Tuesday 18 December 2012

నో బడ్జెట్ సినిమా, లో బడ్జెట్ సినిమా


మధ్య ఇంగ్లిష్ లో ఒక "నో బడ్జెట్ సినిమా" చూశాను. అది హాలీవుడ్ లో కలెక్షన్లను కేక పెట్టించిన హారర్ సినిమా! ఒక్క క్షణం విస్మయం. యాంగిల్ లో మరింత స్టడీ చేశాను. అద్భుతం. ఎన్నో ఉన్నాయి అలాంటి ఉదాహరణలు!!

మరొక సినిమా... రెండంటే రెండే కేరెక్టర్లు. ఒక హీరో, ఒక హీరోయిన్. అంతే. ఒక అద్భుత దృశ్యకావ్యం అది! సుమారు 8 యేళ్ల తర్వాత దాని సీక్వెల్ తీశారు. అదే ఇద్దరు ఆర్టిస్టులు, అదే టీమ్. మళ్లీ అదే సక్సెస్.

ఇంకో సినిమా... ఇద్దరు స్వంత అన్నదమ్ములే ఫిలిం తీశారు. ఒకరు హీరో. ఒకరు డైరెక్టర్. వీరికి తోడు ఒక హీరోయిన్, వారి సొంత కెమెరా. అంతే. యూరోప్ లో ఒక అందమైన కంట్రీ కి వెళ్లారు. సినిమా మొత్తం అక్కడే తీశారు. నో క్రూ. నో హంగామా. అంతా నేచురల్ లైటింగ్, నేచురల్ లొకేషన్స్. పైగా, కెమెరాతో షూట్ చేస్తుంటే వాళ్లు ఒక సెన్సేషన్ క్రియేట్ చేయబోయే సినిమా షూట్ చేస్తున్నారని ఎవరూ అనుకోలేరు. బేసిక్ వ్యాపార సూత్రాలకి పూర్తి విరుధ్ధంగా, బాక్ అండ్ వైట్ లో తీసిన సినిమా కూడా మిలియన్లు కురిపించింది. అన్నిటికంటే విచిత్రమేంటంటే, సినిమాను అసలు థియేటర్స్ లో రిలీజ్ చేయలేదు! సో, థాంక్స్ టు ఇంటర్నెట్...

ఇలా ఎన్నయినా ఉదాహరణలు చెప్పుకోవచ్చుఅయితే "నో బడ్జెట్", లేదంటే, "లో బడ్జెట్!"...

ఇక్కడే ఇంకో విషయం చెప్పుకోవాలి. ఒక హాలీవుడ్ యాక్టర్-కమ్-ఫిలిం మేకర్ అయితే తాను తీసే ఫీచర్ ఫిలింస్ కోసం ఒక అంకె కి ఫిక్స్ అయిపోయాడు. అదెంతో తెలుసా? కేవలం 9 వేల డాలర్లు! ఇవాళ్టి డాలర్ రేట్ ప్రకారం (54.68) కేవలం 4,92,120 రూపాయలు!! అదీ ఆయన సినిమా బడ్జెట్

అలాగని, ఇవన్నీ ఆర్ట్ సినిమాలో .. లేకపోతే ఆడని సినిమాలో కావు. 100% కమర్షియల్ సినిమాలు. కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు

కట్ చేస్తే -

ఇక్కడ మన సీన్ పూర్తిగా డిఫరెంట్. కొంచెం ఆలస్యంగానయినా, ఇప్పుడిప్పుడే మనవాళ్లు బయటికొచ్చారు. బయట ఏం జరుగుతోందో తెలుసుకొని, లేటెస్ట్ టెక్నాలజీ తో మెల్లగా రంగం లోకి దిగుతున్నారు. ఒకరిద్దరు ఆల్రెడీ రుచి చూపించారు.

సమస్యల్లా ఒక్కటే. ఇలా తీసే సినిమాలకు మన దగ్గర 101 టెక్నికల్ అభ్యంతరాలు, యూనియన్ అభ్యంతరాలు! తర్వాత రిలీజ్ కి సపోర్ట్ అసలు ఉండదు... ఏదయినా పవర్ ఫుల్ నెట్ వర్కింగ్ లింక్ ఉంటే తప్ప!!  

శాటిలైట్ రైట్స్ లాగే - సినిమా క్వాలిటీని, సెట్ అప్ ను బట్టి... "రిలీజ్ రైట్స్" లాంటిది కూడా ఒకటి ఎవరైనా క్రియేట్ చేయగలిగితే బాగుంటుంది. క్రియేటర్స్ కు, డిస్ట్రిబ్యూటర్స్ కూ ఇద్దరికీ బాగుంటుంది. ప్రోత్సాహం తో - నిజంగా సినిమా మీద ప్యాషన్ ఉన్నవాళ్లు, రొటీన్ ను కాసేపు పక్కన పెట్టి, "వావ్!" అనిపించే సినిమాలు తీయడానికి మరో అడుగు ముందుకేస్తారు. అప్పుడు క్రియేటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తో బాటు, ప్రేక్షకులకూ బాగుంటుంది... 

వినడానికి ఇదొక "నాన్ సెన్స్" ప్రపోజల్ లా ఉండొచ్చు. కానీ, ఆలోచించాల్సిన విషయమేనని నా ఉద్దేశ్యం. దీని గురించి మరో సారి మరింత వివరంగా రాస్తాను.

నిన్న రాత్రే మరొక "లో బడ్జెట్" ఇంగ్లిష్ సినిమా చూశాను. సినిమాలో అంత ఏమీ లేదు కానీ, అసలు "వన్ మ్యాన్ ఫిలిమ్ మేకింగ్" అన్న కాన్సెప్ట్ నన్ను బాగా ఆలోచింపజేసింది. ఒక్క యాక్టింగ్ తప్ప, ఫిలిమ్ మేకింగ్ ప్రాసెస్ మొత్తం ఒక్కడే చేశాడు! సినిమాటొగ్రఫీ, ఎడిటింగ్ తో సహా...
  

4 comments:

  1. meeru chusina cinema names share cheyandi sir. memu kuda chustam.

    Please remove word verification in comments.

    ReplyDelete
  2. ఒక్కో సినిమా గురించి విడి విడిగా, వివరంగా రాయాలనే ఈ బ్లాగ్ లో ఇలా రాశాను, పేరు లేకుండా. తర్వాత టైటిల్ తో పాటు మళ్లీ రాస్తాను త్వరలోనే. థాంక్ యూ!

    ReplyDelete