Friday 14 December 2012

ఒక నెల, 3699!

3699 ... నిజంగా అంకె నాకు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. సరిగ్గా ఒక నెల క్రితం, నేను కొత్తగా "Toatal Page Views” సైట్ మీటర్ ని నా బ్లాగ్ కి తగిలించాను. ఇవాళ అంతా ఒకసారి రివ్యూ చేస్తున్నపుడు అంకె నాకెందుకో ఆకర్షణీయంగా కనిపించింది.   నా దృష్టిలో ఇది అంత పెద్ద అంకేమీ కాదు. కాని, కొంతవరకు "చెప్పుకోదగ్గ" అంకెనే!

నిజానికి బ్లాగ్ ని ప్రారంభించింది ఆగస్ట్ లో అయినప్పటికీ - అప్పుడు దీన్ని క్రియేట్ చేసిన ఉద్దేశ్యం వేరు. తర్వాత, రకరకాల ట్విస్ట్ అనంతరం - దీన్నే నా ప్రధానమయిన పర్సనల్ బ్లాగ్ గా చేసుకున్నాను. నాకు రాయాలనిపించిన ప్రతీదీ ఇందులో రాయటం ప్రారంభించాను. అలా డిసైడ్ అయ్యాకే సైట్ మీటర్ ని మధ్యే యాడ్ చేశాను.

నాకున్న రకరకాల రొటీన్ టెన్షన్లూ, వ్యాపకాలూ, స్వల్ప అనారోగ్యం మధ్య - నెల రోజుల్లో సుమారు ఒక డజన్ బ్లాగ్ పోస్టులు రాసి ఉంటాను. (మొత్తం 42, ఇవాల్టికి!) 12 పోస్టులకే ఒక నెలలో 3699 పేజ్ వ్యూస్ అంటే... రోజుకి సగటున 123 పేజ్ వ్యూస్ అన్నమాట! ఫరవాలేదు... 

నా కొత్త సినిమా ప్రాజెక్టుకోసం ఆఫీస్ ఓపెన్ చేశాక, నా బ్లాగింగ్ మరింత పుంజుకుంటుంది. మరింత అట్రాక్టివ్ గా కూడా ఉంటుంది. సినిమాలు, ఆర్టిస్టులు, స్క్రీన్ టెస్టులు, షూటింగులు, ఫ్రెండ్స్, ప్యాషన్స్, టెన్షన్స్, హిపోక్రసీలు, మాస్కులు, నిర్భయమైన నిజాలు... అన్నీ మీరు బ్లాగ్ లో చదువుతారు

అలా, ఇంకో ఆరు నెలల్లోనే బ్లాగ్ పైన 100,000 పేజ్ వ్యూస్ అంకెను చూడాలన్నది నా కోరిక...



No comments:

Post a Comment