled properly by arranging sessions from good psychologists. We have a lot of good psychologists and psychiatrists. Government should use their services (if not for free) by arranging counselling centres in all cities, to teach the do's and dont's against women in the society.

  They must be taught to control their emotions, understand the sensitivity of a women, behave properly with women of all ages and they should be made to possess a goal in their life. If any person feels that his behaviour against women is not good, he must be made to enrol himself for these sessions. That way, if the change comes in the mindset of all men, i am sure that the rapes can be 100% prevented. Hope this happens one day!

  ReplyDelete
  Replies
  1. Let's hope so.
   Thank you for your comments, dskanth!

   Delete