Sunday 23 December 2012

100% సినిమా!


  రోజునుంచీ, ఒక 365 రోజులు ... నా జీవితం సినిమా. తిన్నా, తినకపోయినా, పడుకున్నా, లేచినా, ఏదయినా చదివినా, చూసినా, రాసినా, నాకు పిచ్చిపట్టినా, ఎవరికయినా పట్టించినా... రోజు నుంచి నిజంగా ఒక సంవత్సరం సినిమానే నా జీవితం, నా సర్వస్వం. (నా ఇద్దరు పిల్లల కోసం నేను వ్యక్తిగతంగా కెటాయించుకున్న సమయాన్ని తప్పించి!).

"23 తేదీ ముక్కోటి ఏకాదశి, చాలా మంచి రోజు. ఇది మిస్సయితే, ఇంక ఇప్పట్లో ఇంకో 2 నెలల వరకు మంచి రోజులు లేవు. సో, ఆఫీసంటూ ప్రారంభించాలనుకొంటే, రోజే "ఎలాగయినా" ప్రారంభించండి", అని అస్సిస్టెంట్ ప్రొఫెసర్, ఆస్ట్రాలజీలో స్పెషలిస్టూ అయిన నా ప్రియ శిష్యుడు మూర్తి గట్టిగా చెప్పాడు. నా శిష్యుడి స్పెషలైజేషన్ నాకు తెలుసు కాబట్టి, "అలాగే", మా మూర్తి చెప్పిన విధంగానే, నా కొత్త చిత్రం కోసం ఆఫీసు ప్రారంభ కార్యక్రమం ఇవాళ ఉదయమే నిరాడంబరంగా, విజయవంతంగా పూర్తి చేశాము.  

ఆస్ట్రాలజీని
నమ్మాలా వద్దా, అసలు మంచి రోజులేంటి చెడ్డ రోజులేంటి అన్నది కాదు ఇక్కడ ప్రశ్న. వీటన్నిటికంటే మించిన ముఖ్యమైన విషయం - మళ్లీ కొంతకాలం సినిమాలు చేయాలన్న నా సంకల్పం. నా వ్యక్తిగత అవసరం.

సంకల్ప సిధ్ధి కోసం - ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఇవన్నీ తోడ్పడుతున్నపుడు వీటిని ఫాలో కావటంలో తప్పు లేదన్నది నా లాజిక్. నా లాజిక్కే నా కమిట్ మెంట్. ఇదంతా ఒక అర్థం కాని గందరగోళం లా ఉంటే, దీన్ని ఇక్కడితో వదిలేయండి.   

మొత్తానికి నా తర్వాతి చిత్రం కోసం ఒక ఆఫీస్ ని ఓపెన్ చేశాం. ఇక రోజు నుంచి  నూటికి నూరు శాతం నాకు సినిమానే జీవితం. ఇదే పని. మరో అలోచన లేదు.

ఒక వారం తర్వాత నుంచి - ఆఫీసులో ఇన్వెస్టర్లతో మీటింగులు, కథా చర్చలు, మ్యూజిక్ సిట్టింగులు, ఆడిషన్లు, అగ్రిమెంట్లు, ప్రొడక్షన్ ఏర్పాట్లు ... అంతా హడావిడే. ఇంకా చెప్పాలంటే - టెన్షన్ తో కూడిన ఎక్సయిట్ మెంట్! అందులోనే ఆనందం. ఆనందం లోనే క్రియేటివిటీ... 

నా "బిగ్ 5" మిత్రుల్లో దయానంద్ రావ్, ప్రతాప్ రెడ్డి పొద్దుటే వచ్చారు. నా కొత్త ప్రాజెక్టు కోసం, కొత్త ఆఫీసు ప్రారంభం సందర్భంగా - నాకు బెస్ట్ విషెస్ చెప్పటం కోసం, నాప్రాజెక్ట్ సక్సెస్ కోసం దేముడి ఆశీస్సులు కోరటం కోసం - పొద్దుటే, సిటీలో ఒక మూల నుంచి మరో మూలకి నా కోసం కార్లో వచ్చారు

ఇలా ఇంకా కొన్ని వెరీ గుడ్ సిగ్నల్స్ ఉన్నాయి. వాటన్నిటినీ ఇక్కడ చెప్పటం సాధ్యం కాదు…

నా ఫ్రెండ్స్ కి థాంక్స్ చెప్పటం అనేది చాలా కృత్రిమంగా ఉంటుంది. సో, నో ఫార్మాలిటీస్! నాక్కావల్సిందీ, నేను కోరుకొనేదీ... కడదాకా కొనసాగే మా స్నేహం.   
 


4 comments: