Thursday 13 December 2012

ఏది ముఖ్యం?

మధ్య నా బర్త్ డే నాడు, నాకు అత్యంత ప్రియమైన స్టుడెంట్స్ లో ఒకరు ఒక ప్రశ్న అడగటం జరిగింది. " బర్త్ డే కి స్పెషల్ గా మీరు ఏదయినా కొత్త నిర్ణయం తీసుకుంటున్నారా? ఇలా కొన్ని స్పెషల్ అకేషన్లలో తీసుకొనే నిర్ణయాల పట్ల మీకు అసలు నమ్మకం ఉందా??" అంటూ.

నిజానికి నాకు అలాంటి నమ్మకాలు అసలు లేవు...

ఒక మనిషి నిజంగా ఏదయినా మానేయాలనుకొన్నా, లేదంటే, కొత్తగా ఏదయినా ప్రారంభించాలనుకొన్నా - దానికి ప్రత్యేకంగా న్యూ యియర్లు, బర్త్ డేలు, మరేవో స్పెషల్ డేలూ, ముహూర్తాలూ అవసరం లేదు అన్నది నా వ్యక్తిగత అభిప్రాయం.   అదే విషయం నా స్టుడెంట్ తో చెప్పాను

నిజానికి నాకు తెలిసిన ఎంతోమంది, కొత్త సంవత్సరం సందర్భంగా, ఎన్నో సార్లు ఎన్నో కొత్త నిర్ణయాల్ని తీసుకొన్నారు. కొన్ని రోజుల్లో షరా మామూలే! సో, ఇలా తీసుకొనే నిర్ణయాల పట్ల నాకంత నమ్మకం లేదు. ఇంకా చెప్పాలంటే, అసలు ఏ మాత్రం  లేదు

నిర్ణయాలు క్షణంలో అయినా తీసుకోవచ్చు. తర్వాత, కొన్ని ప్రత్యేక పరిస్థితులను బట్టి, అప్పటి మానసిక స్థితిని బట్టి… వాటిని మార్చుకోవచ్చు కూడా. అంత దాకా ఎందుకు... ఒక చిన్న సంఘటన చాలు. మన ఆలోచనా విధానాన్నీ, మన జీవన పథాన్నీ సంపూర్ణంగా మార్చివేయడానికి

మధ్యే, కేవలం కొన్ని రోజుల వ్యవధిలో - మా పెద్దబ్బాయి ప్రణయ్, చిన్నబ్బాయి ఫ్రియతమ్ నాతో ఏకాంతంగా ఉన్నప్పుడు చెరొక ప్రశ్న చాలా క్యాజువల్ గా అడిగారు. అతి చిన్న ప్రశ్నలవి. కానీ, వాటికి నిజంగా నాదగ్గర సమాధానం లేదు! రెండు ప్రశ్నలూ నన్ను కనీసం ఒక వారం పాటు ఒక సంపూర్ణ అంతర్ముఖుడ్ని చేశాయి. చివరకు, ఒకే ఒక్క గంట స్వీయ విశ్లేషణ తర్వాత నిన్ననే ఒక నిర్ణయం తీసుకున్నాను.

ఇప్పటివరకూ నా జీవితంలో నేను తీసుకున్న నిర్ణయాలన్నిటిలోకెల్లా అత్యుత్తమమయిన నిర్ణయం అది

కొన్ని అనాలోచిత నిర్ణయాలు, కొన్ని ఊహించని పరిస్థితులు, కొన్ని వంచనలు - వీటి కారణంగా సుమారు ఆరేళ్ల క్రితం నా క్రియేటివ్ ఫ్రీడమ్ ని నేను కోల్పోయాను. దాన్ని తిరిగి పొందే క్రమంలో మరెన్నో "ఇన్స్ టంట్" నిర్ణయాలు నన్ను మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టాయి. బట్, డేమ్ ష్యూర్ గా అతి త్వరలోనే, నేను కోల్పోయిన నా ఫ్రీడమ్ను తిరిగి పొందబోతున్నాను. అందులో నో డౌట్...

అయితే నిన్న నేను తీసుకున్న నిర్ణయం  12.12.12 సందర్భంగా తీసుకున్న నిర్ణయం మాత్రం కాదు! నేను వీటిని నమ్మనని ముందే చెప్పాను. నిన్న మ్యాజిక్ డేట్ రావటం అనేది కేవలం యాదృఛ్ఛికం. కానీ, నిన్నటి నిర్ణయం మాత్రం 12.12.12 ను నాకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఇటీవలి యాక్సిడెంట్, తర్వాత సుమారు 9 నెలల బెడ్ రెస్ట్... నన్నూ, నా ఆలోచనా విధానాన్నీ సంపూర్ణంగా మార్చివేశాయి. నేను కోల్పోయిన క్రియేటివ్ ఫ్రీడమ్ ని తిరిగిపొందే క్రమంలో మైక్రో బడ్జెట్ ఫిలిమ్లు ఒక అతి చిన్న భాగం మాత్రమే. ఇంకా చెప్పాలంటే, ఒక సపోర్టింగ్ ప్లాట్ ఫాం  మాత్రమే. సినిమాలు కాకుండా ఇంకెన్నో చేయబోతున్నాను. అవే నాకు ముఖ్యం అని నిన్నటి వరకూ అనుకున్నాను.

కానీ, ఏది చేసినా, ఎలా చేసినా - ఇకనుంచీ, నా దినచర్యలో ఒక పెద్ద "చంక్" మళ్లీ నా పిల్లల కోసం కెటాయించదలిచాను. వారితో నేను గడిపే ప్రత్యేక సమయమే నాకు అన్నిటికన్నా ముఖ్యం.  

ఎన్నెన్నో టెన్షన్స్ ఎదుర్కొన్నాను. ఎన్నెన్నో నిర్ణయాలు తీసుకున్నాను. కానీ, ఇటీవలి కాలంలో నేను తీసుకున్న ఎన్నో నిర్ణయాల్లో - నిర్ణయం ఇచ్చినంత సంతోషం మరేదీ నాకివ్వలేదు. ఎందుకంటే, సుమారు ఒక 6-7 ఏళ్ల తర్వాత వారితో నేను ఎంత ఫ్రీ గా గడుపుదామనుకొన్నా నాపిల్లలకు అప్పుడు నాతో గడపటానికి సమయముండదు!  

మన ప్రొఫెషన్లు, పరిస్థితులు, సమస్యలు... ఎన్నో ఊహించని అప్స్ అండ్ డౌన్స్ అనేవి జీవితంలో సర్వ సాధారణం. వాటి ట్రాక్ వాటిదే. కానీ, నన్ను గురించి జీవిత పర్యంతం గుర్తు పెట్టుకొనే చిన్ని చిన్ని జ్ఞాపకాలను అందించే క్వాలిటీ టైమ్ ని  నేను నా పిల్లలకు, వారికి అవసరమైన సమయంలో ఇవ్వడం అనేది చాలా అవసరం. అది నా బాధ్యత కూడా. 

జీవితంలో
ఎన్నో రొటీన్ టెన్షన్లూ, టార్గెట్ల నేపథ్యంలో - సుమారు ఆరేళ్ల తర్వాత, నాపిల్లల కోసం మళ్లీ  నిర్ణయం తీసుకున్నందుకు ఇప్పుడు నేనెంతో హేప్పీగా ఉన్నాను. నా పిల్లల కళ్లల్లోనూ అదే హేప్పీనెస్  నాకు మళ్లీ కనిపిస్తోంది


No comments:

Post a Comment